iDreamPost
android-app
ios-app

Yuvraj Singh Biopic: భారీ బడ్జెట్ తో వెండితెరపైకి యువరాజ్ బయోపిక్..

  • Published Aug 20, 2024 | 11:08 AM Updated Updated Aug 20, 2024 | 11:08 AM

టీమిండియా దిగ్గజ క్రికెటర్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ బయోపిక్ త్వరలోనే సినిమాగా రాబోతోంది. బాలీవుడ్ బడా ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ ఈ బయోపిక్ ను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

టీమిండియా దిగ్గజ క్రికెటర్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ బయోపిక్ త్వరలోనే సినిమాగా రాబోతోంది. బాలీవుడ్ బడా ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ ఈ బయోపిక్ ను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Aug 20, 2024 | 11:08 AMUpdated Aug 20, 2024 | 11:08 AM
Yuvraj Singh Biopic: భారీ బడ్జెట్ తో వెండితెరపైకి యువరాజ్ బయోపిక్..

సినిమాలకు, క్రికెట్ కు విడదీయరాని సంబంధం ఉంది. చాలా మంది క్రికెటర్లు ఇండస్ట్రీకి చెందిన నటీమణులను పెళ్లి చేసుకున్నారు. అలాగే దిగ్గజ క్రికెటర్ల జీవిత కథలు సినిమాగా వెండితెరపై ఆవిష్కృతం అయ్యాయి. ఇక ఇప్పుడు మరో బయోపిక్ ఇటు క్రికెట్ లవర్స్ ను అటు సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతోంది. టీమిండియా మాజీ ప్లేయర్, వరల్డ్ కప్ హీరో, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ జీవిత చరిత్ర త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతోంది. ఇందుకు సంబంధించి వివరాలను తాజాగా మేకర్స్ వెల్లడించారు.

యువరాజ్ సింగ్.. టీమిండియా క్రికెట్ చరిత్రలోనే కాక.. వరల్డ్ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ లతో భారత జట్టుకు ఎన్నో తిరుగులేని విజయాలను అందించాడు. మరీ ముఖ్యంగా టీమిండియా 2011 వన్డే వరల్డ్ కప్ గెలవడంలో యువీది కీలక పాత్ర. ఇక ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డును నమోదు చేశాడు ఈ సిక్సర్ల కింగ్. ఇదిలా ఉండగా.. ఓ వైపు క్యాన్సర్ తో పోరాడుతూనే జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించాడు. దాంతో వ్యక్తిగతంగా ఎంతో మందికి ఆదర్శప్రాయుడిగా యువీ నిలిచాడు. అలాంటి ఓ దిగ్గజ క్రికెటర్ జీవితం వెండితెరపై ఆవిష్కృతం కానుంది. అవును త్వరలోనే యువీ బయోపిక్ రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

టీ-సిరీస్.. బాలీవుడ్ లో  బడా ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరుగాంచిన విషయం తెలిసిందే. ఈ సంస్థే యువీ బయోపిక్ ను భారీ బడ్జెట్ తో నిర్మించబోతోంది. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్స్ భుషణ్ కుమార్, రవిభాగ్ చందక్ అధికారికంగా వెల్లడించారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అన్ని విషయాలు వెల్లడికానున్నాయి. అయితే సిక్సర్ల కింగ్ బయోపిక్ లో హీరోగా ఎవరు నటిస్తారు? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. దాంతోపాటుగా యువీ సరసన నటించే ఆ బ్యూటీ ఎవరు? అంటూ నెటిజన్లు ఆరా తీయడం మెుదలుపెట్టారు. కాగా.. ఇప్పటికే ఎంతో మంది క్రీడాకారులు జీవితాలు సినిమాలుగా వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. మరి త్వరలోనే రాబోతున్న యువీ బయోపిక్ ఏ రేంజ్ లో హిట్ అవుద్దో చూడాలి. యువీ బయోపిక్ లో ఏ హీరో అయితే సూట్ అవుతాడు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by tseriesfilms (@tseriesfilms)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom