iDreamPost
android-app
ios-app

Mohammed Shami: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో షమీ కచ్చితంగా ఆడతాడు.. కానీ ఓ కండీషన్: జై షా

  • Published Aug 20, 2024 | 9:02 AM Updated Updated Aug 20, 2024 | 9:02 AM

బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో షమీ కచ్చితంగా ఆడతాడని షా అన్నాడు. అయితే ఇక్కడ ఓ కండీషన్ ఉన్నట్లు చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు.

బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో షమీ కచ్చితంగా ఆడతాడని షా అన్నాడు. అయితే ఇక్కడ ఓ కండీషన్ ఉన్నట్లు చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు.

Mohammed Shami: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో షమీ కచ్చితంగా ఆడతాడు.. కానీ ఓ కండీషన్: జై షా

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ తర్వాత అతడు జట్టుకు దూరమైయ్యాడు. చీలమండల గాయానికి లండన్ లో శస్త్ర చికిత్స చేసుకున్న షమీ.. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. ప్రాక్టీస్ కూడా మెుదలుపెట్టాడు. ఈ క్రమంలో బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో షమీ కచ్చితంగా ఆడతాడని షా అన్నాడు. అయితే ఇక్కడ ఓ కండీషన్ ఉన్నట్లు చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు.

వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ తర్వాత టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ మళ్లీ గ్రౌండ్ లో కనిపించలేదు. చీల మండల గాయం కారణంగా అతడు జట్టుకు దూరం కావాల్సి వచ్చింది. లండన్ లో శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ.. ప్రస్తుతం తిరిగి ప్రాక్టీస్ మెుదలుపెట్టాడు. అయితే మునుపటి వేగాన్ని మాత్రం ఇంకా అందుకోలేకపోతున్నాడు. దానికి ఇంకాస్త టైమ్ పడుతుంది. ఈ నేపథ్యంలో ఆసీస్ గడ్డపై జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మహ్మద్ షమీ ఆడబోతున్నాడని వెల్లడించాడు బీసీసీఐ కార్యదర్శి జై షా.

జై షా మాట్లాడుతూ..”బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టు సిద్ధంగా ఉంది. స్టార్ బౌలర్ విశ్రాంతి తీసుకొని ఫ్రెష్ గా ఉన్నాడు. అతడికి తోడు మహ్మద్ షమీ అప్పటి వరకు ఫిట్ నెస్, ఫామ్ ను నిరూపించుకుంటాడు. ఈ సిరీస్ లో షమీ కచ్చితంగా ఆడతాడు. అయితే.. అతడి ఫిట్ నెస్ పై ఎన్సీఏ ఇచ్చే సర్టిఫికెట్ పై ఇది ఆధారపడి ఉంది. ఆసీస్ గడ్డపై షమీ సేవలు చాలా అవసరం. దీంతో పాటుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రూపంలో అనుభవం గల ప్లేయర్లు ఉండనే ఉన్నారు” అంటూ జై షా చెప్పుకొచ్చాడు. ఆసీస్ గడ్డపై షమీ 31 వికెట్లు పడగొట్టాడు. కాగా.. ఆస్ట్రేలియాతో సిరీస్ కు ముందు ప్రాక్టీస్ కోసం రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున షమీ బెంగాల్ తరఫున బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది.