SNP
Yuvraj Singh, MS Dhoni: భారత దిగ్గజ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. అందులో పాక్ ఆటగాడికి కూడా చోటిచ్చాడు. తన శత్రువు ఫ్లింటాఫ్ కూడా ఉన్నాడు. వారితో పాటు ఇంకెవరో ఇప్పుడు చూద్దాం..
Yuvraj Singh, MS Dhoni: భారత దిగ్గజ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. అందులో పాక్ ఆటగాడికి కూడా చోటిచ్చాడు. తన శత్రువు ఫ్లింటాఫ్ కూడా ఉన్నాడు. వారితో పాటు ఇంకెవరో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తాజాగా కెప్టెన్‌గా ఓ ప్రతిష్టాత్మక ట్రోఫీ సాధించాడు. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ పేరుతో ఓ ప్రతిష్టాత్మక టోర్నీ జరిగింది. అందులో ఇండియా, పాకిస్థాన్, ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు పాల్గొన్నాయి. ఆయా దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు ఈ టోర్నీలో హోరాహోరీగా పోడారు. అంతిమంగా.. ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టుపై ఇండియా ఛాంపియన్స్ జట్టు విజయం సాధించి.. కప్పు గెలిచింది. ఇండియా ఛాంపియన్స్ టీమ్‌కు కెప్టెన్‌గా యువరాజ్ సింగ్ వ్యవహరించాడు. భారత జట్టుకు కెప్టెన్ అవ్వలేకపోయినా.. ఆలోమోస్ట్ బెస్ట్ టీమ్‌తో ఒక ట్రోఫీ గెలిచాడు. ఈ కప్పుతో యువీ ఖాతాలో అండర్ 19 వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్ ట్రోఫీతో పాటు ఇప్పుడు ఈ లెజెండ్స్ ట్రోఫీ కూడా గెలిచాడు.
అయితే.. పాకిస్థాన్‌పై ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించాకా.. యువరాజ్ తన ఆల్‌టైమ్ ప్లేయింగ్‌ను ప్రకటించాడు. అంటే అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన అన్ని దేశాల ఆటగాళ్లు నుంచి బెస్ట్ 11 మందిని ఎంపిక చేసి.. ఇది తన ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ అంటూ యువీ ప్రకటించాడు. అయితే.. ఆ టీమ్‌లో టీమిండియా కెప్టెన్, దేశానికి మూడు కప్పులు అందించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరును కూడా యువీ తన ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చాడు కానీ, ధోనిని మాత్రం పట్టించుకోలేదు. మరో విచిత్ర ఏంటంటే.. రెండు వరల్డ్ కప్స్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచినా.. తన పేరును కూడా ఆ ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చుకోలేదు.
మరి యువరాజ్ ప్రకటించిన ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం.. బ్యాటింగ్ ఆర్డర్‌లో కాకుండా.. యువీ ర్యాండమ్‌గా తన ఆల్ టైమ్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. అందులో.. సచిన్ టెండూల్కర్(ఇండియా), రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా), రోహిత్ శర్మ(ఇండియా), విరాట్ కోహ్లీ(ఇండియా), ఏబీ డివిలియర్స్(సౌతాఫ్రికా), ఆడమ్ గిల్‌క్రిస్ట్(ఆస్ట్రేలియా), షేన్ వార్న్(ఆస్ట్రేలియా), ముత్తయ్య మురళీధరణ్(శ్రీలంక), గ్లెన్ మెక్‌గ్రాత్(ఆస్ట్రేలియా), వసీం అక్రమ్(పాకిస్థాన్), ఆండ్రూ ఫ్లింటాఫ్(ఇంగ్లండ్).. ఈ 11 మంది యువీ ఆల్ టైమ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉన్నారు. ధోనికి ప్లేస్ ఇవ్వకపోవడంపై క్రికెట్ కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇంగ్లండ్ ఆల్ రౌండర్ ఫ్లింటాఫ్‌తో యువీ టీ20 వరల్డ్ కప్ 2007 సమయంలో గొడవపడినా అతనికి ప్లేస్ ఇవ్వడం విశేషం. మరి యువీ ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Yuvraj Singh Announced His ALL TIME PLAYING 11
1. Sachin Tendulkar
2. Ricky Ponting
3. Rohit Sharma
4. Virat Kohli
5. AB de Villiers
6. Adam Gilchrist
7. Shane Warne
8. Muttiah Muralitharan
9. Glenn McGrath
10. Wasim Akram
11. Andrew Flintoff pic.twitter.com/5C62rO5aJs— Sayyad Nag Pasha (@nag_pasha) July 15, 2024