వీడియో: సిక్సులతో విరుచుకుపడిన యువీ! 42 ఏళ్ల వయసులోనూ అదే జోరు..

Yuvraj Singh, WCL 2024, West Indies Champions: భారత దిగ్గజ మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తనలో ఇంకా పసతగ్గలేదని నిరూపించాడు. తాజాగా భారీ సిక్సులతో విరుచుకుపడ్డాడు. ఆ సిక్సుల గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Yuvraj Singh, WCL 2024, West Indies Champions: భారత దిగ్గజ మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తనలో ఇంకా పసతగ్గలేదని నిరూపించాడు. తాజాగా భారీ సిక్సులతో విరుచుకుపడ్డాడు. ఆ సిక్సుల గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ గురించి క్రికెట్‌ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత జట్టు 2007లో టీ20 వరల్డ్‌ కప్‌, 2011లో వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచిందంటే.. అందుకు ప్రధాన కారణం యువరాజ్‌ సింగ్‌. ఆ రెండు మెగా టోర్నీల్లోనూ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ అతనే. అలాగే సిక్సులంటే గుర్తుకు వచ్చే పేరు యువీ. టీ20 వరల్డ్‌ కప్‌ 2007లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్‌ బ్రాడ్‌ వేసిన ఓ ఓవర్‌లో ఏకంగా ఆరు సిక్సులు కొట్టి చరిత్ర సృష్టించిన బ్యాటర్‌. అందుకే.. యువీ అంటే సిక్సులు.. సిక్సులు అంటే యువీ. అతను సిక్సులు కొట్టే విధానం ఎంతో స్టైలిష్‌గా సెక్సీగా ఉంటుంది.

అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి యువరాజ్‌ సింగ్‌ రిటైర్‌ అయిన తర్వాత.. అతని ఆటను, ముఖ్యంగా అతని సిక్సులను భారత క్రికెట్‌ అభిమానులు బాగా మిస్‌ అవుతున్నారు. చాలా కాలం తర్వాత.. తన ఆటను బాగా మిస్‌ అవుతున్న క్రికెట్‌ అభిమానులకు మరోసారి తన సిక్సర్ల మజా చూపించాడు యువీ. వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ 2024 టోర్నీలో బరిలోకి దిగాడు యువీ. ఇండియా ఛాంపియన్స్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న యువరాజ్‌.. తాజాగా వెస్టిండీస్‌ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 42 ఏళ్ల వయసులో కూడా యువీ బ్యాటింగ్‌ చూసి క్రికెట్‌ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇంకా ఆ రక్తంలో వేడి తగ్గలేదంటూ సరదాగా సోషల్‌ మీడియాలో పేర్కొంటున్నారు.

ఈ మ్యాచ్‌లో 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 38 పరుగులు చేసి రాణించాడు యువీ. వెస్టిండీస్‌ బౌలర్‌ సులేమాన్‌ బెన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌ తొలి బంతికి డీప్‌ మిడ్‌ వికెట్‌ వైపు ఫోర్‌ కొట్టిన యువీ.. తర్వాత బంతిని డీప్‌ మిడ్‌ వికెట్‌ పై నుంచి భారీ సిక్స్‌ కొట్టాడు. అలాగే.. నవిన్‌ స్టెవార్ట్‌ వేసిన ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో మళ్లీ వరుసగా సిక్స్‌, ఫోర్‌తో అలరించాడు. యువీ కొట్టిన ఈ రెండు సిక్సులు మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచాయి. అయితే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ ఇండియా ఛాంపియన్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 229 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఊతప్ప 43, యువీ 38, గుర్‌క్రీత్‌ సింగ్‌ 86 పరుగులతో రాణించారు. అయితే.. వెస్టిండీస్‌ 5.3 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి 31 పరుగులు చేసిన తర్వాత వర్షంతో మ్యాచ్‌ ఆగిపోయింది. డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం ఇండియాను విజేతగా ప్రకటించారు. మరి ఈ మ్యాచ్‌లో యువీ కొట్టిన సిక్సులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments