iDreamPost
android-app
ios-app

కొత్త వివాదంలో చిక్కుకున్న యువీ, రైనా, భజ్జీ.. వాళ్లు చేసిన తప్పేంటి?

  • Published Jul 15, 2024 | 9:12 PM Updated Updated Jul 15, 2024 | 9:12 PM

Yuvraj Singh: భారత లెజెండ్, వరల్డ్ కప్ హీరో యువరాజ్ సింగ్ కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. అతడితో పాటు దిగ్గజ ఆటగాళ్లు సురేష్ రైనా, హర్భజన్ సింగ్ కూడా కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు.

Yuvraj Singh: భారత లెజెండ్, వరల్డ్ కప్ హీరో యువరాజ్ సింగ్ కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. అతడితో పాటు దిగ్గజ ఆటగాళ్లు సురేష్ రైనా, హర్భజన్ సింగ్ కూడా కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు.

  • Published Jul 15, 2024 | 9:12 PMUpdated Jul 15, 2024 | 9:12 PM
కొత్త వివాదంలో చిక్కుకున్న యువీ, రైనా, భజ్జీ.. వాళ్లు చేసిన తప్పేంటి?

ఇటీవలే టీ20 వరల్డ్ కప్​ను గెలుచుకున్న టీమిండియా ఖాతాలో మరో కప్పు వచ్చి చేరింది. అయితే ఈసారి ట్రోఫీ తీసుకొచ్చింది లెజెండ్స్ కావడం విశేషం. భారత జట్టుకు ఎన్నో ఏళ్ల పాటు సేవలు అందించిన వరల్డ్ కప్ హీరోస్ యువరాజ్​ సింగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ లాంటి దిగ్గజాలు కలసి మరో కప్పు కొట్టారు. యువీ కెప్టెన్సీలో ఇండియా ఛాంపియన్స్ జట్టు.. వరల్డ్ ఛాంపియన్​షిప్ ఆఫ్ లెజెండ్స్-2024 ట్రోఫీని సొంతం చేసుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​ను ఫైనల్ మ్యాచ్​లో చిత్తు చేసి విజేతగా నిలిచింది. శనివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్​లో భారత మాజీ క్రికెటర్లు అందరూ అదరగొట్టారు. గెలుపు తర్వాత జాతీయ పతాకాన్ని ఒక చేతిలో, ట్రోఫీని మరో చేతిలో పట్టి మురిసిపోయారు.

పాక్​ను చిత్తు చేసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్​లో ఇండియా ఛాంపియన్స్ జట్టు ఫుల్​గా సెలబ్రేట్ చేసుకుంది. చిన్న పిల్లల్లా మారి ఎగురుతూ, గంతులు వేస్తూ, ఈలలు గోలలతో తెగ సందడి చేశారు. మిగతా ఆటగాళ్ల కంటే యువరాజ్, హర్భజన్, రైనా కాస్త వెరైటీగా సెలబ్రేట్ చేసుకున్నారు. దెబ్బలు తగిలిన వారిలా, ముసలోళ్ల మాదిరిగా తలుపు తీసుకొని లోపలకు వచ్చారు. అయితే ఎగ్జాక్ట్​గా వాళ్లు ఇలా ఎందుకు చేశారో తెలియదు. ప్రస్తుత పాకిస్థాన్ జట్టులోని ఫాస్ట్ బౌలర్లను టార్గెట్ చేస్తూ ఇలా సెటైరికల్​గా చేశారని నెటిజన్స్ అంటున్నారు. కానీ ఇది దివ్యాంగులను అవమానించడమేనని పారాలింపిక్ ఇండియా కమ్యూనిటీ అంటోంది. వెరైటీగా సెలబ్రేట్​ చేసుకున్న భారత ఆటగాళ్లపై ఆ కమ్యూనిటీ సీరియస్ అయింది.

యువీ, భజ్జీ, రైనాలు కొత్త వివాదంలో చిక్కుకున్నారు. వరల్డ్ ఛాంపియన్​షిప్​ ఆఫ్ లెజెండ్స్ ఫైనల్​లో నెగ్గాక వాళ్లు చేసిన సెలబ్రేషన్స్​పై పారాలింపిక్ ఇండియా కమ్యూనిటీ తీవ్రంగా స్పందించింది. ఇది ఏమాత్రం సెన్సిటివిటీ లేని బిహేవియర్ అని.. క్రికెట్ స్టార్ల నుంచి ఇది ఊహించలేదని తెలిపింది. ఇతరుల వైకల్యాన్ని కించపరిచేలా గంతులు వేయడం కరెక్ట్ కాదని.. ఇదేమైనా జోక్ అనుకుంటున్నారా అని ఫైర్ అయింది పారాలింపిక్ ఇండియా కమ్యూనిటీ. ఇలాంటి చర్యలకు పాల్పడిన యువీ, భజ్జీ, రైనా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ ముగ్గురు మాజీ క్రికెటర్లు చేసిన పని పూర్తి బాధ్యతారాహిత్యమని ప్రముఖ పారా అథ్లెట్, బ్యాడ్మింటన్ స్టార్ మానసి జోషి తప్పుబట్టారు. అయితే ఈ కాంట్రవర్సీపై యువీ, రైనా, భజ్జీల్లో ఇంకా ఎవరూ రియాక్ట్ కాలేదు. మరి.. ఈ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.