ప్రపంచ క్రికెట్‌ను శాసించిన బ్రెట్‌ లీని పిచ్చకొట్టుడు కొట్టిన పఠాన్‌!

IND vs AUS, Brett Lee, Yusuf Pathan, WCL 2024: అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో అల్లాడించిన బ్రెట్‌ లీని తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌ సూపర్‌బ్యాటింగ్‌తో ఉతికి ఆరేశాడు. ఆ విధ్వంసం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

IND vs AUS, Brett Lee, Yusuf Pathan, WCL 2024: అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో అల్లాడించిన బ్రెట్‌ లీని తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌ సూపర్‌బ్యాటింగ్‌తో ఉతికి ఆరేశాడు. ఆ విధ్వంసం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఒకప్పుడు అతని బౌలింగ్‌లో ఆడాలంటే హేమాహేమీ బ్యాటర్లే భయపడేవారు. రన్స్‌ చేయడం తర్వాత సంగతి ముందు.. అవుట్‌ కాకుండా ఉంటే చాలని అనుకున్న బ్యాటర్లు ఎంతో మంది ఉన్నారు. అద్భుతమైన బౌలింగ్‌ యాక్షన్‌, కళ్లుచెదిరే వేగం, అంతకుముంచి కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంత్‌, స్వింగ్‌, యార్కర్‌, బౌన్సర్‌ ఇలా తన అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలను ఒక్కొక్కటిగా సంధిస్తుంటే.. తోపు బ్యాటర్లు కూడా ప్యాంట్‌ తడిపేసుకునే వాళ్లు. అంతటి చరిత్ర కలిగిన ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ బ్రెట్‌ లీని టీమిండియా మాజీ క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌ ఉతికి ఆరేశాడు.

వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ 2024 టోర్నీలో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌, ఇండియా ఛాంపియన్స్‌ మధ్య సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో బ్రెట్‌ లీని భారత బ్యాటర్లు ఓ ఆట ఆడుకున్నారు. ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన బ్రెట్‌ లీ.. తన నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి ఏకంగా 60 పరుగులు సమర్పించుకున్నాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో ఈ రేంజ్‌ బాదుడ్ని బ్రెట్‌ లీ చవిచూసి ఉండడు. ముఖ్యంగా అతను వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో యూసుఫ్‌ పఠాన్‌ వరుసగా 4, 6, 4, 4, 4 బాది ఏకంగా 23 పిండికున్నాడు.

అంతకంటే ముందు ఓవర్‌లో అంటే ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో కౌల్టర్-నైలు బౌలింగ్‌ను పఠాన్‌ సోదరులు.. యూసుఫ్‌ పఠాన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ను చీల్చిచెండడారు. తొలి మూడు బంతుల్లో ఇర్ఫాన్‌ పఠాన్‌ మూడు సిక్సులు బాదాడు. మూడో బంతి నో బాల్ కాగా.. తర్వాతి బంతికి సింగిల్‌ మాత్రమే వచ్చింది. నాలుగో బంతికి కూడా యూసుఫ్‌ పఠాన్‌ సింగిల్‌ తీసి ఇర్ఫాన్‌కు స్ట్రైక్‌ ఇవ్వడంతో మరో ఫోర్‌, సిక్స్‌తో ఓవర్‌ ముగించాడు ఇర్ఫాన్‌ పఠాన్‌. మొత్తంగా ఈ మ్యాచ్‌లో టీమిండియా 20 ఓవర్లలో 254 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. యూసుఫ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌తో పాటు ఊతప్ప, యువరాజ్‌ సింగ్ హాఫ్‌ సెంచరీలతో రాణించడంతో ఇండియా ఛాంపియన్స్‌ భారీ స్కోర్‌ చేసింది. ఆసీస్‌ 168 పరుగులు చేసి ఓటమి పాలైంది. మరి ఈ మ్యాచ్‌లో బ్రెట్‌ లీ బౌలింగ్‌లో యూసుఫ్‌ పఠాన్‌ సృష్టించిన విధ్వంసంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments