iDreamPost
android-app
ios-app

భారత యువ షూటింగ్ స్టార్ మను బాకర్‌కు అరుదైన గౌరవం

Manu Bhaker: పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ లో భారత్ మూడు పతకాలను కొల్లగొట్టింది. అందులో రెండు మను బాకర్‌వే కావడం గమనార్హం. కాగా, రెండు పతకాలతో దేశ ఖ్యాతిని పెంచిన మనుకు అరుదైన గౌరవం దక్కింది.

Manu Bhaker: పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ లో భారత్ మూడు పతకాలను కొల్లగొట్టింది. అందులో రెండు మను బాకర్‌వే కావడం గమనార్హం. కాగా, రెండు పతకాలతో దేశ ఖ్యాతిని పెంచిన మనుకు అరుదైన గౌరవం దక్కింది.

భారత యువ షూటింగ్ స్టార్ మను బాకర్‌కు అరుదైన గౌరవం

ఈ ఏడాది పారిస్ వేదికగా ఒలింపిక్స్ జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మూడు పతకాలు ఇండియా ఖాతాలోకి వచ్చి చేరాయి. వాటిల్లో రెండు పతకాలు యువ షూటర్ మను బాకర్ సొంతం చేసుకున్నవే. మూడు పతకంపై కన్నేసింది కానీ తృటిలో మెడల్‌ను కోల్పోయింది. కాగా, ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచి మను బాకర్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇంతకు ముంద మహిళల 10 మీ ఎయిర్ పిస్టల్ లో, సరబ్ జ్యోత్ సింగ్‌తో కలిసి 10మీ ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో కాంస్యాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో నాలుగో స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

భారత్‌కు రెండు పతకాలు అందించిన మను భాకర్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఫోన్ చేసి మను భాకర్‌ను అభినందించారు. వీరే కాదు ఇతర క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు, ఇతర క్రీడాకారులు, సాటి ఇండియన్స్ ఆమెను ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రెండు పతకాలు సాధించిన భారత షూటర్‌ మను బాకర్‌కు అరుదైన గౌరవం లభించింది. ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో మహిళా పతాకధారిగా మను బాకర్‌ వ్యవహరించనుంది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌.

ఆగస్టు 11న ఒలింపిక్స్‌ ముగింపు వేడుకలు జరగనున్నాయి. ఈ సమయంలో పతాకధారిగా వ్యవహరించనుంది. రెండు పతకాలు సాధించి దేశ ఖ్యాతిని పెంచిన మను బాకర్‌కు గుర్తింపుతో పాటు గౌరవం దక్కినట్లు అయ్యింది. ఇప్పటి వరకు ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలను గెలిచింది ఇద్దరే కాగా, వారిలో మను బాకర్ రెండో అథ్లెట్. 1900 ఒలింపిక్స్‌లో నార్మన్ ప్రిచర్డ్‌ రెండు పతకాలు గెలవగా.. ఆ తర్వాత రెండు పతకాలను గెలిచిన ఏకైక అథ్లెట్ మను బాకరే. కాగా, మరో వారం రోజుల్లో ఒలింపిక్స్ వేడుకలు ముగియనున్నాయి.