iDreamPost
android-app
ios-app

AUS vs PAK: వీడియో: ఒకవైపు మ్యాచ్‌.. మరోవైపు రొమాన్స్‌! కెమెరామెన్‌ పట్టేశాడు

  • Published Dec 28, 2023 | 5:02 PM Updated Updated Dec 28, 2023 | 5:02 PM

రెండు పెద్ద దేశాల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతుందంటే.. అంతా మ్యాచ్‌ చూడ్డానికే వస్తారని అనుకోవడం పొరపాటే.. కొంతమంది ఏకాంతంగా గడిపేందుకు కూడా వస్తారని ఈ యువ జంట నిరూపించింది. కానీ, వారిని కెమెరామెన్‌ దారుణంగా పట్టించాడు. అదెలానో ఇప్పుడు చూడండి.

రెండు పెద్ద దేశాల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతుందంటే.. అంతా మ్యాచ్‌ చూడ్డానికే వస్తారని అనుకోవడం పొరపాటే.. కొంతమంది ఏకాంతంగా గడిపేందుకు కూడా వస్తారని ఈ యువ జంట నిరూపించింది. కానీ, వారిని కెమెరామెన్‌ దారుణంగా పట్టించాడు. అదెలానో ఇప్పుడు చూడండి.

  • Published Dec 28, 2023 | 5:02 PMUpdated Dec 28, 2023 | 5:02 PM
AUS vs PAK: వీడియో: ఒకవైపు మ్యాచ్‌.. మరోవైపు రొమాన్స్‌! కెమెరామెన్‌ పట్టేశాడు

ఆస్ట్రేలియా వర్సెస్‌ పాకిస్థాన్‌ మధ్య మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఒక వైపు మ్యాచ్‌ రసవత్తరంగా జరుగుతుంటే.. పెద్దగా ప్రేక్షకులు లేని స్టేడియంలో ఒక ప్రేమజంట కాస్త క్లోజ్‌గా గడిపింది. అయితే.. వీరి ప్రేమను ప్రపంచానికి చూపించాలనుకున్న కెమెరామెన్‌ వాళ్లని ఫోకస్‌ చేయడంతో.. ప్రేమజంట​ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ముఖ్యంగా అబ్బాయి అయితే.. తన ముఖం కనిపించకుండా టీషర్ట్‌తో కవర్‌ చేసుకునే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఈ ఫన్నీ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇంట్లో తెలియకుండా.. మ్యాచ్‌ చూస్తూ.. ముచ్చట్లు పెట్టుకోచ్చని ఆ ప్రేమ జంట స్టేడియానికి వచ్చినట్లు ఉన్నారు.. కానీ, కెమెరామెన్‌ చేసిన పనికి దొరికిపోయారు పాపం అంటూ వీడియో చూసిన నెటిజన్లు సరదాగా కామెంట్‌ చేస్తున్నారు. అయితే.. స్టేడియంలో చాలా జంటలు గతంలో ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, లవ్‌ ప్రపోజల్స్‌ చేయడం లాంటివి చేశాయి. కానీ, కెమెరా కంటికి చిక్కి కంగారు పడలేదు. కానీ, ఈ యువ జంట మాత్రం తమ విషయం ఇంట్లో తెలిసిపోతుందని తెగ కంగారు పడ్డారు. కెమెరామెన్‌ వీళ్లను ఫోకస్‌ చేయడంతో.. స్టేడియంలో ఉన్న బిగ్‌ స్క్రిన్‌పై వీళ్ల వ్యవహారం అంతా తెలిసిపోయింది.

ప్రియుడి ఒళ్లో ప్రేయసి ఉన్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ వీడియో చూపి.. వాళ్ల పేరెంట్స్‌ ఎలా స్పందిస్తారో? అంటూ మరికొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక మ్యాచ్‌ విషయాకి వస్తే.. మూడు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు పాకిస్థాన్‌ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. తొలి టెస్ట్‌లో ఆసీస్‌ చేతిలో పాకిస్థాన్‌ ఓటమి పాలైంది. కానీ, ప్రస్తుతం మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో పాకిస్థాన్‌ గట్టిపోటీ ఇస్తోంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 318 పరుగులకు ఆలౌట్‌ అయింది. పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 264 రన్స్‌ చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ తడబడుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 187 పరుగులు చేసి.. 241 పరుగుల లీడ్‌లో ఉంది. మరి ఈ మ్యాచ్‌ సందర్భంగా యువ ప్రేమ జంట్‌ రొమాన్స్‌, కెమెరామెన్‌ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet