iDreamPost
android-app
ios-app

నువ్వేం హెడెన్, గిల్ క్రిస్ట్ కాదు.. నీకొచ్చిన షాట్లు ఆడుకో! స్టార్ ప్లేయర్ పై సెహ్వాగ్ సెటైర్లు

  • Published Jun 11, 2024 | 3:17 PM Updated Updated Jun 11, 2024 | 3:17 PM

నువ్వు ఆడమ్ గిల్ క్రిస్ట్, మాథ్యూ హెడెన్ కాదు.. నీకొచ్చిన షాట్లు ఆడుకో అంటూ.. స్టార్ ప్లేయర్ ను ఘాటుగా విమర్శించాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. మరి ఆ క్రికెటర్ ఎవరు? పూర్తి వివరాల్లోకి వెళితే..

నువ్వు ఆడమ్ గిల్ క్రిస్ట్, మాథ్యూ హెడెన్ కాదు.. నీకొచ్చిన షాట్లు ఆడుకో అంటూ.. స్టార్ ప్లేయర్ ను ఘాటుగా విమర్శించాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. మరి ఆ క్రికెటర్ ఎవరు? పూర్తి వివరాల్లోకి వెళితే..

నువ్వేం హెడెన్, గిల్ క్రిస్ట్ కాదు.. నీకొచ్చిన షాట్లు ఆడుకో! స్టార్ ప్లేయర్ పై సెహ్వాగ్ సెటైర్లు

టీమిండియా మాజీ డ్యాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన స్టైల్లో ప్రత్యర్థులపై కౌంటర్లు వేస్తూ ఉంటాడు. ఇక ఘోరంగా విఫలమైన స్టార్ ప్లేయర్లను తన మాటలతో చీల్చిచెండాడుతూ ఉంటాడు. తాజాగా బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ను తన ఘాటైన మాటలతో  విమర్శించాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో షకీబ్ పూర్తిగా విఫలం అయ్యాడు. ఈ నేపథ్యంలో అతడి ఆటతీరును ఆసీస్ లెజెండ్స్ తో పోలుస్తూ.. పరువుతీశాడు. నవ్వేం మాథ్యూ హెడెన్, ఆడమ్ గిల్ క్రిస్ట్ వి కాదని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ షకీబ్ అల్ హసన్ పై ఘాటుగా కామెంట్స్ చేశాడు టీమిండియా మాజీ డ్యాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్. “కేవలం అతడికి అనుభవం ఉందని జట్టులోకి తీసుకుని ఉంటే మాత్రం.. అతడు టీమ్ కు న్యాయం చేయలేడు. పరిస్థితులను బట్టి కనీసం కొంతసేపైన క్రీజ్ లో ఉండాలి కదా? షార్ట్ బాల్ ను కూడా ఫుల్ షాట్ ఆడటానికి నువ్వేం మాథ్యూ హెడెన్ వో లేదా ఆడమ్ గిల్ క్రిస్ట్ వో కాదు. ఓ సాధారణ బంగ్లాదేశ్ ఆటగాడివి. హుక్ లేదా ఫుల్ షాట్ ఆడటం నీకు రాదనుకుంటే.. నీకు వచ్చిన షాట్లు ఆడుకో” అంటూ విమర్శించాడు సెహ్వాగ్.

కాగా.. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో బంగ్లా నాలుగు పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన షకీబ్ 4 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేసి.. అనవసరపు షాట్ కు ప్రయత్నించి.. అన్రిచ్ నోర్ట్జే బౌలింగ్ లో మార్క్రమ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక బౌలింగ్ లో ఒకే ఓవర్ వేసి.. వికెట్ ఏమీ తీయకుండా 6 పరుగులు ఇచ్చాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు చెత్త షాట్ ఆడి.. షకీబ్ అవుట్ కావడంతో.. టీమ్ ఓడిపోయిందని సెహ్వాగ్ అతడిపై విమర్శలు గుప్పించాడు. మరి షకీబ్ పై సెహ్వాగ్ సెటైర్లు వేయడం మీకేవిధంగా అనిపించిందో, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.