iDreamPost
android-app
ios-app

సెహ్వాగ్ లా ఫియర్ లెస్ క్రికెట్ ఆడుతున్నాడు.. అతడొక సంచలనం: కోచ్

  • Author Soma Sekhar Published - 09:52 PM, Mon - 27 November 23

తాజాగా టీమిండియాలోకి వచ్చిన ఓ యువ సంచలనం తన దూకుడైన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక అతడి ఆటను సెహ్వాగ్ తో పోల్చాడు ఆ ప్లేయర్ చిన్ననాటి కోచ్. నా శిష్యుడు వీరేంద్ర సెహ్వాగ్ లా ఫియర్ లెస్ క్రికెట్ ఆడుతున్నాడు అంటూ కితాబిచ్చాడు.

తాజాగా టీమిండియాలోకి వచ్చిన ఓ యువ సంచలనం తన దూకుడైన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక అతడి ఆటను సెహ్వాగ్ తో పోల్చాడు ఆ ప్లేయర్ చిన్ననాటి కోచ్. నా శిష్యుడు వీరేంద్ర సెహ్వాగ్ లా ఫియర్ లెస్ క్రికెట్ ఆడుతున్నాడు అంటూ కితాబిచ్చాడు.

  • Author Soma Sekhar Published - 09:52 PM, Mon - 27 November 23
సెహ్వాగ్ లా ఫియర్ లెస్ క్రికెట్ ఆడుతున్నాడు.. అతడొక సంచలనం: కోచ్

ప్రస్తుతం టీమిండియాలో యువ రక్తం ఉరకలేస్తోంది. ఎంతో మంది టాలెంటెడ్ ప్లేయర్లు జట్టులోకి వస్తున్నారు. సెలెక్టర్లు సైతం వారికి అవకాశాలు ఇస్తూ.. వారిని ప్రోత్సహిస్తూనే ఉంది. తాజాగా టీమిండియాలోకి వచ్చిన ఓ యువ సంచలనం తన దూకుడైన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక అతడి ఆటను సెహ్వాగ్ తో పోల్చాడు ఆ ప్లేయర్ చిన్ననాటి కోచ్. నా శిష్యుడు వీరేంద్ర సెహ్వాగ్ లా ఫియర్ లెస్ క్రికెట్ ఆడుతున్నాడు అంటూ కితాబిచ్చాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో అతడు చిచ్చర పిడుగులా రెచ్చిపోయాడు. మరి కోచ్ చెప్పిన ఆ ప్లేయర్ ఎవరు? ఇప్పుడు తెలుసుకుందాం.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో టీమిండియా యంగ్ ప్లేయర్లు రెచ్చిపోయి ఆడుతున్నారు. జరిగిన రెండు మ్యాచ్ ల్లో కూడా తమ బ్యాటింగ్ పవర్ ఆసీస్ బౌలర్లకు రుచిచూపించారు. మరీ ముఖ్యంగా రెండో టీ20 మ్యాచ్ లో యువ సంచలనం యశస్వీ జైస్వాల్ కంగారూ జట్టు బౌలర్లను చీల్చి చెండాడాడు. తిరువనంతపురం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో కేవలం 25 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్స్ లతో 53 పరుగులు చేశాడు. అంతకు ముందు జరిగిన మ్యాచ్ లో కూడా వేగంగా 21 రన్స్ చేసి.. అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. కాగా అతడి బ్యాటింగ్ పై స్పందించాడు చిన్ననాటి కోచ్ జ్వాలా సింగ్. జైస్వాల్ ఆటతీరు టీమిండియా మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆటను పోలిఉందని కితాబిచ్చాడు.

కోచ్ జ్వాలా సింగ్ మాట్లాడుతూ..”వీరేంద్ర సెహ్వాగ్ ఆడుతున్నప్పుడు పెద్దగా పొట్టి క్రికెట్ వెలుగులోకి రాలేదు. కానీ అప్పుడే సెహ్వాగ్ టీ20 క్రికెట్ తరహా ఆటను ఆడేవాడు. ఇక జైస్వాల్ సెహ్వాగ్ అప్ గ్రేడ్ వెర్షన్. వీరూ లాగే అన్ని రకాల షాట్ లను ఆడగలడు. ప్రస్తుతం వీరేంద్ర సెహ్వాగ్ లా ఫియర్ లెస్ క్రికెట్ ఆడుతున్నాడు యశస్వీ జైస్వాల్. అతడి టెక్నిక్స్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక అతడి స్వ్కేర్ కట్ , ఆఫ్ సైడ్ గేమ్ చూస్తే.. దిగ్గజ ఆటగాడు సౌరవ్ గంగూలీ గుర్తుకు వస్తాడు” అంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్వాలా సింగ్ చెప్పుకొచ్చాడు. మరి యశస్వీ జైస్వాల్ ఫియర్ లెస్ క్రికెట్ ఆడుతూ.. సెహ్వాగ్ ను తలపిస్తున్నాడు అన్న కోచ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.