ఏషియన్ గేమ్స్ లో టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టు దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ చేరిన జట్టు.. సెమీస్ లో కూడా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. నేపాల్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా యువ సంచలనం యశస్వీ జైస్వాల్ థండర్ ఇన్నింగ్స్ తో చెలరేగాడు. ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్ లో తన తొలి శతకాన్ని నమోదు చేసుకున్నాడు. అతడు చెలరేగిన విధానం చూస్తే ఆశ్చర్యం వెయ్యకమానదు. నేపాల్ బౌలర్లను దంచికొడుతూ కేవలం 48 బంతుల్లోనే శతకం బాదాడు.
ఏషియన్ గేమ్స్ లో భాగంగా నేపాల్ తో జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ దుమ్మురేపింది. ముఖ్యంగా టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ చెలరేగిన విధానం మ్యాచ్ కే హైలెట్ అని చెప్పాలి. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. నేపాల్ బౌలర్లను చితక్కొడుతూ.. తొలి వికెట్ కు జైస్వాల్-గైక్వాడ్ జోడీ కేవలం 9.5 ఓవర్లలోనే 103 పరుగులు జోడించారు. ఈ క్రమంలో కెప్టెన్ గైక్వాడ్(25) తక్కువ పరుగులకే అవుట్ అయినా.. జైస్వాల్ తన బాదుడు మాత్రం ఆపలేదు. నేపాల్ బౌలర్లను ఎడాపెడా బాదుతూ.. 48 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్ లతో 100 పరుగులు చేసి దీపేంద్ర సింగ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.
జైస్వాల్ సునామీ ఇన్నింగ్స్ తో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. జైస్వాల్ కు తోడు.. యంగ్ ఫినిషర్ రింకూ సింగ్ చివర్లో సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు.. రింకూ సింగ్ నేపాల్ బౌలర్లపై ఓ మినీ యుద్దాన్నే ప్రకటించాడు. శివం దుబే(25*)తో కలిసి కేవలం 22 బంతుల్లోనే 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? 52 రన్స్ లో రింకూ సింగ్ 37 పరుగులు చేయడం విశేషం. కేవలం 15 బంతులు ఎదుర్కొన్న రింకూ సింగ్ 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 37 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి ధాటికి లాస్ట్ 5 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 64 పరుగులు పిండుకుంది టీమిండియా.
HUNDRED FOR YASHASVI JAISWAL….!!!!
Jaiswal becomes the first Indian to smash a hundred in Asian Games history – hundred from just 47 balls against Nepal, his first in T20I cricket. pic.twitter.com/imo8IXwbv8
— Johns. (@CricCrazyJohns) October 3, 2023