IND vs ENG: ఇంగ్లండ్ డెబ్యూ బౌలర్‌ను ఉతికేసిన జైస్వాల్‌! కనికరం లేకుండా..!

Yashasvi Jaiswal, Tom Hartley: భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో జైస్వాల్‌ వీరవిహారం చేస్తుంటే.. అతని దెబ్బకు పాపం ఓ డెబ్యూ బౌలర్‌ బలి అవుతున్నాడు. మరి అతనెవరో.. జైస్వాల్‌ ఏం చేస్తున్నాడో ఇప్పుడు చూద్దాం..

Yashasvi Jaiswal, Tom Hartley: భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో జైస్వాల్‌ వీరవిహారం చేస్తుంటే.. అతని దెబ్బకు పాపం ఓ డెబ్యూ బౌలర్‌ బలి అవుతున్నాడు. మరి అతనెవరో.. జైస్వాల్‌ ఏం చేస్తున్నాడో ఇప్పుడు చూద్దాం..

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇరు జట్లు హోరాహోరీగా ఆడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. బజ్‌బాల్‌ స్ట్రాటజీతో బరిలోకి దిగుతామని చెప్పిన ఇంగ్లండ్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. జడేజా, అశ్విన్‌, అక్షర్‌, బుమ్రా దెబ్బకు ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ తుస్సుమంది. కేవలం 246 పరుగులకే ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలింది. ఇక తొలి ఇన్నింగ్స్‌కు బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌-రోహిత్‌ శర్మలు మంచి ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా జైస్వాల్‌ ఏ మాత్రం భయం లేకుండా.. తొలి ఓవర్‌ తొలి బంతికే ఫోర్‌ కొట్టి ఇన్నింగ్స్‌ను ఆరంభించి.. తన ఉద్దేశాన్ని చాటిచెప్పాడు.

అయితే.. జైస్వాల్‌ మాస్‌ బ్యాటింగ్‌కు బలైంది మాత్రం ఒక కొత్త బౌలర్‌. ఈ మ్యాచ్‌తోనే అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన టామ్ హార్ట్లీపై జైస్వాల్‌ ఏ మాత్రం కనికరం చూపలేదు. పాపం.. తన కెరీర్‌లో వేసిన బంతిని జైస్వాల్‌ సిక్స్‌ బాది.. అతని ఒక చెత్త స్టార్ట్‌ ఇచ్చాడు. టెస్టు క్రికెట్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతూ.. తొలి బంతికే సిక్స్‌ బాదించుకోవడం ఏ బౌలర్‌కైనా అస్సలు నచ్చదు. పైగా ఒక యువ క్రికెటర్‌ అలాంటి షాట్‌ ఆడి.. తన అరంగేట్రాన్ని చేదు అనుభవంగా మిగల్చడంతో పాపం.. టాప్‌ హార్ట్లీ ముఖం మాడిపోయింది.

ఆ ఒక్క షాట్‌తోనే జైస్వాల్‌ తన బాదుడును ఆపలేదు. అదే ఓవర్‌ ఐదో బంతికి మరో సిక్స్‌ బాదాడు. తన రెండో ఓవర్‌ వేసేందుకు వచ్చిన టాప్‌కు మరోసారి జైస్వాల్‌ షాకిచ్చాడు. ఈ సారి ఒకే ఓవర్‌లో రెండు ఫోర్లతో పాటు మొత్తం 12 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ మూడో ఓవర్‌లోనూ రెండు ఫోర్లు బాదాడు. ఇలా టామ్‌ వేసిన మూడు ఓవర్లోనే జైస్వాల్‌ ఏకంగా 33 పరుగులు బాదాడు. మొత్తం టామ్‌ హార్ట్లీ 34 బంతుల్లోనే 50 పరుగులు సమర్పించుకుని.. తన తొలి టెస్ట్‌లో చేదు అనుభవాన్ని మూటగట్టుకుంటున్నాడు. మరి ఒక డెబ్యూ బౌలర్‌పై జైస్వాల్‌ ఇంతలా రెచ్చిపోతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments