iDreamPost
android-app
ios-app

ముంబైలో లగ్జరీ ఫ్లాట్ ను కొనుగోలు చేసిన టీమిండియా స్టార్ బ్యాటర్! ధర ఎంతంటే?

  • Published Feb 22, 2024 | 3:00 PM Updated Updated Feb 22, 2024 | 3:00 PM

టీమిండియా యంగ్ ప్లేయర్ ముంబైలోని ఖరీదైన ప్రాంతం బాంద్రాలో ఓ లగ్జరీ ఫ్లాట్ ను కొనుగోలు చేసినట్లు సమాచారం. మరి ఆ ప్లేయర్ ఎవరు? దాని ధర ఎంతంటే?

టీమిండియా యంగ్ ప్లేయర్ ముంబైలోని ఖరీదైన ప్రాంతం బాంద్రాలో ఓ లగ్జరీ ఫ్లాట్ ను కొనుగోలు చేసినట్లు సమాచారం. మరి ఆ ప్లేయర్ ఎవరు? దాని ధర ఎంతంటే?

  • Published Feb 22, 2024 | 3:00 PMUpdated Feb 22, 2024 | 3:00 PM
ముంబైలో లగ్జరీ ఫ్లాట్ ను కొనుగోలు చేసిన టీమిండియా స్టార్ బ్యాటర్! ధర ఎంతంటే?

ముంబై లోని బాంద్రా ప్రాంతం సినీ, రాజకీయ ప్రముఖులు నివసించే ఏరియా. దీంతో ఆ ఏరియాలో ఫ్లాట్ల రేట్లు భారీగా ఉంటాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్, టాలీవుడ్ కు చెందిన ఎందరో హీరోలకు బాంద్రాలో ఫ్లాట్స్ ఉన్నాయి. తాజాగా టీమిండియాకు చెందిన ఓ యంగ్ ప్లేయర్ ఈ కాస్ట్లీ ఏరియాలో లగ్జరీ ఫ్లాట్ ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మరి ఆ ఆటగాడు ఎవరు? ఆ ఫ్లాట్ ధర ఎంత? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ అదరగొడుతున్నాడు. మూడు మ్యాచ్ ల్లో రెండు డబుల్ సెంచరీలతో దుమ్మురేపాడు ఈ చిచ్చరపిడుగు. దీంతో భారత క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిపోయాడు ఈ యంగ్ ప్లేయర్. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న జైస్వాల్ ర్యాంకింగ్స్ లో సైతం జోరును చూపించాడు. టాప్-20లోకి దూసుకొచ్చాడు. ఇక ఇతడి గురించి ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే?

ముంబైలో అత్యంత ఖరీదైన ప్రాంతం బాంద్రాలో ఓ లగ్జరీ ఫ్లాట్ ను కొనుగోలు చేశాడట జైస్వాల్. దాని ఖరీదు వచ్చేసి అక్షరాలా.. రూ. 5.4 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఈస్ట్ బాంద్రా వింగ్ 3 ఏరియాలోని 1100 చ. అడుగుల విస్తీర్ణంలో ఈ ఫ్లాట్ ఉంటుందని సమాచారం. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రకారం ఈ వివరాలు బయటకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. క్రికెటర్ గా మారే క్రమంలో యశస్వీ ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నాడు. కొన్ని రోజులు జైస్వాల్ టెంట్ లో సైతం నివశించాడు. బతుకుదెరువు కోసం పానీ పూరి బండిని కూడా అతడి ఫ్యామిలీ నడిపింది.

ఇన్ని కష్టాలను ఎదుర్కొని క్రికెటర్ కావాలనుకున్న తన కలను సాకారం చేసుకున్నాడు ఈ యంగ్ ప్లేయర్. అండర్ 19 వరల్డ్ కప్ 2019లో రాణించడంతో.. ఐపీఎల్ లోకి అడుగుపెట్టే అవకాశం వచ్చింది. ఐపీఎల్ వేలంలోకి వచ్చిన తొలిసారే ఏకంగా 2.4 కోట్లకు బిడ్ దక్కించుకున్నాడు జైస్వాల్. 2023లో రాజస్తాన్ రాయల్స్ తరఫున 14 మ్యాచ్ లు ఆడి 625 రన్స్ చేసి.. అందరిని షాక్ కు గురిచేశాడు. తాజాగా ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లోనూ అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నాడు యశస్వీ జైస్వాల్. కేవలం మూడు టెస్టుల్లోనే 545 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ఇదికూడా చదవండి: కోహ్లీ చేతిపై కొత్త టాటూ.. కొడుకు పేరు ముందే ఫిక్స్ అయ్యాడు!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom