iDreamPost

టీ20 WCలో ఓపెనర్‌గా రోహిత్‌ వద్దు! జైస్వాల్‌కు జోడీగా ఆ క్రికెటరే కరెక్ట్‌: మాజీ ప్లేయర్‌

  • Published May 29, 2024 | 7:44 PMUpdated May 29, 2024 | 7:44 PM

Rohit Sharma, T20 World Cup 2024, Wasim Jaffer: టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా ఓపెనర్లుగా జైస్వాల్‌-రోహిత్‌ శర్మ వద్దని.. రోహిత్‌ ప్లేస్‌లో ఆ ఆటగాడినే బరిలోకి దింపాలని అంటున్నాడు ఓ మాజీ క్రికెటర్‌. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Rohit Sharma, T20 World Cup 2024, Wasim Jaffer: టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా ఓపెనర్లుగా జైస్వాల్‌-రోహిత్‌ శర్మ వద్దని.. రోహిత్‌ ప్లేస్‌లో ఆ ఆటగాడినే బరిలోకి దింపాలని అంటున్నాడు ఓ మాజీ క్రికెటర్‌. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published May 29, 2024 | 7:44 PMUpdated May 29, 2024 | 7:44 PM
టీ20 WCలో ఓపెనర్‌గా రోహిత్‌ వద్దు! జైస్వాల్‌కు జోడీగా ఆ క్రికెటరే కరెక్ట్‌: మాజీ ప్లేయర్‌

ప్రస్తుతం భారత క్రికెట్‌ అభిమానుల దృష్టి మొత్తం టీ20 వరల్డ్‌ కప్‌ 2024 పైనే ఉంది. ఇప్పటికే భారత ఆటగాళ్లు అమెరికా వెళ్లి ప్రాక్టీస్‌ కూడా మొదలుపెట్టారు. జూన్‌ 2 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అమెరికాతో పాటు వెస్టిండీస్‌ కూడా ఈ టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌ జూన్‌ 9న న్యూయార్క్‌లోని నసావు కౌంటీ క్రికెట్‌ స్టేడియంలో జరగనుంది. ఈ సారి ఎలాగైన కప్పు కొట్టాలని టీమిండియా ఆటగాళ్లు బలంగా ఫిక్స్‌ అయి ఉన్నారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా దానిపైనే ఫోకస్‌ పెట్టాడు. కానీ, ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో టీమిండియా ఓపెనర్లుగా ఉన్న యశస్వి జైస్వాల్‌, రోహిత్‌ శర్మ ఫామ్‌ అంత బాగా లేదు.

ఈ క్రమంలోనే రోహిత్‌ శర్మ ఓపెనర్‌గా ఆడొద్దంటూ.. టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమ్‌, పిచ్‌, ఫామ్‌ పరిస్థితులకు తగ్గట్లుగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు చేసుకోవాలని సూచించాడు. రోహిత్‌ శర్మకు బదులుగా జైస్వాల్‌తో కలిసి విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ ప్రారంభించాలని పేర్కొన్నాడు. టీమిండియాలో విరాట్‌ కోహ్లీ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌ చేస్తాడనే విషయం తెలిసిందే. కానీ, ఐపీఎల్‌ 2024 సీజన్‌లో కోహ్లీ ఓపెనర్‌గా దుమ్మురేపాడు. 741 పరుగులతో ఈ సీజన్‌లోనే టాప్‌ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్‌ క్యాప్‌ను అందుకున్నాడు. జైస్వాల్‌-కోహ్లీ ఓపెనర్లుగా వస్తే.. వాళ్లు ఇచ్చే స్టార్ట్‌ను బట్టి.. సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి రోహిత్ మూడు లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలని జాఫర్‌ అన్నాడు.

రోహిత్‌ శర్మ స్పిన్‌ను ఎంతో బాగా ఆడగలడని, కాబట్టి నాలుగో స్థానంలో వస్తే ఎలాంటి చాలా బాగుంటుందని అన్నాడు. అయితే ఓపెనర్‌గా కోహ్లి రావాలని జాఫర్‌ అనడం బాగానే ఉంది కానీ, రోహిత్‌ని నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రమ్మనడం సరైన ఆలోచన కాదని జాఫర్ అభిప్రాయంపై క్రికెట్‌ అభిమానులు స్పందిస్తున్నారు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ పవర్‌ ప్లే ఎలాంటి ఇంప్యాక్ట్‌ చూపించాడో అంతా చూశారని, ఒక్క ఐపీఎల్‌ సీజన్‌ను బట్టి.. రోహిత్‌ శర్మను ఓపెనర్‌గా వద్దనడం సరికాదని అంటున్నారు. మరి దీనిపై రోహిత్‌ శర్మ ఎలా ఆలోచిస్తాడో తెలియదు. మరి రోహిత్‌ శర్మ స్థానంలో కోహ్లీ ఓపెనర్‌గా రావాలని వసీం జాఫర్‌ ఇచ్చిన సూచనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి