iDreamPost
android-app
ios-app

హైదరాబాద్‌ వేదికగా WWE..ఫ్యాన్స్‌కు పండగే..

  • Published Aug 28, 2023 | 2:56 PM Updated Updated Aug 28, 2023 | 2:56 PM
  • Published Aug 28, 2023 | 2:56 PMUpdated Aug 28, 2023 | 2:56 PM
హైదరాబాద్‌ వేదికగా WWE..ఫ్యాన్స్‌కు పండగే..

డబ్ల్యూడబ్ల్యూఈ.. ఈ పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా డబ్ల్యూడబ్ల్యూఈకి విపరీతమైన క్రేజ్‌ ఉంది. చిన్న నుంచి పెద్ద దాక అందరూ ఎగబడి చూసే ప్రోగ్రామ్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ కూడా ఒకటి.  నైన్టీ‌స్‌ కిడ్స్‌ కావచ్చు.. 2కే కిడ్స్‌ కావచ్చు.. డబ్ల్యూడబ్ల్యూఈతో మంచి అనుబంధమే ఉంటుందని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇ‍క, డబ్ల్యూడబ్ల్యూఈ కార్యక్రమాలు ఎక్కువగా అమెరికాలో జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు వాటిని బయటి దేశాల్లో కూడా నిర్వహిస్తూ ఉంటారు.

ఇండియాలో చాలా సార్లు నిర్వహించారు. అయితే, మొట్టమొదటి సారి హైదరాబాద్‌ నగరంలో డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్‌ జరుగుతోంది. నిర్వాహకులు ‘డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌ స్టార్‌ స్పెక్టాకిల్‌’ పేరుతో నగరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 28 మంది అంతర్జాతీయ ఫైటర్లు ఇందులో పాల్గొననున్నారు. డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌ స్టార్‌ ‘జాన్‌ సిన’ ప్రత్యేక ఆకర్షణా నిలవనున్నారు. సెప్టెంబర్‌ 8న గచ్చిబౌలి స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇందుకు సంబంధించిన టిక్కెట్ల అమ్మకం నెల రోజుల క్రితం నుంచే మొదలైంది.

500 రూపాయల నుంచి 17 వేల రూపాయల వరకు టిక్కెట్ల ధరలు ఉన్నాయి. అయితే, డబ్ల్యూడబ్ల్యూఈ హైదరాబాద్‌లో జరుగుతోందని తెలిసి పెద్ద సంఖ్యలో జనం టిక్కెట్ల కోసం ఎగబడ్డారు. దీంతో టిక్కెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. ప్రస్తుతం టిక్కెట్స్‌ సోల్డ్‌ ఔట్‌ బోర్డు దర్శనమిస్తోంది.  సమీజైన్‌, కెవిన్‌ ఓవెన్స్‌, గుంథర్‌, జిందర్‌ మహాల్‌, వీర్‌, సంగ, డ్రూ మెక్‌ఇంటైర్‌, బెక్కీ లించ్‌, నటల్య మాట్‌ రిడిల్‌, లుడ్విగ్‌ కైజర్‌తో పాటు మరికొంతమంది ఈ ఈవెంట్‌ కోసం హైదరాబాద్‌ రానున్నారు. మరి, డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరగటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by WWE India (@wweindia)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom