iDreamPost
android-app
ios-app

టీమిండియాకు విషెస్ చెప్పిన WWE సూపర్ స్టార్! వైరలవుతున్న వీడియో..

  • Author Soma Sekhar Published - 12:53 PM, Fri - 6 October 23
  • Author Soma Sekhar Published - 12:53 PM, Fri - 6 October 23
టీమిండియాకు విషెస్ చెప్పిన WWE సూపర్ స్టార్! వైరలవుతున్న వీడియో..

వరల్డ్ కప్ 2023లో టీమిండియా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అదీకాక భారత జట్టు ప్రపంచ కప్ హాట్ ఫేవరెట్ అంటూ ఎంతో మంది కితాబిచ్చిన విషయం కూడా తెలిసిందే. తాజాగా ఓ WWE సూపర్ సైతం టీమిండియాకు విషెస్ చెప్పాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ వేదికగా WWE సూపర్ స్టార్ స్పెక్టాకిల్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ కు స్టార్ రెజ్లర్ జాన్ సీనాతో పాటుగా వరల్డ్ వైడ్ గా ఉన్న సూపర్ స్టార్లు హాజరైయ్యారు. ఈ ఈవెంట్ కు హాజరైన ఓ సూపర్ స్టార్ టీమిండియాకు విషెస్ చెప్పాడు.

డ్రూ మెకింటైర్.. స్వాటిష్ కు చెందిన WWE సూపర్ స్టార్. రెజ్లింగ్ ప్రపంచంలో ఎన్నో మ్యాచ్ ల్లో స్టార్ రెజ్లర్లను ఓడించి WWE ఛాంపియన్ షిప్ ను రెండు సార్లు, ఓ సారి టాగ్ టీమ్ ఛాంపియన్ షిప్, మరోసారి NXT ఛాంపియన్ షిప్ లను కైవసం చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో జరిగిన WWE సూపర్ స్టార్ స్పెక్టాకిల్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా.. నాటు నాటు పాటకు స్టేజ్ పై స్టెప్పులు కూడా వేశాడు. ఇదిలా ఉండగా.. తాజాగా అతడు వరల్డ్ కప్ 2023లో పాల్గొంటున్న టీమిండియాకు తన విషెస్ తెలియజేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్న వీడియోను షేర్ చేశాడు. ఈ టోర్నీ కోసం ఎదురుచూస్తున్నానని తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. కాగా.. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో టీమిండియా జెర్సీతో దర్శనం ఇచ్చాడు మెకింటైర్.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş