iDreamPost

వరల్డ్ కప్ లో మరో సెంటిమెంట్.. ఈసారి ప్రపంచ కప్ వారిదేనట!

  • Author Soma Sekhar Published - 12:21 PM, Fri - 6 October 23
  • Author Soma Sekhar Published - 12:21 PM, Fri - 6 October 23
వరల్డ్ కప్ లో మరో సెంటిమెంట్.. ఈసారి ప్రపంచ కప్ వారిదేనట!

క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న విశ్వ సమరం మెుదలైంది. తొలి మ్యాచ్ లోనే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ కు షాకిచ్చి ప్రతీకారం తీర్చుకుంది న్యూజిలాండ్. ఈ మ్యాచ్ లో పూర్తి ఆధిపత్యం కనబర్చిన కివీస్ టీమ్.. భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో ఓ సెంటిమెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈసారి వన్డే వరల్డ్ కప్ గెలిచే జట్టు అదేనని గత వరల్డ్ కప్ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఈసారి కూడా ఇదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఆ సెంటిమెంట్ ఏంటి? వరల్డ్ కప్ గెలిచే ఆ జట్టు ఏది? ఇప్పుడు పరిశీలిద్దాం.

వరల్డ్ కప్ ప్రారంభం అవుతుందనగానే సోషల్ మీడియాలో సెంటిమెంట్లకు సంబంధించిన ఎన్నో వార్తలు వైరల్ గా మారాయి. ఈ సెంటిమెట్స్ ను బేస్ చేసుకుని ఈసారి వరల్డ్ కప్ గెలిచే జట్టు ఇదే అంటూ ఎంతో మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇక చరిత్రలో కొన్ని గణాంకాలు కూడా వారి అభిప్రాయాలకు దగ్గర ఉండటం గమనార్హం. తాజాగా వరల్డ్ కప్ తొలి మ్యాచ్ జరిగిన తర్వాత మరో సెంటిమెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటంటే? వరల్డ్ కప్ ల్లో తొలి సెంచరీ చేసిన ఆటగాడి జట్టే ప్రపంచ కప్ గెలిచింది. గత నాలుగు ప్రపంచ కప్ ల్లో ఇది నిజమని తేలింది.  2023 వరల్డ్ కప్ లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా కాన్వే నిలిచాడు. దీంతో ఈసారి వరల్డ్ కప్ న్యూజిలాండే గెలుస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

కాగా.. 2007 వరల్డ్ కప్ నుంచి ఈ సెంటిమెంట్ కొనసాగుతోందని గణాంకాలు వివరిస్తున్నాయి. 2007 వరల్డ్ కప్ లో ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో తొలి సెంచరీ చేయగా.. ఆ ఏడాది ఆస్ట్రేలియా ప్రపంచ కప్ కైవసం చేసుకుంది. ఇక 2011 వరల్డ్ కప్ లో కూడా ఈ సెంటిమెంట్ రిపీట్ అయ్యింది. ఈ ప్రపంచ కప్ లో సెహ్వాగ్ తొలి శతకం నమోదు చేశాడు. బంగ్లాతో జరిగిన మ్యాచ్ లో వీరూ 175 పరుగులతో చెలరేగాడు. ఈ సంవత్సరం టీమిండియా ప్రపంచ కప్ ను ముద్దాడింది. ఇదే సంప్రదాయం 2015, 2019లో కూడా కొనసాగింది. 2015లో ఆరోన్ ఫించ్ శతకం సాధించగా.. ఆ సంవత్సరం ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ను ఎగరేసుకుపోయింది. ఇక 2019లో ఇంగ్లాండ్ ప్లేయర్ జో రూట్ తొలి సెంచరీ నమోదు చేయగా.. ఆ టీమే జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ లెక్కన చూసుకుంటే.. ఈసారి వరల్డ్ కప్ కివీస్ ఎగరేసుకుపోతుందన్న వాదన వైరల్ గా మారింది. మరి ఈ సెంటిమెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

another sentiment in 2023 world cup 2

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి