SNP
IPL 2024 Final, WPL 2024 Final, SRH vs KKR: ఐపీఎల్ 2024 ఛాంపియన్‌గా కేకేఆర్ జట్టు నిలిచింది. ఫైనల్లో సన్‌రైజర్స్‌ను చిత్తు చేసి గెలిచింది. అయితే... ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఫైనల్ కాపీ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అవేంటో ఇప్పుడుచూద్దాం..
IPL 2024 Final, WPL 2024 Final, SRH vs KKR: ఐపీఎల్ 2024 ఛాంపియన్‌గా కేకేఆర్ జట్టు నిలిచింది. ఫైనల్లో సన్‌రైజర్స్‌ను చిత్తు చేసి గెలిచింది. అయితే... ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఫైనల్ కాపీ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అవేంటో ఇప్పుడుచూద్దాం..
SNP
ఎన్నో అంచనాలు పెట్టుకుంటే.. తుస్సుమనిపించింది ఐపీఎల్ 2024 ఫైనల్. రెండు బ్యాటింగ్ బీస్ట్‌ల మధ్య ఫైనల్ మ్యాచ్ కావడంతో హోరాహోరీ పోరు ఖాయమని అంతా భావించారు కానీ, మ్యాచ్ మాత్రం వన్‌సైడ్‌గా జరిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కత్తా నైట్ రైడర్స్ పూర్తి ఆధిపత్యం చెలాయించి.. మ్యాచ్‌ను ఏకపక్షంగా ముగించింది. ఈ విజయంతో కోల్‌కత్తా నైట్ రైడర్స్ మూడో సారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. అయితే.. ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్.. అంతా కాపీ పేస్ట్ అంటూ ఆరోపణలు వస్తున్నాయి. అదేంటి.. వస్తే గిస్తే ఫిక్సింగ్ ఆరోపణలు అని రావాలని కానీ.. ఇలా కాపీ అంటూ కామెంట్స్ రావడం ఏంటి అనుకుంటున్నారా? దానికి బలమైన కారణం ఉంది. తెలిస్తే మీరు కూడా ‘అవునా.. నిజమా?’ అని అంటారు. మరి అదేంటో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..
ఈ ఏడాది మార్చి 17న డబ్ల్యూపీఎల్(ఉమెన్స్ ప్రీమియర్ లీగ్) 2024 ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించి.. డబ్ల్యూపీఎల్ 2024 ఛాంపియన్‌గా నిలిచింది. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్, అలాగే ఆర్సీబీకి స్మృతి మంధాన కెప్టెన్లుగా వ్యవహరించారు. అయితే.. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ లానింగ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ, ఆ టీమ్ 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ టార్గెట్‌ను ఆర్సీబీ కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించి.. 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇప్పుడు ఐపీఎల్ 2024 ఫైనల్‌లో కూడా ఆస్ట్రేలియాకు చెందిన క్రికెటర్ ప్యాట్ కమిన్స్ ఎస్‌ఆర్‌హెచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయించాడు. ఎస్‌ఆర్‌హెచ్ 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ అయింది. కేకేఆర్ 2 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించి.. 8 వికెట్ల తేడాతోనే గెలిచింది. ఇలా చాలా విషయాలు సేమ్ టూ సేమ్ జరిగాయి. ఆసీస్ ప్లేయర్(ప్యాట్ కమిన్స్) వర్సెస్ ఇండియన్ ప్లేయర్(శ్రేయస్ అయ్యర్) కెప్టెన్లు వ్యవహరించారు. డబ్ల్యూపీఎల్‌లో ఆసీస్ ప్లేయర్ కెప్టెన్‌గా ఉన్న ఢిల్లీ ఓడిపోయింది. ఇక్కడ ఆసీస్ ప్లేయర్ కెప్టెన్‌గా ఉన్న సన్‌రైజర్స్ ఓడిపోయింది. ఇండియన్ ప్లేయర్ స్మృతి మంధాన కెప్టెన్‌గా ఉన్న ఆర్సీబీ గెలిచింది. ఇక్కడ ఇండియన్ ప్లేయర్ అయ్యర్ కెప్టెన్‌గా ఉన్న కేకేఆర్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్స్ సేమ్ స్కోర్‌కు, సేమ్ ఓవర్లలో ఒక్క బంతి కూడా తేడా లేకుండా ఆడాయి. విజయం కూడా సేమ్ వికెట్ల తేడాతో దక్కింది. ఇవ్వన్ని యాధృచ్ఛికంగా జరిగినా.. క్రికెట్ అభిమానులు సరదాగా.. వీటిని పేర్కొంటూ.. ఫైనల్ మ్యాచ్ కాపీ అంటూ సరదాగా కామెంట్స్‌చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
2024 WPL Final:
– Aussie Captain Vs Indian captain.
– Aussie captain took batting.
– Team 113/10 in 18.3 overs.
– Indian captain’s team won by 8 wickets.IPL 2024 Final:
– Aussie captain Vs Indian captain.
– Aussie captain took batting.
– Team 113/10 in 18.3 overs.
– Indian… pic.twitter.com/jH07ZzmAEO— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2024