Somesekhar
WPL 2024 టైటిల్ పోరుకు సిద్దమైయ్యాయి ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు. మరి తొలి సీజన్ లో రన్నరప్ గా నిలిచిన ఢిల్లీ గెలుస్తుందా? లేక తొలిసారి ఫైనల్ కు చేరిన ఆర్సీబీ టైటిల్ ను ముద్దాడుతుందా? ఆ టీమ్స్ బలాలు, బలహీనతలు ఇప్పుడు తెలుసుకుందాం.
WPL 2024 టైటిల్ పోరుకు సిద్దమైయ్యాయి ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు. మరి తొలి సీజన్ లో రన్నరప్ గా నిలిచిన ఢిల్లీ గెలుస్తుందా? లేక తొలిసారి ఫైనల్ కు చేరిన ఆర్సీబీ టైటిల్ ను ముద్దాడుతుందా? ఆ టీమ్స్ బలాలు, బలహీనతలు ఇప్పుడు తెలుసుకుందాం.
Somesekhar
IPL కు ధీటుగా ప్రారంభమైన WPL క్రికెట్ లవర్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. పురుషుల క్రికెట్ కు ఏ మాత్రం తక్కువ కాకుండా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ ప్రేక్షకులను అలరించింది. హోరాహోరీ పోరాటాలు, నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్ లతో ఫ్యాన్స్ మజాను అందించింది. ఇక ఈ టోర్నీ ఆదివారం(మార్చి 17) జరిగే ఫైనల్ తో ముగుస్తుంది. టైటిల్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. మరి తొలి సీజన్ లో రన్నరప్ గా నిలిచిన ఢిల్లీ గెలుస్తుందా? లేక తొలిసారి ఫైనల్ కు చేరిన ఆర్సీబీ టైటిల్ ను ముద్దాడుతుందా? ఆ టీమ్స్ బలాలు, బలహీనతలు ఇప్పుడు తెలుసుకుందాం.
WPL 2024 టైటిల్ పోరుకు సిద్దమైయ్యాయి ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు. తొలి సీజన్ లోనే ఫైనల్ కు చేరి కొద్దిలో టైటిల్ ను మిస్ చేసుకున్న ఢిల్లీ టీమ్ ఒకవైపు.. ఈ సీజన్ లో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని అనూహ్యంగా ఫైనల్ కు చేరిన ఆర్సీబీ టీమ్ మరోవైపు. ఈ రెండు టీమ్స్ మధ్య హోరాహోరీగా టైటిల్ పోరు జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా జరగనున్న తుదిపోరులో ఎవరు గెలుస్తారు? ఇరు జట్ల బలాలు, బలహీనతలు ఎలా ఉన్నాయి? ఓసారి పరిశీలిద్దాం.
ఉమెన్స్ ప్రీమియర్ ప్రారంభించిన తొలి సీజన్ లోనే ఫైనల్ కు చేరి ఔరా అనిపించింది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే టైటిల్ పోరులో ముంబై చేతిలో ఓడిపోయి గతేడాది రన్నరప్ గా నిలిచింది. కానీ ఈసారి మాత్రం కప్ వదలకూడదనే లక్ష్యంతో టోర్నీలో ముందుకుసాగుతోంది. మెక్ లానింగ్ కెప్టెన్సీలో ఈ సీజన్ లో ఇప్పటి వరకు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చింది ఢిల్లీ. లీగ్ దశలో 8 మ్యాచ్ ల్లో 6 విజయాలు సాధించి ఫైనల్ కు దూసుకొచ్చింది. ఇక ఢిల్లీకి ప్రధాన బలం కెప్టెన్ లానింగే. బ్యాటింగ్ లో రాణిస్తూ.. టోర్నీలో ఇప్పటికే 308 పరుగులు చేసింది. ఆమెకు తోడు లేడీ సెహ్వాగ్ గా పేరొందిన షెఫాలీ వర్మ(265), చిచ్చరపిడుగు జెమీమా రోడ్రిగ్స్(235), అలీస్ క్యాప్సీ(230) పరుగులు చేసి బ్యాటింగ్ లో జట్టుకు అండగా నిలుస్తూ వస్తున్నారు.
ఇక బౌలింగ్ లో స్టార్ ఆల్ రౌండర్ మారిజేన్ కాంప్ 11 వికెట్లు తీసి, బంతితో పాటుగా బ్యాట్ తో కూడా రాణించడం ఢిల్లీకి బలం. మిగతా వారిలో జోనాసెన్(11), రాధా యాదవ్(10) వికెట్లు తీసి విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా.. ఢిల్లీ జట్టుకు ఉన్న ప్రధాన బలహీనత ఏంటంటే? లీగ్ దశలో అద్భుతంగా ఆడుతున్న ఆ టీమ్ ఫైనల్ లాంటి కీలకమైన మ్యాచ్ ల్లో చేతులెత్తేస్తుంది. పైన తెలిపిన వారితో పాటుగా మిగతా ప్లేయర్లు రాణించకపోవడం ఢిల్లీకి మైనస్ పాయింట్. హోం గ్రౌండ్ లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుండటం ఢిల్లీకి కలిసొచ్చే అంశం.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ లో స్మృతి మంధాన నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఈ టోర్నీలో పడుతూ.. లేస్తూ ఫైనల్ కు చేరింది. ఈ లీగ్ లో 8 మ్యాచ్ ల్లో 4 గెలిచి, 4 ఓడిపోయింది. ఆర్సీబీ ప్రధాన బలం బ్యూటీ విత్ టాలెంట్ స్టార్ ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ. ఈ లీగ్ లో బ్యాట్ తో రాణిస్తూ.. 312 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఆమెకు తోడు కెప్టెన్ స్మృతి మంధాన (269), రిచా ఘోష్(240) పరుగులతో బ్యాటింగ్ లో సత్తాచాటుతున్నారు. మిగతావారు కూడా బ్యాట్ తో రాణిస్తే.. ఆర్సీబీ తొలి టైటిల్ ను ముద్దాడటం ఖాయం. బౌలింగ్ లో ఆశ(10), సోఫీ మోలనూ(9) వికెట్లతో రాణించారు.
ఇక ఆర్సీబీ బలహీనతల విషయానికి వస్తే.. నిలకడలేమి ఆ జట్టుకు మెయిన్ మైనస్ పాయింట్ గా మారుతోంది. ఓ మ్యాచ్ లో గెలిచి.. మరో మ్యాచ్ లో ఓడి.. ఇలా అప్ అండ్ డౌన్ లతో బండిలాగిస్తోంది. ఇది టీమ్ లో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి. పైగా బౌలింగ్ లో ఆర్సీబీ బలహీనంగా కనిపిస్తోంది. ఆశ శోభన, సోఫీ తప్పితే మిగతా బౌలర్లు పెద్దగా రాణించడంలేదు. రేణుక, శ్రేయాంకతో పాటుగా వేర్ హామ్ కూడా రాణించాల్సి ఉంది. అయితే ఫైనల్ మ్యాచ్ లో బెంగళూరును కలవరపెట్టే విషయం ఒకటుంది. ఈ సీజన్ లీగ్ దశలో రెండు మ్యాచ్ లతో సహా.. డబ్ల్యూపీఎల్ లో ఇప్పటి వరకూ అన్ని మ్యాచ్ ల్లో ఆర్పీబీపై అన్ని మ్యాచ్ ల్లోనూ ఢిల్లీ గెలిచింది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఢిల్లీకే టైటిల్ కొట్టే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి మీ దృష్టిలో WPL టైటిల్ గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు(అంచనా):
షెఫాలీ వర్మ, తానియా భాటియా(కీపర్) మెక్ లానింగ్(కెప్టెన్), అలీస్ కాప్సీ, జెమీమి రోడ్రిగ్స్, మారిజానే కాంప్, జెస్ జోనాసెన్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, శిఖా పాండే, మిన్ను మని.
ఆర్సీబీ జట్టు( అంచనా):
స్మృతి మంధాన(కెప్టెన్), రిచా ఘోష్(కీపర్), సోఫియా డెవిన్, ఎల్లీస్ పెర్రీ, దిశా కసత్, సోఫీ మోలినెక్స్, జార్జియా వారెహమ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, రేణుక సింగ్, శ్రద్ద పోకార్కర్
ఇదికూడా చదవండి: IPL ఓ సర్కస్.. చూడ్డానికి బాగుంటుంది.. స్టార్క్ ఊహించని కామెంట్స్