iDreamPost

సౌత్ ఆఫ్రికా- ఆస్ట్రేలియా మ్యాచ్.. ఇండియన్ ఫ్యాన్స్ ఎవరివైపు?

వరల్డ్ కప్ లో టీమిండియా అప్రతిహితంగా జైత్రయాత్రను కొనసాగిస్తోంది. వరల్డ్ కప్ కైవసం చేసుకునేందుకు అడుగు దూరంలో ఉంది. వరుసగా 10 మ్యాచులు గెలిచి శభాష్ అనిపించుకుంది.

వరల్డ్ కప్ లో టీమిండియా అప్రతిహితంగా జైత్రయాత్రను కొనసాగిస్తోంది. వరల్డ్ కప్ కైవసం చేసుకునేందుకు అడుగు దూరంలో ఉంది. వరుసగా 10 మ్యాచులు గెలిచి శభాష్ అనిపించుకుంది.

సౌత్ ఆఫ్రికా- ఆస్ట్రేలియా మ్యాచ్.. ఇండియన్ ఫ్యాన్స్ ఎవరివైపు?

వరల్డ్ కప్ 2023లో తొలి సెమీ ఫైనల్ లో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం నమోదు చేసింది. అందరూ కూడా మ్యాచ్ కి ముందు ఎన్నో భయాలతో టీవీల ముందు కూర్చున్నారు. కానీ, అటు బ్యాటుతో ఇటు బాల్ తో టీమిండియా మాయాజాలం చేసింది. వెరసి 70 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసి ఫైనల్ చేరింది. అయితే మనం ఫైనల్ కి వెళ్లా బాగానే ఉంది. మరి.. మన ప్రత్యర్థి ఎవరు? ఎవరైతే మనకు మంచిది? అసలు రెండో సెమీ ఫైనల్ లో ఇండియన్ ఫ్యాన్స్ సపోర్ట్ ఎవరికి ఉండబోతోంది? ఈ విషయాలను ఒకసారి పరిశీలిద్దాం.

నవంబర్ 16న ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియా- సౌత్ ఆఫ్రికా జట్లు రెండో సెమీ ఫైనల్ లో తలపడుతున్నాయి. ఈ రెండు జట్లలో ఏది విజయం సాధిస్తే వాళ్లు మనతో ఫైనల్ ఆడతారు. అయితే ఈ రెండు జట్లలో ఇండియన్ ఫ్యాన్స్ ఎవరికి సపోర్ట్ చేస్తారు అనే ప్రశ్న నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అందుకు సమాధానం చాలా సింపుల్ అనే చెప్పాలి. టీమిండియా క్రికెట్ అభిమానులు మాత్రమే కాదు.. భారతీయులు అందరూ కూడా రెండో సెమీస్ లో సౌత్ ఆఫ్రికానే గెలవాలి అని కోరుకుంటారు. అందుకు కారణం లేకపోలేదు.. బలమైన ప్రత్యర్థి కంటే.. బలహీనతలు కలిగిన ప్రత్యర్థి అయితే విజయం సులభతరం అవుతుంది. ఆస్ట్రేలియా- సౌత్ ఆఫ్రికా జట్లలో ఫైనల్ కు మనకు సౌత్ ఆఫ్రికా జట్టు అయితేనే మంచిది.

ఆస్ట్రేలియా ఎందుకు ఓడిపోవాలి అంటే.. ఆసీస్ జట్టుకు ఫైనల్ మ్యాచ్ అనేది కొట్టిన పిండి. వాళ్లు ఇప్పటి వరకు ఆడింది ఒక లెక్క ఫైనల్ లో ఆడేది ఒక లెక్క. తుది పోరు అనగానే ఆ జట్టు అప్రౌచ్ మొత్తం మారిపోతుంది. అందరూ కూడా ప్రాణం పెట్టి ఆడతారు. ఇప్పటికే చాలా ఫైనల్స్ లో ఆస్ట్రేలియా ఆట ఎలా ఉంటుందో అందరం చూశాం. అంతేకాకుండా ఆ జట్టులో ప్రతి ఒక్క ప్లేయర్ మ్యాచ్ ని ఒంటి చేత్తే గెలిపించగల సత్తా కలిగిన వాళ్లే. ఓపెనర్ దగ్గరి నుంచి టెయిలెండర్ వరకు కూడా అందరూ బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్నవాళ్లు. పైగా స్పిన్, పేస్ ఏదైనా చాలా తేలిగ్గా ఆడగలిన ప్లేయర్స్ ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియా- భారత్ ద్వైపాక్షిక సిరీస్ లు ఎక్కువగానే జరిగాయి. వాళ్లకు టీమిండియా పిచ్ లు కొత్తేం కాదు. చాలా వేగంగా ఆ పిచ్ పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ల ఆట తీరును మార్చుకోగలరు. అలాగే బౌలింగ్ పరంగా కూడా ఆసీస్ జట్టు ఎంతో ప్రమాదకారి. అలాగని సౌత్ ఆఫ్రికా జట్టు తక్కువేం కాదు.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

సౌత్ ఆఫ్రికా కూడా ఫైనల్ లో మంచి ప్రత్యర్థే అవుతుంది. టీమిండియాపై సౌత్ ఆఫ్రికాకు వన్డేల్లో మంచి రికార్డే ఉంది. కానీ, ఈ వరల్డ్ కప్ సీజన్ లో మాత్రం సౌత్ ఆఫ్రికా జట్టు భారత్ ముందు తేలిపోయిందనే చెప్పాలి. సౌత్ ఆఫ్రికా ఫైనల్ లో ఉంటే మనకు మరో అడ్వాటేంజ్ ఏంటంటే.. వాళ్లు స్పిన్ ని సరిగ్గా ఆడలేరు. ఒకవేళ పేస్ ని సమర్థంగా ఎదుర్కొన్నా కూడా స్పిన్ తో వాళ్లని కట్టడి చేసేందుకు ఆస్కారం ఉంటుంది. అలాగే బౌలింగ్ పరంగా చూసుకున్నా కూడా భారత్ పై వాళ్ల అంత ప్రభావం చూపలేరనే చెప్పాలి. అంతేకాకుండా లీగ్ దశలో సౌత్ ఆఫ్రికాపై టీమిండియా 243 పరుగుల తేడాతే ఘన విజయం సాధించింది. ఆ ఆత్మవిశ్వాసంతో మరింత సమర్థంగా ఆడేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాపై సౌత్ ఆఫ్రికా లీగ్ దశలో 134 పరుగుల తేడాతో విజయం సాధించింది. అదే పట్టుదలతో ఆడితే నవంబర్ 19న నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్- సౌత్ ఆఫ్రికా జట్లు ఫైనల్ లో తలపడతాయి. మరి.. సౌత్ ఆఫ్రికా- ఆస్ట్రేలియా మ్యాచ్ లో మీ సపోర్ట్ ఎవరికి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి