ప్రస్తుత క్రికెట్లో గ్రేట్ బ్యాటర్స్ ఎవరంటే అందరూ కోహ్లీ, విలియమ్సన్, రూట్, బాబర్ పేరు చెబుతారు. కానీ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మాత్రం రోహిత్ శర్మ తర్వాతే ఎవరైనా అని అంటున్నాడు. హిట్‌మ్యాన్‌ను మించినోడు లేడని ప్రశంసిస్తున్నాడు.
ప్రస్తుత క్రికెట్లో గ్రేట్ బ్యాటర్స్ ఎవరంటే అందరూ కోహ్లీ, విలియమ్సన్, రూట్, బాబర్ పేరు చెబుతారు. కానీ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మాత్రం రోహిత్ శర్మ తర్వాతే ఎవరైనా అని అంటున్నాడు. హిట్‌మ్యాన్‌ను మించినోడు లేడని ప్రశంసిస్తున్నాడు.
వరల్డ్ కప్‌లో టీమిండియా జైత్రయాత్ర అలాగే కంటిన్యూ అవుతోంది. వరుస విజయాలు సాధిస్తూ వస్తున్న భారత్.. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్నూ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగింది రోహిత్ సేన.. ఓవర్లన్నీ ఆడి 4 వికెట్లకు ఏకంగా 410 పరుగుల భారీ స్కోరును ప్రత్యర్థుల ముందు ఉంచింది. కెప్టెన్ రోహిత్ శర్మ (61)తో పాటు మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (51), సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (51) హాఫ్ సెంచరీలతో మెరిశారు. మిడిలార్డర్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్ (128 నాటౌట్), కేఎల్ రాహుల్ (102) శతకాలతో మోత మోగించారు. అసాధ్యమైన టార్గెట్‌ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన డచ్ టీమ్ 47.5 ఓవర్లలో 250 రన్స్‌కే కుప్పకూలింది.
జస్ప్రీత్ బుమ్రా (2 వికెట్లు), మహ్మద్ సిరాజ్ (2 వికెట్లు), రవీంద్ర జడేజా (2 వికెట్లు), కుల్దీప్ యాదవ్ (2 వికెట్లు) ప్రత్యర్థి బ్యాటర్ల పనిపట్టారు. వీళ్లకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఒక్కో వికెట్ తీసి మంచి సహకారం అందించారు. సీనియర్లు విరాట్, రోహిత్‌తో పాటు ఈ మ్యాచ్‌లో యంగ్‌స్టర్ శుబ్‌మన్ గిల్, హార్డ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ కూడా బౌలింగ్ చేయడం విశేషం. నాకౌట్ మ్యాచ్‌లో అవసరం వస్తే కొన్ని ఓవర్లు వేసేందుకు రెడీగా ఉండాలనే ఉద్దేశంతో అందరితో బౌలింగ్ ప్రాక్టీస్ చేయించాడు రోహిత్. అతడి ప్లాన్ కొంతమేర సక్సెస్ అయింది. విరాట్‌తో పాటు హిట్‌మ్యాన్‌కు కూడా ఒక వికెట్ దక్కింది. సూర్య వికెట్ తీయకపోయినా తన యాక్షన్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు. డచ్ టీమ్ బ్యాటర్లను రోహిత్, కోహ్లీ ఔట్ చేసినప్పుడు స్టేడియంలోని భారత ఫ్యాన్స్ అందరూ సంతోషంలో మునిగిపోయారు. అభిమానులు ఈలలు వేస్తూ రోహిత్, కోహ్లీని ఎంకరేజ్ చేశారు.
ఇక, ఈ వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ బ్యాట్‌తో రాణిస్తూనే కెప్టెన్‌గానూ టీమ్‌ను ముందుండి నడిపిస్తున్నాడు. మెగా టోర్నీలో సూపర్ ఫామ్‌లో ఉన్న హిట్‌మ్యాన్ 9 మ్యాచుల్లో కలిపి 503 రన్స్ చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 121.49గా ఉంది. టాప్-10 రన్ స్కోరర్స్‌లో అతడి స్ట్రైక్ రేటే అందరికంటే ఎక్కువ కావడం విశేషం. దీన్ని బట్టే ఈ వరల్డ్ కప్‌లో ప్రత్యర్థి బౌలర్లపై భారత కెప్టెన్ డామినేషన్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ధనాధన్ ఇన్నింగ్స్‌లతో భారత్‌కు మంచి స్టార్ట్స్ ఇస్తున్నాడు. రోహిత్ అలా ఆడుతున్నాడు కాబట్టే తర్వాత క్రీజులోకి వచ్చే కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మీద ప్రెజర్ తగ్గుతోంది.
ఫీల్డింగ్ టైమ్‌లోనూ సరైన ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్ పెడుతూ, బౌలింగ్ ఛేంజెస్ చేస్తూ, బౌలర్లకు సలహాలు, సూచనలు ఇస్తూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు రోహిత్. అందుకే అతడ్ని మించినోడు లేడని పాకిస్థాన్ బౌలింగ్ లెజెండ్ వసీం అక్రమ్ అన్నాడు. ‘రోహిత్ శర్మ లాంటోడు మరొకడు లేడు. ఎప్పుడూ కోహ్లీ, కేన్ విలియమ్సన్, జో రూట్, బాబర్ ఆజం గురించే అందరూ మాట్లాడతారు. కానీ హిట్‌మ్యాన్ వీళ్లందరి కంటే ఎంతో డిఫరెంట్. అతడు ఆడుతుంటే బ్యాటింగ్ ఇంత ఈజీనా అనిపిస్తుంది. సిచ్యువేషన్ ఏదైనా, ఎలాంటి బౌలింగ్ అటాక్ ఉన్నా అతడు తన షాట్స్ సులువుగా ఆడేస్తాడు. రోహిత్ ఆడుతున్నప్పుడు ఫస్ట్ బాల్ నుంచే ప్రత్యర్థి బౌలర్లు బ్యాక్ ఫుట్‌లోకి వెళ్లిపోతారు’ అని అక్రమ్ చెప్పుకొచ్చాడు. మరి.. రోహిత్‌ను మెచ్చుకుంటూ అక్రమ్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: సచిన్ బ్యాటింగ్ రికార్డుల గురించే మాట్లాడతారు.. అతడి బౌలింగ్ ఎంత గొప్పో తెలుసా?
Wasim Akram said, “there’s no one like Rohit Sharma. We keep talking about Kohli, Kane, Root, Babar, but this guy is different. He makes batting look so easy. No matter what the situation is, the bowling attack is, he plays his shots with ease. Bowlers and oppositions are on the… pic.twitter.com/2jAkNuJAiU
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 13, 2023