న్యూజిలాండ్‌తో సెమీస్‌.. అలా జరిగితే నేరుగా ఫైనల్‌కు టీమిండియా!

  • Author Soma Sekhar Updated - 12:18 PM, Tue - 14 November 23

వరల్డ్ కప్ సెమీస్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరగబోయే మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించి.. 2019 ప్రపంచ కప్ సెమీస్ లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. ఇక ఈ మ్యాచ్ లో అదే గనక జరిగితే టీమిండియా నేరుగా ఫైనల్ కు వెళ్తుంది.

వరల్డ్ కప్ సెమీస్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరగబోయే మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించి.. 2019 ప్రపంచ కప్ సెమీస్ లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. ఇక ఈ మ్యాచ్ లో అదే గనక జరిగితే టీమిండియా నేరుగా ఫైనల్ కు వెళ్తుంది.

  • Author Soma Sekhar Updated - 12:18 PM, Tue - 14 November 23

వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లకు రంగం సిద్ధమైంది. నవంబర్ 15న తొలి పోరులో టీమిండియా-న్యూజిలాండ్ లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా నిలవనుండగా.. రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో ఆసీస్-సౌతాఫ్రికా టీమ్స్ ఢీకొనబోతున్నాయి. ఇక భారత్ ఆడే మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఫైనల్ కు వెళ్లే అవకాశాలపై ఎన్నో ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా.. ఈ మ్యాచ్ లో అదే జరిగితే భారత్ డైరెక్ట్ గా ఫైనల్లోకి దూసుకెళ్తుంది అన్న గణాంకాలు ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేస్తున్నాయి.

వరల్డ్ కప్ సెమీస్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరగబోయే మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించి.. 2019 ప్రపంచ కప్ సెమీస్ లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. ఇక ఈ మ్యాచ్ కోసం వాంఖడే స్టేడియం సర్వం సిద్దమైంది. అయితే భారతదేశంలోని కోస్తా ప్రాంతాల్లో రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగిస్తుందన్న భయం అందరిలో నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ఐసీసీ సెమీఫైనల్ మ్యాచ్ లకు, ఫైనల్ మ్యాచ్ కు రిజర్వ్ డేను ప్రకటించింది.

కాగా.. రిజర్వ్ డే నాడు కూడా మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించి మ్యాచ్ రద్దు అయితే.. ఫైనల్ కు ఏ జట్లు వెళ్తాయి అన్నదే చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న. రిజర్వ్ డే రోజున కూడా వర్షం పడితే.. టీమిండియా డైరెక్ట్ గా వరల్డ్ కప్ ఫైనల్లోకి అడుగుపెడుతుంది. దానికి కారణం పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉండటం, కివీస్ నాలుగో ప్లేస్ లో ఉండటమే. దీంతో ఇదే జరిగితే టీమిండియా దర్జాగా ఫైనల్లోకి వెళ్తుంది. ఇక రెండో మ్యాచ్ కూడా ఇలాగే రద్దు అయితే పాయింట్ల పట్టికలో ముందున్న టీమ్ ఫైనల్లోకి వస్తుంది. అంటే ఆసీస్ కంటే ముందున్న సౌతాఫ్రికా జట్టు ఫైనల్లోకి ప్రవేశించి.. భారత్ ను ఢీకొంటుంది. ఈ వార్త టీమిండియా ఫ్యాన్స్ ను సంతోషంలో ముంచెత్తుతోంది.

Show comments