రోహిత్ శర్మ అరుదైన రికార్డుపై ఒక స్టార్ బ్యాటర్ కన్నేశాడు. ఎలాగైనా సరే హిట్‌మ్యాన్ ఘనతను తానూ అందుకోవాలని చూస్తున్నాడు. కుదిరితే ఈ వరల్డ్ కప్‌లో రోహిత్ రికార్డును బ్రేక్ చేయాలని చూస్తున్నాడు.
రోహిత్ శర్మ అరుదైన రికార్డుపై ఒక స్టార్ బ్యాటర్ కన్నేశాడు. ఎలాగైనా సరే హిట్‌మ్యాన్ ఘనతను తానూ అందుకోవాలని చూస్తున్నాడు. కుదిరితే ఈ వరల్డ్ కప్‌లో రోహిత్ రికార్డును బ్రేక్ చేయాలని చూస్తున్నాడు.
వన్డే వరల్డ్ కప్-2023లో వరుస విజయాలతో దూసుకెళ్తున్నాయి భారత్, సౌతాఫ్రికా. ఇప్పటిదాకా ఆడిన అన్ని మ్యాచుల్లోనూ నెగ్గి పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్‌లో ఉంది టీమిండియా. సఫారీ టీమ్ మెగా టోర్నీలో ఆడిన ఏడు మ్యాచుల్లో ఆరింట్లో నెగ్గి రెండో స్థానంలో నిలిచింది. కేవలం నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో మాత్రమే ఆ టీమ్ ఓటమి పాలైంది. అయితే మిగిలిన మ్యాచుల్లో మాత్రం బవుమా సేన భారత్‌లాగే అటాకింగ్ గేమ్‌తో అదరగొట్టింది. ముఖ్యంగా సౌతాఫ్రికా బ్యాటర్లు సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. ఆ టీమ్ ఓపెనర్ క్వింటన్ డికాక్ అయితే ఈ వరల్డ్ కప్‌లో ఆడిన ఏడు మ్యాచుల్లో ఏకంగా 4 సెంచరీలు బాదాడు.
ఈ ప్రపంచ కప్‌లో ఇప్పటిదాకా ఆడిన ఏడు మ్యాచుల్లో కలిపి 545 రన్స్ చేశాడు డికాక్. తద్వారా అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్ల లిస్టులో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచాడు. అతడి తర్వాతి స్థానాల్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (442 రన్స్), కివీస్ నయా స్టార్ రచిన్ రవీంద్ర (415 రన్స్), ఆసీస్ సీనియర్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ (413 రన్స్), టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (402 రన్స్) ఉన్నారు. సౌతాఫ్రికా టీమ్‌లో డికాక్‌తో పాటు ఎయిడెన్ మార్క్రమ్ (362) , వాండర్ డస్సెన్ (353), క్లాసెన్ (315) కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. దీంతో ఆ టీమ్‌కు ఎదురే లేకుండా పోతోంది. అయితే నవంబర్ 5న, కోల్‌కతాలో భారత్‌తో జరిగే మ్యాచ్ సఫారీ టీమ్‌కు అసలైన పోటీగా చెప్పొచ్చు. ఇప్పటిదాకా ఓటమనేదే లేకుండా ఉన్న టీమిండియా, భీకరమైన ఫామ్‌లో ఉన్న సౌతాఫ్రికాల మధ్య జరిగే ఫైట్‌లో ఎవరు గెలుస్తారో ఇంట్రెస్టింగ్గా మారింది.
భారత్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ అరుదైన ఘనతపై సఫారీ ఓపెనర్ డికాక్ కన్నేశాడు. ఈ వరల్డ్ కప్‌లో 4 సెంచరీలు బాదిన డికాక్.. మరో శతకం చేస్తే ప్రపంచ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రోహిత్ శర్మ (5 సెంచరీలు)తో సమానంగా నిలుస్తాడు. అలాగే ఇంకో సెంచరీ బాదితే అతడి రికార్డును కూడా బ్రేక్ చేస్తాడు. లీగ్‌లో మరో రెండు మ్యాచ్‌లు, సెమీస్ కూడా ఉన్నందున హిట్‌మ్యాన్ రికార్డును బ్రేక్ చేయాలని డికాక్ అనుకుంటున్నాడు. దీంతో రోహిత్ ఘనతకు మూడిందని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే డికాక్‌కు అంత సీన్ లేదని.. భారత బౌలర్లను ఎదుర్కొని సెంచరీ చేయడం కష్టమని అంటున్నారు. సెమీస్‌లోనూ టీమిండియా ఎదురుపడితే డికాక్ సెంచరీ కొట్టలేడని.. రోహిత్ రికార్డు సేఫ్ అని చెబుతున్నారు. మరి.. రోహిత్ సెంచరీల రికార్డును డికాక్ బ్రేక్ చేస్తాడని మీరు భావిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: సెమీస్‌కు ముందు భారత్‌కు భారీ షాక్.. వరల్డ్ కప్‌కు స్టార్ ప్లేయర్ దూరం!
Most hundreds in a single World Cup edition:
Rohit Sharma – 5 in 2019
De Kock – 4* in 2023
Kumar Sangakkara – 4 in 2015 pic.twitter.com/0ytbz3zScJ— Johns. (@CricCrazyJohns) November 1, 2023