iDreamPost
android-app
ios-app

షమి జీవితంలోకి కొత్త అమ్మాయి? వరల్డ్ కప్ తలరాత మార్చేసింది!

  • Author singhj Published - 12:44 PM, Thu - 9 November 23

భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమి లైఫ్​లోకి ఓ కొత్త అమ్మాయి రావడం చర్చనీయాంశంగా మారింది. ఆమె రాక వల్లే షమి అద్భుతంగా రాణిస్తున్నాడని.. వరల్డ్ కప్​లో అతడి తలరాత మార్చేసిందని అంటున్నారు.

భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమి లైఫ్​లోకి ఓ కొత్త అమ్మాయి రావడం చర్చనీయాంశంగా మారింది. ఆమె రాక వల్లే షమి అద్భుతంగా రాణిస్తున్నాడని.. వరల్డ్ కప్​లో అతడి తలరాత మార్చేసిందని అంటున్నారు.

  • Author singhj Published - 12:44 PM, Thu - 9 November 23
షమి జీవితంలోకి కొత్త అమ్మాయి? వరల్డ్ కప్ తలరాత మార్చేసింది!

వన్డే ప్రపంచ కప్-2023లో టీమిండియా వరుస విజయాలతో దుమ్మురేపుతోంది. ఒకటి, రెండు కాదు.. ఇప్పటిదాకా ఆడిన 8 మ్యాచుల్లోనూ నెగ్గి హాట్ ఫేవరెట్​గా అవతరించింది రోహిత్ సేన. లీగ్ స్టేజ్​లో భాగంగా నెదర్లాండ్స్​తో చివరి మ్యాచ్​లో తలపడనుంది. ఈ మ్యాచ్ అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి నాకౌట్ ఫైట్​ పైనే భారత్ ఫోకస్ చేస్తోంది. ఇప్పటికే ఒక సెమీస్​లో సౌతాఫ్రికా-ఆస్ట్రేలియాలు పోటీపడతాయని తెలిసిపోయింది. మరో సెమీస్​లో టీమిండియాతో తలపడబోయేది ఎవరో తేలాల్సి ఉంది. న్యూజిలాండ్, పాకిస్థాన్​ల్లో ఒక టీమ్​తో రోహిత్ సేన ఆడే అవకాశాలు ఉన్నాయి. ఏ టీమ్ వచ్చినా రండి చూస్కుందామంటూ సవాల్ విసురుతున్నారు భారత క్రికెటర్లు. ఈ వరల్డ్ కప్​లో టీమిండియా భీకర ఫామ్​లో ఉంది.

వరల్డ్ కప్​లో భారత వరుస విజయాల్లో బ్యాటర్ల పాత్ర ఎంత ఉందో.. అంతకంటే ఎన్నో రెట్లు బౌలర్ల రోల్ ఉందని చెప్పొచ్చు. మొదట బ్యాటింగ్ చేసినా లేదా ఛేజింగ్ చేసినా మన బ్యాట్స్​మెన్ అంత స్వేచ్ఛగా ఆడుతున్నారంటే బౌలర్ల మీద ఉన్న నమ్మకమనే చెప్పాలి. ముఖ్యంగా భారత పేస్ అటాక్ ధాటికి ప్రత్యర్థి బ్యాట్స్​మెన్ క్రీజులో నిలబడలేకపోతున్నారు. సీనియర్ స్పీడ్​స్టర్ మహ్మద్ షమి వచ్చాక భారత బౌలింగ్ డెప్త్ మరింత పెరిగింది. మెగా టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచుల్లో కలిపి ఏకంగా 16 వికెట్లు పడగొట్టిన షమి మోస్ట్ డేంజరస్ బౌలర్​గా మారాడు. అతడి సీమ్ డెలివరీస్​ను ఎదుర్కోవాలంటేనే టాప్ బ్యాటర్స్ కూడా భయపడుతున్నారు. షమి బౌలింగ్ వేస్తుంటే దాదాపుగా ప్రతి బాల్​కు వికెట్ పడుతుందేమోనని అనిపిస్తోంది. దీన్ని బట్టే వెటరన్ పేసర్ బౌలింగ్​లో పదును ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

షమి బౌలింగ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. అతడి బౌలింగ్ సూపర్బ్ అని.. మాజీ భార్య హసీన్ జహాన్​ను ఊహించుకొని వికెట్లను టార్గెట్ చేసి బ్యాటర్లను బౌల్డ్ చేస్తున్నాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇదే టైమ్​లో షమి లైఫ్​లోకి ఒక కొత్తమ్మాయి వచ్చిందని నెట్టింట వినిపిస్తోంది. ఆ అమ్మాయి రావడం వల్లే వరల్డ్ కప్​లో షమి తలరాత మారిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ అమ్మాయి మరెవరో కాదు.. హీరోయిన్ పాయల్ ఘోష్ అని టాక్. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’లో తమన్నాకు ఫ్రెండ్​గా నటించిందీ బ్యూటీ. తెలుగు ఆడియెన్స్​కు సుపరిచితమైన ఈ సుందరి.. క్రికెటర్​ షమీకి ప్రపోజ్ చేసిందని తెలుస్తోంది. అయితే భారత పేసర్ తన ఇంగ్లీష్​ను మెరుగుపర్చుకుంటేనే తాను పెళ్లి చేసుకుంటానని ఒక కండీషన్ పెట్టిందని తెలిసింది.

సెమీఫైనల్​లో బెస్ట్‌ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి తన నుంచి ఏదైనా సాయం కావాలా చెప్పాలని షమీని ట్విట్టర్​లో కోరింది పాయల్ ఘోష్. ముందుగా టీమిండియా ఫైనల్స్​లో ప్లేస్ సంపాదించాలని.. అక్కడ షమి హీరోగా నిలిస్తే చూడాలని ఉందని ఆమె పేర్కొంది. అయితే టీమిండియా పేసర్​తో పాయల్ ప్రేమలో పడిందా? లేదా పబ్లిసిటీ కోసమే ఇలా ట్వీట్ చేసిందా? అని సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. పాయల్ ఇచ్చిన ఆఫర్ వల్లే షమి చెలరేగి బౌలింగ్ చేస్తున్నాడని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, హసీన్ జహాన్​ అనే మహిళను 2014లో షమి పెళ్లాడాడు. వారికి ఆ మరుసటి ఏడాది ఒక కూతురు పుట్టింది. అయితే షమి తనను వేధిస్తున్నాడంటూ 2018లో అతడిపై కేసు పెట్టింది హసీన్. అప్పటి నుంచి ఈ జంట వేర్వేరుగా ఉంటున్నారు. ఈ కేసు విషయంలో రీసెంట్​గా తీర్పును ఇచ్చిన కోల్​కతా కోర్టు.. హసీన్​కు భరణం కింద ప్రతి నెలా రూ.1.30 లక్షలు చెల్లించాలని షమీని ఆదేశించింది.

ఇదీ చదవండి: బంగ్లా కెప్టెన్ షకీబ్ పరువు తీసిన క్రిస్ వోక్స్.. అంపైర్ దగ్గరకు వెళ్లి..!