iDreamPost
android-app
ios-app

కమ్​బ్యాక్​లో రెచ్చిపోతున్న KL రాహుల్​.. అతడి​ సక్సెస్​కు కారణం అదే!

  • Author singhj Published - 08:54 AM, Thu - 12 October 23
  • Author singhj Published - 08:54 AM, Thu - 12 October 23
కమ్​బ్యాక్​లో రెచ్చిపోతున్న KL రాహుల్​.. అతడి​ సక్సెస్​కు కారణం అదే!

అన్ని గేమ్స్​లాగే క్రికెట్ కూడా. జెంటిల్మన్ గేమ్​లో ఇంజ్యురీస్ అనేవి చాలా కామన్. అయితే గాయాలపాలైన ప్లేయర్లు కొన్నిసార్లు తక్కువ గ్యాప్​లో మళ్లీ టీమ్​లోకి వస్తే.. ఇంకొన్ని సార్లు మాత్రం చాలా టైమ్ తీసుకుంటారు. గాయాల తర్వాత కమ్​బ్యాక్ ఇవ్వడం గొప్ప విషయం కాదు. కానీ మునుపటి స్థాయిలో ఆడటం, ఫిట్​గా ఉండటం, ఫోకస్డ్​గా కెరీర్​ను మలుచుకోవడం అంత ఈజీ కాదు. రీఎంట్రీలో ఫెయిలై రేసులో వెనుకబడిపోయిన ప్లేయర్లు చాలా మందే ఉన్నారు. క్యాన్సర్ రాకముందు వరకు వరల్డ్ కప్​తో పాటు పలు టోర్నీల్లో అదరగొట్టిన లెజెండరీ ఆల్​రౌండర్ యువరాజ్ సింగ్.. మహమ్మారి నుంచి కోలుకొని తిరిగొచ్చాక మాత్రం ఆ స్థాయిలో ఆడలేకపోయాడు.

గాయాల నుంచి కోలుకొని రీఎంట్రీ ఇచ్చాక కూడా దాని ప్రభావం కొనసాగుతుంది. మళ్లీ ఇంజ్యురీ అవుతుందేమోననే భయం వెంటాడి.. గేమ్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంటుంది. రెస్ట్ తర్వాత తిరిగి గాడిన పడేందుకు ఇబ్బంది పడుతుంటారు క్రికెటర్స్. కానీ భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ స్టోరీ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఇంజ్యురీ కారణంగా ఐదు నెలల పాటు క్రికెట్​కు దూరమైన రాహుల్.. కమ్​బ్యాక్​లో రెచ్చిపోయి ఆడుతున్నాడు. కెరీర్ బెస్ట్ ఫామ్​తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. రీఎంట్రీలో ఆడిన 8 వన్డేల్లో 402 రన్స్, 100.50 యావరేజ్, ఒక సెంచరీ, 3 హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు.

ఆసియా కప్​తో పాటు వరల్డ్ కప్​ మొదటి మ్యాచ్​లో రాహుల్ తన ఫామ్​ను కంటిన్యూ చేశాడు. ఆసీస్​పై కీలక దశలో బ్యాటింగ్​కు దిగిన రాహుల్ తన ఎక్స్​పీరియెన్స్ మొత్తాన్ని బయటకు తీసి ఆడాడు. మొదట్లో సింగిల్స్, డబుల్స్​తో స్ట్రైక్ రొటేట్ చేసిన ఈ స్టార్ బ్యాటర్.. ఛాన్స్ వచ్చినప్పుడల్లా బంతుల్ని బౌండరీకి తరలించాడు. కోహ్లీతో కలసి భారత్​ను కష్టాల కడలి నుంచి బయటపడేశాడు. విన్నింగ్ షాట్ కొట్టే వరకు అతడు క్రీజును వదల్లేదు. ఈ మ్యాచ్​లో టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించిన రాహుల్ (97 నాటౌట్) కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇంతకుముందు నిలకడ లేదని.. స్ట్రైక్ రేట్ విషయంలోనూ విమర్శలు ఎదుర్కొన్న రాహుల్.. ఇప్పుడు ఆ విషయంలోనూ గాడిన పడ్డాడు. రీఎంట్రీలో అతడి స్ట్రైక్ రేట్ 92.41గా ఉంది.

ఐపీఎల్​లో ఆడుతూ గాయపడిన రాహుల్​ కమ్​బ్యాక్​లో ఇంతగా రెచ్చిపోవడం వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఇంజ్యురీతో బాధపడుతున్న రాహుల్​ తనకు దొరికిన రెస్ట్​ను పూర్తిస్థాయిలో వాడుకున్నాడు. ఫిట్​నెస్​ను మరింత మెరుగుపర్చుకున్నాడు. గంటల తరబడి కీపింగ్ చేయడంతో పాటు సుదీర్ఘంగా బ్యాటింగ్ చేసేందుకు ఫిట్​నెస్ ఇంపార్టెన్స్ ఎంత ఉందో అతడు అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే వికెట్ల మధ్య చురుగ్గా పరిగెత్తడంతో పాటు వికెట్ల వెనుక కీపింగ్​లోనూ సత్తా చాటుతున్నాడు. అలాగే తన బ్యాటింగ్ టెక్నిక్​ను కూడా రాహుల్ స్వల్పంగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది.

మ్యాచ్ పరిస్థితులను బట్టి అవసరమైతే హిట్టింగ్ లేదంటే డిఫెన్స్, స్ట్రైక్ రొటేషన్​కు రాహుల్ ప్రాధాన్యం ఇస్తుండటాన్ని గమనించొచ్చు. అనవసర షాట్లు ఆడి వికెట్ పారేసుకోకుండా క్రీజులో పాతుకుపోవడంపై రాహుల్ ఫోకస్ చేస్తున్నాడు. ఇలా తనకు దొరికిన విరామాన్ని అతడు బాగా వాడుకున్నాడు. ఫిట్​నెస్, గేమ్​పై ఫోకస్, టెక్నిక్ మెరుగుపర్చుకోవడంపై అతడు వర్క్ చేయడం టీమిండియాకు కలిసొస్తోంది. గాయంతో బాధపడుతూ నిరాశలో కూరుకుపోకుండా దొరికిన గ్యాప్​ను ఇంప్రూవ్​మెంట్ కోసం వాడుకోవడమే రాహుల్ సీక్రెట్ అని క్రికెట్ అనలిస్టులు కూడా అంటున్నారు. మరి.. రాహుల్​ కమ్​బ్యాక్​లో ఇంతగా రెచ్చిపోవడానికి ఏది కారణమని మీరు భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: మ్యాంగో మ్యాన్ నవీన్ కోసం కోహ్లీ చేసిన పని వైరల్!

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş