కేన్ విలియమ్సన్.. ప్రస్తుత తరం క్రికెట్లో బెస్ట్ ప్లేయర్లలో ఒకడు. విరాట్ కోహ్లీ, జో రూట్ లాంటి వారితో పోల్చదగ్గ క్రికెటర్. సెంచరీల మీద సెంచరీలు బాదకపోయినా, రికార్డుల మీద రికార్డులు సృష్టించకపోయినా కేన్ చాలా స్పెషల్. బౌండరీలు, సిక్సులతో విరుచుకుపడటం కేన్‌కు తెలియదు. సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేయడం, చెత్త బంతులు దొరికితే బౌండరీలకు తరలించడం, మంచి బంతులకు రెస్పెక్ట్ ఇచ్చి డిఫెన్స్ చేయడమే విలియమ్సన్కు తెలుసు. ఎలాంటి సిచ్యువేషన్లోనైనా కూల్‌గా ఉంటూ మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్తాడు కేన్‌మామ.
బ్యాటింగ్‌లోనే కాదు కెప్టెన్సీలోనూ కేన్ విలియమ్సన్ చాలా ప్రత్యేకం. టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని మాదిరిగా ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా జట్టును నడిపిస్తాడు కేన్. ఒకవేళ ప్రెజర్ ఉన్నా దాన్ని తనలోనే ఉంచుకుంటాడు.. టీమ్‌మేట్స్‌కు చేరనివ్వడు. అప్పుడప్పుడు విఫలమైనా దాదాపుగా చాలా మటుకు మ్యాచుల్లో కెప్టెన్సీ ఇన్నింగ్స్‌లు ఆడుతూ మిగతా వారిలో స్ఫూర్తి నింపుతుంటాడు. గెలిచినా, ఓడినా విలియమ్సన్ ముఖంలో చిరునవ్వు చెరగదు. అందుకే అతడ్ని దేశాలకు అతీతంగా క్రికెట్ ఫ్యాన్స్ ఇష్టపడతారు. అయితే గాయాల వల్ల రేసులో వెనుకబడిపోయాడు కేన్ మామ.
వరుస ఇంజ్యురీలు కేన్ కెరీర్‌ను ప్రశ్నార్థకం చేశాయి. ఈ వరల్డ్ కప్‌లో కూడా అతడు ఆడేది అనుమానంగా మారింది. అయినా సరైన టైమ్‌కు కోలుకున్న ఈ న్యూజిలాండ్ సారథి.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో కివీస్ 8 వికెట్ల తేడాతో అలవోకగా నెగ్గింది. కమ్‌బ్యాక్‌లో ఆడిన తొలి మ్యాచులోనే విలియమ్సన్ (78) మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో గెలిచినా న్యూజిలాండ్ టీమ్ సంతోషంగా లేదు. దీనికి కారణం మళ్లీ విలియమ్సన్కు గాయమవ్వడమే. రన్ తీస్తున్న క్రమంలో బంగ్లా ఫీల్డర్ విసిరిన త్రో కాస్తా కేన్ మామ ఎడమ చేతి బొటన వేలికి తగిలింది.
బాల్ గట్టిగా తగలడంతో నొప్పితో విలవిల్లాడిన విలియమ్సన్ హాఫ్ సెంచరీ తర్వాత రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. ఇవాళ అతడి చేతికి ఎక్స్‌రే తీస్తారు. ఒకవేళ ఇంజ్యురీ చిన్నదే అయితే కేన్ మామ మళ్లీ ఆడతాడు. గాయం పెద్దదైతే మాత్రం కివీస్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. విలియమ్సన్ ఇంజ్యురీపై ఫ్యాన్స్ నెట్టింట స్పందిస్తున్నారు. పాపం.. కేన్ మామను బ్యాడ్ లక్ వదలడం లేదని.. అలా కమ్‌బ్యాక్ ఇచ్చాడో లేదో మళ్లీ గాయమైందని కామెంట్స్ చేస్తున్నారు. విలియమ్సన్ త్వరగా రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. మరి.. కేన్ విలియమ్సన్ వరుసగా గాయాల బారిన పడటంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: World Cup 2023: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌లో గెలిచేదెవరు?
Kane Williamson will have an X-ray on his left thumb tomorrow.
Hopefully everything will be alright with him! pic.twitter.com/g2E3YxBSrs
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 13, 2023