భారత్-ఆసీస్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌లో టాస్ కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పిచ్‌పై ఎంత స్కోరు కొడితే సేఫ్ అనేది ఇప్పుడు చూద్దాం..
భారత్-ఆసీస్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌లో టాస్ కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పిచ్‌పై ఎంత స్కోరు కొడితే సేఫ్ అనేది ఇప్పుడు చూద్దాం..
వరల్డ్ కప్-2023 ఆఖరి దశకు చేరుకుంది. ఇంకో మ్యాచ్ పూర్తయితే మెగా టోర్నీ ముగుస్తుంది. ఇప్పటిదాకా ఎన్నో హోరాహోరీ మ్యాచులు, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్స్‌తో క్రికెట్ లవర్స్, ఫ్యాన్స్‌ను అలరించింది ప్రపంచ కప్. ఇక, అసలైన మజా ఇప్పుడు రానుంది. కప్పు కొట్టేసేందుకు ఆఖరి మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నాయి ఫేవరెట్స్ ఆస్ట్రేలియా, ఇండియా. ఈ రెండు టీమ్స్ మధ్య లీగ్ స్టేజ్‌లో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేనదే పైచేయి అయింది. ఆ మ్యాచ్‌లో ఆసీస్‌ను కుమ్మేసిన భారత్.. ఆ తర్వాత వరుస విజయాలతో సెమీస్‌కు చేరుకుంది. రికార్డులు భయపెడుతున్నా, తీవ్ర ఒత్తిడిలోనూ న్యూజిలాండ్‌కు నాకౌట్ పంచ్ ఇచ్చింది. దీంతో దర్జాగా ఫైనల్‌కు చేరుకొని మూడోసారి వరల్డ్ కప్ అందుకోవడంపై కన్నేసింది.
ఫైనల్ చేరుకోవడం వరకు భారత్ స్టోరీ నల్లేరు మీద నడకలా సాగిందని అనిపించొచ్చు. కానీ వరల్డ్ కప్ ముందు వరకు టీమిండియా ఎన్నో సమస్యలతో సతమతమైంది. ప్లేయర్ల ఇంజ్యురీలు, ఫామ్‌తో ఇబ్బంది పడింది. అయితే ఆసియా కప్-2023తో అన్ని ప్రాబ్లమ్స్‌కు పరిష్కారం దొరికింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌తో మరింత స్ట్రాంగ్ అయిన టీమిండియా.. వరల్డ్ కప్‌లో దుమ్మురేపుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ను సూపర్ స్ట్రాంగ్ చేసుకొని.. పక్కా ప్లాన్‌తో ఆడుతూ ఫైనల్‌కు రీచ్ అయింది. మరోవైపు ఆస్ట్రేలియా స్టోరీ వేరేలా ఉంది. మొదట్లో వరుస ఓటములతో ఇబ్బంది పడింది కంగారూ టీమ్.
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బంది పడినా ఆ తర్వాత ట్రాక్‌లోకి వచ్చింది ఆసీస్. ఒక్కో విజయం సాధిస్తూ సెమీస్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకుంది. లీగ్ స్టేజ్ ఎండింగ్‌కు వచ్చేసరికి డేంజరస్ టీమ్‌గా మారింది. నాకౌట్ మ్యాచ్‌లోనూ సౌతాఫ్రికాను తక్కువ రన్స్ ఆలౌట్ చేసింది. ఛేజింగ్‌లో తడబడినా ఆఖరి వరకు పోరాడి గెలిచింది. అద్భుతమైన ఆటతీరుతో ఫైనల్‌కు చేరుకున్న ఈ రెండు టీమ్స్ మధ్య ఫైనల్ ఫైట్ అంటే మామూలుగా ఉండదు. అయితే ఈ మ్యాచ్‌లో పిచ్ కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న అహ్మదాబాద్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. కానీ ఫైనల్ మ్యాచ్ కోసం పిచ్‌ను కాస్త మార్చారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బౌలింగ్ ఫ్రెండ్లీగా పిచ్‌ను సిద్ధం చేస్తున్నారని టాక్.
ఈ విషయంపై అహ్మదాబాద్ పిచ్ క్యురేటర్ తాజాగా రియాక్ట్ అయ్యాడు. ‘ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ 315 రన్స్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఈ స్కోరును డిఫెండ్ చేయడం సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టుకు చాలా కష్టంగా మారుతుంది’ అని క్యురేటర్ చెప్పారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే టాస్ కీలకంగా మారుతుంది. టాస్ నెగ్గిన టీమ్ మొదట బ్యాటింగ్‌ను ఎంచుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి 300 ప్లస్ స్కోరు నమోదు చేసి.. ఛేజింగ్‌లో త్వరగా వికెట్లు తీస్తే ప్రత్యర్థి టీమ్ పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయే అవకాశం ఉంది. అందుకే ఇక్కడ టాస్ నెగ్గితే మ్యాచ్ గెలిచేసినట్లేనని అంటున్నారు. మరి.. ఫైనల్లో టాస్ ఎంత వరకు కీలకం అవుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: మనకే కాదు ఆస్ట్రేలియాకూ ఒక హిట్‌మ్యాన్ ఉన్నాడు.. ఫైనల్లో ఏం చేస్తాడో..?
Ahmedabad pitch curator said, “315 could be a defendable score as batting second will be difficult”. (PTI). pic.twitter.com/NyvxRZWB9i
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 17, 2023