iDreamPost
android-app
ios-app

కోహ్లీ సెంచరీ.. బర్త్‌డే నాడే సచిన్‌ రికార్డ్‌ను సమం చేశాడు

  • Published Nov 05, 2023 | 6:15 PM Updated Updated Nov 05, 2023 | 6:16 PM

కింగ్‌ కోహ్లీ బర్త్‌ డే నాడు సచిన్‌ రికార్డును సమం చేశాడు. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఫీట్‌ సాధించాడు. ఆ వివరాలు..

కింగ్‌ కోహ్లీ బర్త్‌ డే నాడు సచిన్‌ రికార్డును సమం చేశాడు. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఫీట్‌ సాధించాడు. ఆ వివరాలు..

  • Published Nov 05, 2023 | 6:15 PMUpdated Nov 05, 2023 | 6:16 PM
కోహ్లీ సెంచరీ.. బర్త్‌డే నాడే సచిన్‌ రికార్డ్‌ను సమం చేశాడు

వన్డే ప్రపంచ కప్‌లో సెమీస్‌కు చేరిన మొదటి రెండు జట్లైన భారత్‌, సౌతాఫ్రికా మధ్య నేడు కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కీలక సమరం జరుగుతోంది. వరుసగా 7 విజయాలతో ఫుల్‌ స్వింగ్‌ మీదున్న టీమ్ ఇండియా.. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి టేబుల్ టాపర్‌గా తన స్థానాన్ని సుస్ధిరం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు సౌతాఫ్రికా.. ఇండియా స్పీడ్‌కు బ్రేక్‌ వేయాలని తీవ్రంగా కృషి చేస్తోంది. నేటి మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన ఇండియా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.

నేటి మ్యాచ్‌లో బర్త్‌డే బాయ్‌ విరాట్‌ కోహ్లీ.. సెంచరీ చేసి.. సచిన్‌ రికార్డును సమం చేశాడు. ఈ సెంచరీతో కోహ్లీ.. వన్డేల్లో 49వ సెంచరీని పూర్తి చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌లో సచిన్‌ రికార్డ్‌ను సమం చేశాడు. నేటి మ్యాచ్‌లో కోహ్లీ 119 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అయితే సచిన్‌ 452 ఇన్నింగ్స్‌ల్లో 49 సెంచరీలు చేయగా.. విరాట్‌ కేవలం 277 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్క్‌ను అందుకున్నాడు. ఇక  తన బర్త్‌డే నాడే కోహ్లీ ఈ ఫీట్‌ సాధించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వరల్డ్‌ కప్‌లో కోహ్లీకి ఇది రెండో సెంచరీ. ఇక బర్త్‌ డే నాడు కోహ్లీ తనకు తానే బెస్ట్‌ గిఫ్ట్‌ ఇచ్చుకున్నాడని కామెంట్స్‌ చేస్తున్నారు అభిమానులు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుని రంగంలోకి దిగింది. తొలుత రోహిత్, గిల్ మంచి స్కోర్‌తో శుభారంభాన్ని అందించారు. 42 పరుగులు చేసిన తర్వాత రోహిత్ ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ తన మార్క్‌ గేమ్‌తో చెలరేగాడు. ప్రారంభంలో బౌండరీలతో అలరించిన కోహ్లీ.. ఆ తర్వాత స్లోగా బ్యాటింగ్‌ చేశాడు. ఈ క్రమంలో 67 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి.. 119 బాల్స్‌కి 100 పరుగులు పూర్తి చేసుకుని సచిన్‌ రికార్డును సమం చేశాడు. 50 ఓవర్లలో టీమిడియా 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది.