iDreamPost
android-app
ios-app

టీమిండియా నిన్న చేసిన ఈ 5 పొరపాట్లు.. ఫైనల్ లో చేస్తే కష్టమే!

వరల్డ్ కప్ లో టీమిండియా ఇప్పటి వరకు ఆడింది ఒకెత్తు.. ఫైనల్ మ్యాచ్ లో ఆడాల్సింది ఒకెత్తు. న్యూజిలాండ్ మీద విజయం సాధించాం. కానీ, ఆ మ్యాచ్ లో చేసిన ఈ 5 పొరపాట్లను మాత్రం అస్సలు రిపీట్ చేయకూడదు.

వరల్డ్ కప్ లో టీమిండియా ఇప్పటి వరకు ఆడింది ఒకెత్తు.. ఫైనల్ మ్యాచ్ లో ఆడాల్సింది ఒకెత్తు. న్యూజిలాండ్ మీద విజయం సాధించాం. కానీ, ఆ మ్యాచ్ లో చేసిన ఈ 5 పొరపాట్లను మాత్రం అస్సలు రిపీట్ చేయకూడదు.

టీమిండియా నిన్న చేసిన ఈ 5 పొరపాట్లు.. ఫైనల్ లో చేస్తే కష్టమే!

వరల్డ్ కప్- 2023 టీమిండియా అభిమానులకు ఎంతగానో గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఆడిన 10 మ్యాచుల్లో 10 విజయాలు నమోదు చేశారు. ఎక్కడా కూడా ఓటమి అనేది లేకుండా ఫైనల్ కు చేరారు. న్యూజిలాండ్ తో నాకౌట్ మ్యాచ్ లో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. అయితే అప్పుడే అయిపోలేదు. ఇంకో ఆట మిగిలుంది. కప్పు కొట్టడానికి అడుగుదూరంలో ఉన్నారు. ఆ ఒక్క అడుగు ఈ టోర్నీతో సమానం. ఇప్పటివరకు ఆడింది అంతా ఒక లెక్క నవంబర్ 19న ఆడాల్సింది ఒక లెక్క. అయితే ఆ మ్యాచ్ లో ఈ 5 తప్పులు చేయకుండా ఉంటే కప్పు కొట్టడం కష్టమేమీ కాదు. మరి.. ఆ 5 తప్పులు ఏంటో చూద్దాం.

న్యూజిలాండ్ జరిగిన మ్యాచ్ లో టీమిండియా 70 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. అయితే ఇది నల్లేరు మీద నడకలా సాగిన మ్యాచ్ కాదు. అతి కష్టం మీద గెలిచిన పోరు. మ్యాచ్ ప్రారంభంలో 39 పరుగులకే 2 వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత మూడో వికెట్ తీసుకోవడానికి టీమిండియా ఎంతో శ్రమించాల్సి వచ్చింది. 220 పరుగలకు మూడు, నాలుగు వికెట్లను న్యూజిలాండ్ కోల్పోయింది. ఆ తర్వాత మరో వికెట్ కోల్పోయే గ్యాప్ లో న్యూజిలాండ్ 75 పరుగులు స్కోర్ చేసింది. షమీ పుంజుకోవడం ద్వారా న్యూజిలాండ్ ఓటమి పాలైంది. కానీ, కాసేపు మాత్రం మ్యాచ్ చేజారిపోతుందనే భయం అయితే అందరిలో కనిపించింది. ఇలాంటి పరిస్థితి ఫైనల్ అస్సలు ఊహించుకోలేం. అలా జరగకుండా ఉండాలి అంటే భారత జట్టు కచ్చితంగా ఈ 5 తప్పులను చేయకూడదు.

బౌలింగ్:

ఇన్ని మ్యాచుల్లో భారత్ విజయం సాధించిందడానికి కారణం బ్యాటింగ్ మాత్రమే కాదు. బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది కాబట్టే ఇన్ని విజయాలు సాధ్యమయ్యాయి. ప్రతి మ్యాచ్ లో బ్యాటింగ్ పరంగా ఎంత మంచి స్కోర్ చేశామో.. అంతే సమర్థంగా వికెట్లు కూడా తీశాం. ఇలా రెండు విభాగాలు పటిష్టంగా ఉండబట్టే అది సాధ్యమైంది. కానీ, న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఎంతో స్ట్రాంగ్ అనుకున్న టీమిండియా బౌలింగ్ విభాగం.. ఒకానొక సమయంలో తేలిపోయింది. విలియమ్సన్, డారిల్ మిచెల్ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేయడానికి చాలానే కష్టపడాల్సి వచ్చింది. అందుకే బౌలింగ్ విభాగంపై కాస్త ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంది. ఫైనల్ లో ఎదురులేకుండా ఉండాలంటే.. కచ్చితంగా బౌలింగ్ మరింత స్ట్రాంగ్ అవ్వాలి.

ఫీల్డింగ్:

వికెట్ తీయడం ఎంత ముఖ్యమో.. రన్స్ రాకుండా కట్టడి చేయడం కూడా అంతే ముఖ్యం. ఫీల్డింగ్ పరంగా టీమిండియాకి పేరు పెట్టాల్సిన అసరం లేదు. కానీ, సెమీ ఫైనల్ లో మిస్ ఫీల్డ్ కనిపించింది. క్యాచెస్ కూడా డ్రాప్ చేశారు. అది జట్టుకు అంత మంచిది కాదు. ఎందుకంటే క్యాచెస్ విన్స్ మ్యాచెస్ అనే నానుడి క్రికెట్ లో ఉండనే ఉంది. అందుకే ఫీల్డింగ్, క్యాచెస్ ని అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ఫైనల్ ఈ తప్పుని కచ్చితంగా ఓవర్ కమ్ చేయాల్సిన అవసరం ఉంది.

ప్రెజర్:

సాధారణంగా ఎంత సీనియర్లు అయినా, ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా కూడా ఆటలో ఒత్తిడి అనేది సహజం. ఆట మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఎంత ఫ్రీగా ఆడతామో.. ప్రత్యర్థి దూకుడు మీద ఉంటే అంతే ఒత్తిడి నెలకొంటుంది. అయితే ఒత్తిడిలోనే ఎక్కువ తప్పులు జరిగే ఆస్కారం ఉంటుంది. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాలు ఒత్తిడిని అధిగమించి ఆడాల్సి ఉంటుంది. అయితే రోహిత్, కోహ్లీ, షమీ, బుమ్రా, జడేజాలాంటి ప్లేయర్లు ప్రెజర్ ని కంట్రోల్ చేసుకోగలరు. కుర్రాళ్లు కూడా ఈ విషయంపై కాస్త దృష్టి పెట్టాలి. ఒత్తిడిలోనే మరింత ఫోకస్ గా ఆడాల్సి ఉంటుంది.

సిరాజ్ బౌలింగ్:

టీమిండియాకి దొరికిన బెస్ట్ యంగ్ బౌలర్స్ లో సిరాజ్ ఒకడు. నిన్న మొన్నటి వరకు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ బౌలర్ గా నిలిచాడు. ఆ తర్వాత సిరాజ్ ప్రదర్శనలో కాస్త మార్పు కనిపించింది. తన నంబర్ వన్ స్థానాన్ని కోల్పోవడమే కాకుండా.. బౌలింగ్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. న్యూజిలాండ్ మ్యాచ్ లో 9 ఓవర్లు వేసి కేవలం 1 వికెట్ మాత్రమే తీశాడు. అందరికంటే ఎక్కువగా 78 పరుగులు ఇచ్చాడు. సిరాజ్ కచ్చితంగా తన బౌలింగ్ పై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఇంకాస్త బెటర్ గా పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరీ ఎక్స్ పెన్సివ్ కాకుండా ఉండటం ముఖ్యం.

షమీపై అతిగా ఆధారపడటం:

షమీ టీమ్ లోకి వచ్చిన తర్వాత దాదాపుగా అన్ని మ్యాచులను అతనే గెలిపించాడు. అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. ప్రపంచ మేటి బ్యాటర్లను సైతం గల్లీ క్రికెటర్లను చేసి బౌల్డ్ చేశాడు. ప్రత్యర్థికి ఎక్కడా ఆస్కారం లేకుండా పదునైన బంతులను సంధిస్తూ ముప్పతిప్పలు పెట్టాడు. అయితే జట్టు మొత్తం ఒక బౌలర్ మీద ఆధారపడటం ఎప్పటికైనా ప్రమాదమే. మిగిలిన బౌలర్లు కూడా తప్పకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి షమీ రాణింస్తాడని, రాణించాలని కోరుకోవడం కూడా తప్పే అవుతుంది. పార్ట్ టైమ్ బౌలర్లపై కూడా కాస్త ఫోకస్ పెడితే బాగుంటుంది. ఈ 5 తప్పులను రిపీట్ చేయకుండా.. రెట్టించిన ఫోకస్ తో ఉంటే ఈ వరల్డ్ కప్ మనదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి.. టీమిండియా ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.