Nidhan
India vs Pakistan: భారత్ మరో కప్పును సొంతం చేసుకుంది. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసి విజేతగా ఆవిర్భవించింది.
India vs Pakistan: భారత్ మరో కప్పును సొంతం చేసుకుంది. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసి విజేతగా ఆవిర్భవించింది.
Nidhan
భారత్ మరో కప్పును సొంతం చేసుకుంది. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసి ఛాంపియన్‌గా అవతరించింది. శనివారం రాత్రి బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దాయాదులు ఢీ అంటే ఢీ అంటూ పోరాడాయి. అయితే మ్యాచ్ ఆఖరి వరకు పట్టు వదలని టీమిండియా విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్ 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్ (36 బంతుల్లో 41), కమ్రాన్ అక్మల్ (19 బంతుల్లో 24) రాణించారు. భారత బౌలర్లలో అనురీత్ సింగ్ 3 వికెట్లతో సత్తా చాటాడు. ఇర్ఫాన్ పఠాన్ ఒక వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన మెన్ ఇన్ బ్లూ.. ఇంకో 5 బంతులు ఉండగా లక్ష్యాన్ని చేరుకుంది.
అంబటి రాయుడు (30 బంతుల్లో 50), గురుకీరత్ సింగ్ మాన్ (33 బంతుల్లో 34) రాణించారు. టోర్నీ మొత్తం ఫర్వాలేదనిపించిన రాయుడు.. ఫైనల్లో మాత్రం బ్యాట్‌తో చెలరేగిపోయాడు. 5 బౌండరీలు బాదిన ఈ తెలుగు తేజం.. 2 భారీ సిక్సులతో పాక్ బౌలర్లను రఫ్ఫాడించాడు. ఆఖర్లో యూసుఫ్ పఠాన్ (16 బంతుల్లో 30) కూడా భారీ సిక్సులతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడు ఔట్ అయినా కెప్టెన్ యువరాజ్ సింగ్ (15) మిగిలిన పనిని పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌తో యువీ ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. సుదీర్ఘ కెరీర్లో అతడు ఎన్నో మర్చిపోలేని విజయాలు అందుకున్నాడు. యంగ్ ఏజ్‌లో అండర్-15తో పాటు అండర్-19 వరల్డ్ కప్ విన్నర్‌గా నిలిచాడు.
టీ20 ప్రపంచ కప్-2007తో పాటు వన్డే వరల్డ్ కప్-2011ను గెలుచుకున్న భారత జట్టులో యువరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని కూడా అతడు చేజిక్కించుకున్నాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతూ ట్రోఫీని ఒడిసిపట్టాడు. ఇప్పడు వరల్డ్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకొని తన కెరీర్‌ను మరింత చిరస్మరణీయం చేసుకున్నాడు. వీటితో పాటు దులీప్ ట్రోఫీ, సాల్వే ఛాలెంజర్స్ ట్రోఫీ, బీసీసీఐ కార్పొరేట్ ట్రోఫీ, ఇరానీ కప్, టీ10 లీగ్, రోడ్ సేఫ్టీ ట్రోఫీ కూడా అతడి ఖాతాలో ఉండటం హైలైట్ అనే చెప్పాలి. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ ఆసాంతం అతడు బ్యాట్‌తో చెలరేగిపోయాడు. భారీ సిక్సులు బాదుతూ వింటేజ్ యువీని తలపించాడు. అలాగే తన మార్క్ కెప్టెన్సీతో టీమ్‌ను ఫైనల్ చేర్చడమే గాక పాక్‌ను చిత్తు చేసి విజేతగా నిలబెట్టాడు. అతడి కెరీర్లో ఇది ఆరో కప్పు కావడం విశేషం. ఒక ప్లేయర్ అన్ని మెగా టోర్నీల్లోనూ విజేతగా నిలిచి కప్ అందుకోవడం ఆల్‌టైమ్ రికార్డ్ అనే చెప్పాలి.
Yuvraj Singh in his career has won:
– U15 World Cup.
– U19 World Cup.
– T20 World Cup.
– ODI World Cup.
– Champions Trophy.
– IPL Trophy.
– Duleep Trophy.
– Salve Challengers Trophy.
– BCCI Corporate Trophy.
– Irani Cup.
– T10 League.
– Road Safety Trophy.
– WCL Trophy. pic.twitter.com/Gc84IMj89A— Mufaddal Vohra (@mufaddal_vohra) July 14, 2024