iDreamPost
android-app
ios-app

Virat Kohli: టెస్ట్‌ సిరీస్‌కు కోహ్లీ దూరం! సిగ్గుచేటంటూ స్టువర్ట్‌ బ్రాడ్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

  • Published Feb 12, 2024 | 5:19 PM Updated Updated Feb 12, 2024 | 5:19 PM

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌కు టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ పూర్తిగా దూరమైన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో కోహ్లీ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ బ్రాడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌కు టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ పూర్తిగా దూరమైన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో కోహ్లీ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ బ్రాడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

  • Published Feb 12, 2024 | 5:19 PMUpdated Feb 12, 2024 | 5:19 PM
Virat Kohli: టెస్ట్‌ సిరీస్‌కు కోహ్లీ దూరం! సిగ్గుచేటంటూ స్టువర్ట్‌ బ్రాడ్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకు అందుబాటులో లేకుండా పోయిన విషయం తెలిసిందే. తొలి రెండు టెస్టులు ఆడేందుకు సిద్ధమైన కోహ్లీ.. తొలి టెస్ట్‌ ఆరంభానికి ముందు వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు దూరం అయ్యాడు. కనీసం చివరి మూడు టెస్టులకైనా అందుబాటులో ఉంటాడనుకుంటే.. క్రికెట్‌ అభిమానులకు నిరాశ మిగుల్చుతూ.. వ్యక్తిగత కారణాలతో దూరం అయ్యాడు. ఇలా కోహ్లీ లేకుండా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య టెస్ట్‌ సిరీస్‌ జరగడంపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ పెదవి విరుస్తున్నారు. అసలైన మజా రావడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాధారణ అభిమానులే కాదు.. ఇప్పుడీ లిస్ట్‌లో ఇంగ్లండ్‌ దిగ్గజ మాజీ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ సైతం చేరిపోయాడు.

కోహ్లీ లేకపోవడం ఈ టెస్ట్‌ సిరీస్‌కే సిగ్గు చేటు అంటూ సంచలన స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. కోహ్లీ ఉంటే టెస్ట్‌ సిరీస్‌లో మజా వచ్చేదని అభిప్రాయపడ్డాడు. ఇదే విషయంపై టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ సైతం స్పందిస్తూ.. కోహ్లీ లేకపోతే.. టెస్ట్‌ క్రికెట్‌ లేదని చెప్పుకోచ్చాడు. కోహ్లీ ఉండి ఉంటే.. కోహ్లీ​ వర్సెస్‌ అండర్సన్‌ సూపర్‌ ఫైట్‌ చూసే అవకాశం ఉండేదని చాలా మంది క్రికెట్‌ అభిమానులు ఆశపడ్డారు. కోహ్లీ లేక బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ అగ్రెసివ్‌నెస్‌ మిస్‌ అవుతుందని చాలా మంది ఫీల్‌ అవుతున్నారు.

వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమైన కోహ్లీ గురించి చాలా వార్తలు వచ్చాయి. తొలుత కోహ్లీ తల్లికి ఆరోగ్యం బాగా లేదని, అందుకే ఆమెతో సమయం గడిపేందుకు కోహ్లీ ఇంటికి వెళ్లాడని మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ, తమ తల్లి క్షేమంగా ఉందని, ఎలాంటి అనారోగ్యం లేదంటూ కోహ్లీ తమ్ముడు వికాస్‌ కోహ్లీ వెల్లడించాడు. ఆ తర్వాత కోహ్లీ స్నేహితుడు, మాజీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌.. కోహ్లీ-అనుష్క దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారని అందుకే జట్టుకు దూరమయ్యాడని చెప్పి, తర్వాత తాను చెప్పింది అబద్ధమని వెల్లడించాడు. దీంతో.. అసలు కోహ్లీ విషయంలో ఏమైందో ఎవరికి తెలియడం లేదు. ఈ నేపథ్యంలో కోహ్లీ లేకపోవడం సిరీస్‌కే సిగ్గుచేటని స్టువర్ట్‌ బ్రాడ్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.