SNP
సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌కు కోసం అసలు సిసలైన టీమిండియా రెడీ అయింది. టీ20, వన్డే సిరీస్‌లను కుర్రాళ్లతో ఆడిన భాతర జట్టు.. ఇప్పుడు టెస్టు సిరీస్‌లో రోహిత్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీలతో కూడిన టీమ్‌తో బరిలోకి దిగుతుంది. ఈ జట్టు ముందు ఓ పెద్ద సవాల్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌కు కోసం అసలు సిసలైన టీమిండియా రెడీ అయింది. టీ20, వన్డే సిరీస్‌లను కుర్రాళ్లతో ఆడిన భాతర జట్టు.. ఇప్పుడు టెస్టు సిరీస్‌లో రోహిత్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీలతో కూడిన టీమ్‌తో బరిలోకి దిగుతుంది. ఈ జట్టు ముందు ఓ పెద్ద సవాల్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
భారత క్రికెట్ అభిమానులతో పాటు, టీమిండియాకు రెండు కళ్లలాంటి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను తీవ్రంగా బాధించిన ఓటమి వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్. ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత జట్టు ఓటమి పాలైన తర్వాత.. తొలి సారి రోహిత్, కోహ్లీ తిరిగి బరిలోకి దిగనున్నారు. సౌతాఫ్రికాతో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్‌తో ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు గ్రౌండ్‌లోకి వస్తున్నారు. దీంతో.. ఈ టెస్ట్ సిరీస్‌పై క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఓటమి బాధ నుంచి తేరుకున్న తర్వాత రోహిత్, కోహ్లీ ఎలా ఆడతారనేదానిపై అందరి దృష్టి నెలకొంది.
మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు సఫారీ పర్యటనకు వెళ్లిన టీమిండియా.. టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది, వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలిచి రికార్డు టీమిండియాకు ఇప్పటి వరకు లేదు. దీంతో ఈ సారి అయినా.. సౌతాఫ్రికాపై టెస్ట్ సిరీస గెలిచి చరిత్ర సృష్టిస్తారా? లేదా? అని భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరల్డ్ కప్ ఓటమి బాధను పూర్తిగా మార్చిపోవాలంటే.. సౌతాఫ్రికాపై వాళ్ల గడ్డపై టీమిండియా టెస్ట్ సిరీస్ విజయం సాధించాలని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇదే విషయంపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందిస్తూ.. వరల్డ్ కప్ ఓటమి తమనెంతో బాధించింది. దాని నుంచి భారత ఆటగాళ్లు బయటికి వచ్చారు. రావాలి కూడా.. ఆ ఓటమి గతం.. తమ ముందు ఇంకా కొత్త సవాళ్లు ఉన్నాయి. అయినా.. భారత జట్టులోని ఆటగాళ్లకు కొత్తగా మోటివేషన్ అవసరం లేదు. వాళ్లకు అంతా తెలుసని ద్రవిడ్ పేర్కొన్నాడు. కాగా, వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌కు అలాగే సౌతాఫ్రికాతో ముగిసిన టీ20, వన్డే సిరీస్‌లకు రోహిత్ శర్మ, కోహ్లీ రెస్ట్ తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో.. వరల్డ్ కప్ ఓటమితో గాయపడిన ఈ రెండు సింహాలు.. సఫారీల పని పడతాయని, గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుందని ఏదో సినిమాలో డైలాగ్‌లా.. రోహిత్, కోహ్లీ అనే రెండు గాయపడిన సింహాలు.. సౌతాఫ్రికాపై చెలరేగుతాయని క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి సౌతాఫ్రికాపై టెస్ట్ సిరీస్‌ను రోహిత్, కోహ్లీ గెలిపిస్తారని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Session timing of India vs South Africa Test series. [IST]
1st session – 1.30 pm to 3.30 pm.
2nd session – 4.10 pm to 6.10 pm.
3rd session – 6.30 pm to 8.30 pm. pic.twitter.com/st9f2P1VEl— Johns. (@CricCrazyJohns) December 24, 2023