SNP
Will Jacks, RCB vs GT, IPL 2024: క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని రికార్డును తాజాగా ఆర్సీబీ ఆటగాడు సాధించాడు. కేవలం 6 నిమిషాల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి అదరగొట్టాడు. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Will Jacks, RCB vs GT, IPL 2024: క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని రికార్డును తాజాగా ఆర్సీబీ ఆటగాడు సాధించాడు. కేవలం 6 నిమిషాల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి అదరగొట్టాడు. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
ఐపీఎల్ వేదికగా క్రికెట్ చరిత్రలోనే గతంలో కనీవినీ ఎరుగని రికార్డులు బద్దలు అవుతున్నాయి. 287 లాంటి అత్యంత భారీ స్కోర్లు, 262 లాంటి అతి పెద్ద రన్ ఛేజ్‌లు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే.. ఈ ఐపీఎల్ 2024 రికార్డుల పుట్టగా మారిపోయింది. తాజాగా ఆర్సీబీ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ సైతం ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో అలాంటి రికార్డు కూడా ఎవరూ సాధించలేదు. కేవలం 6 నిమిషాల్లోనే హాఫ్ సెంచరీ నుంచి సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తొలి హాఫ్ సెంచరీ చేసేందుకు బాగా టైమ్ తీసుకున్నే జాక్స్.. తర్వాత 50 పరుగులు కొట్టడానికి కేవలం 10 బంతులు, 6 నిమిషాలు తీసుకున్నాడు. 6.42 నిమిషాల సమయంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన జాక్స్, 6.48 నిమిషాలకు సెంచరీ కంప్లీట్ చేశాడు. ఇది క్రికెట్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీగా నిలుస్తుంది.
టైమ్ పరంగా, బాల్స్ పరంగా.. విల్ జాక్స్ చేసిన.. సెకండ్ హాఫ్ 50 రన్స్‌తో చరిత్ర తిరగరాశాడు. గుజరాత్ నిర్దేశించిన 201 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీకి అద్భుత విజయాన్ని అందిస్తూ.. కేవలం 41 బంతుల్లోనే 5 ఫోర్లు, 10 సిక్సులతో విధ్వంసం సృష్టించి సరిగ్గా 100 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. చివర్లో విజయానికి ఒక రన్ అవసరమైన సమయంలో ఏకంగా సిక్స్ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అప్పుడు జాక్స్ 94 రన్స్ వద్ద నాటౌట్‌గా ఉన్నాడు. అయితే.. తొలి 50 రన్స్ చేయడానికి జాక్స్ 31 బంతులు తీసుకున్నాడు. ఇది కూడా వేగవంతమైన హాఫ్ సెంచరీనే కానీ, అసలు విధ్వంసం.. నెక్ట్స్ 50 రన్స్ కొట్టడంలో ఉంది.
31 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న జాక్స్.. సెంచరీ మార్క్‌ను అందుకోవడానికి కేవలం 10 బంతుల తీసుకున్నాడు. దీన్ని బట్టి విల్ జాక్స్ విధ్వంస ఏ రేంజ్‌లో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఒక ఎండ్‌లో కోహ్లీ ఫిఫ్టీ పూర్తి చేసుకుని ఉండటంతో.. ఈ ఛేజ్‌ను ఆర్సీబీ ప్రశాంత పూర్తి చేసుకుంటుందని అంతా భావించారు. కానీ, విల్ జాక్స్ ఒక్కసారిగా శివాలెత్తడంతో.. 16 ఓవర్లలోనే ఆర్సీబీ 206 పరుగులు చేసి గుజరాత్ టైటాన్స్‌ను చిత్తుగా ఓడించింది. పైగా ఈ విజయంతో ఆర్సీబీ రికార్డు కూడా సాధించింది. 200 ప్లస్ రన్స్ ఛేజ్‌ను అతి తక్కువ ఓవర్లలో పూర్తి చేసిన టీమ్‌గా నిలిచింది. మరి ఈ మ్యాచ్‌లో విల్ జాక్స్ సృష్టించిన విధ్వంసంతో పాటు.. 50 నుంచి 100కి చేరుకోవడానికి కేవలం 10 బంతులు, 6 నిమిషాలు తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#WillJacks #ViratKohli𓃵 #RCBvGT #IPLUpdate pic.twitter.com/4kyFhp1gID
— Sayyad Nag Pasha (@nag_pasha) April 29, 2024