SNP
Will Jacks, Virat Kohli, RCB vs GT: గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో విల్ జాక్స్ వీరవిహారం చేశాడు. 41 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అయితే.. ఇంత వేగంగా ఆడేందుకు మాత్రం కోహ్లీ పెట్టిన టార్చర్ కారణంగా నిలిచింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Will Jacks, Virat Kohli, RCB vs GT: గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో విల్ జాక్స్ వీరవిహారం చేశాడు. 41 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అయితే.. ఇంత వేగంగా ఆడేందుకు మాత్రం కోహ్లీ పెట్టిన టార్చర్ కారణంగా నిలిచింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాడు విల్ జాక్స్ ఎలాంటి విధ్వంసం సృష్టించాడో అందరికీ తెలిసిందే. 201 టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీ కేవలం 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదిపారేసిందంటే.. అది జాక్స్ వల్లే. కేవలం 41 బంతుల్లోనే 5 ఫోర్లు, 10 సిక్సులతో 100 పరుగులు చేసి.. మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. తొలుత 31 బంతుల్లో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసిన విల్ జాక్స్.. సెంచరీ మార్క్ అందుకోవడానికి కేవలం 10 బంతులు మాత్రమే తీసుకున్నాడు. ఇది నెక్ట్స్ లెవెల్ విధ్వంసం. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత.. కేవలం సిక్సుల తోనే డీల్ చేశాడు జాక్స్. అతని దెబ్బకు గుజరాత్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ సైతం చేతులెత్తేశాడు.
అయితే.. హాఫ్ సెంచరీ చేయానికి 31 బంతులు తీసుకున్న విల్ జాక్స్.. తర్వాత అంత విధ్వంసకరంగా ఆడేందుకు ఒక కారణం ఉంది. విరాట్ కోహ్లీ పెడుతున్న టార్చర్‌ను తట్టుకోలేకనే.. విల్ జాక్స్ సిక్సులు కొట్టి సెంచరీ పూర్తి చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా విరాట్ కోహ్లీనే వెల్లడించాడు. మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో విల్ జాక్స్ గురించి మాట్లాడిన కోహ్లీ.. ‘నేను సింగిల్స్, డబుల్స్ ఎక్కువ పరిగెత్తిస్తున్నాను, అని జాక్స్.. సిక్సులు కొట్టి సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు, మ్యాచ్ కూడా ముగించాడు.’ అని కోహ్లీ పేర్కొన్నాడు. సాధారణంగా కోహ్లీ వికెట్ల మధ్య వేగంగా పరిగెడుతూ.. సింగిల్ వచ్చే చోటు రెండు, రెండు రన్స్ వచ్చే చోట మూడు పరుగులు తీస్తూ ఉంటాడు.
కోహ్లీతో క్రీజ్‌లో ఉన్న బ్యాటర్.. రన్స్ కోసం పరుగులు పెట్టాల్సి ఉంటుంది. కోహ్లీతో సమానంగా వికెట్ల మధ్య రన్స్ తీయాలంటే అంత సులువైన విషయం కాదు. చాలా మంది బ్యాటర్లు కోహ్లీ దెబ్బకు అలసిపోతుంటారు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా విల్ జాక్స్ ఇదే విషయంలో భయపడ్డాడు. కోహ్లీ-జాక్స్ మధ్య భారీ భాగస్వామ్యం నమోదు అయింది. అయితే.. ఇలా ఉంటే కోహ్లీ రన్స్ కోసం పరిగెత్తించి, పరిగెత్తించి చంపేస్తాడని భయపడిన జాక్స్.. సిక్సుల మీద సిక్సులు కొట్టి.. మ్యాచ్‌ను ముగించాడు. దాంతో పాటే తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా, ఈ విజయంతో ఆర్సీబీ ఈ సీజన్‌లో మూడో విజయాన్ని నమోదు చేసింది. మరో నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే.. ఆర్సీబీకి ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. మరి ఈ మ్యాచ్‌లో విల్ జాక్స్ ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli hyping his team-mates is a special video to watch. ❤️ pic.twitter.com/3PHto0N7c7
— Johns. (@CricCrazyJohns) April 28, 2024