iDreamPost
android-app
ios-app

కుప్పకూలిన విండీస్ టాపార్డర్.. అద్భుతమైన క్యాచ్ తో ఆకట్టుకున్న సిరాజ్!

కుప్పకూలిన విండీస్ టాపార్డర్.. అద్భుతమైన క్యాచ్ తో ఆకట్టుకున్న సిరాజ్!

టీమిండియా టూర్ ఆఫ్ వెస్టిండీస్ 2023లో భాగంగా తొలి వన్డే జరుగుతోంది. డొమినికా వేదికగా వెస్టిండీస్- భారత జట్లు తొలి టెస్టులో తలపడుతున్నాయి. టాస్ గెలిచి వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలిరోజు టీమిండియా- విండీస్ బ్యాటర్లపై పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది. లంచ్ బ్రేక్ సమయానికి టాప్ ఆర్డర్ ని పెవిలియన్ కు చేర్చారు. 28 ఓవర్లలో కేవలం 68 పరుగులకే విండీస్ 4 వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతానికి వెస్టిండిస్ జట్టు డిఫెన్స్ లో పడిపోయింది. ఈ నాలుగు వికెట్లలో సిరాజ్ పట్టిన క్యాచ్ అందిరినీ ఆకట్టుకుంటోంది.

ఈ మ్యాచ్ లో సిరాజ్ పట్టిన అద్భుతమైన క్యాచ్ తో విండీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. 28వ ఓవర్ వేసేందుకు జడేజా వచ్చాడు. ఆ ఓవర్లో ఆఖరి బంతిని బ్లాక్ వుడ్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ, టైమింగ్ కాకపోవడంతో. మిడాఫ్ వైపు కొట్టాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్ వెనక్కు పరిగెత్తుకుంటూ వెళ్లి గాల్లోకి ఎగిరి ఆ బంతిని ఒంటిచేత్తో పట్టుకున్నాడు. తర్వాత నేలపై పడిపోవడంతో అతని మోచేతికి చిన్న గాయం కూడా అయింది. కానీ, వికెట్ దొరికింది అనే ఆనందం ముందు ఆ నొప్పి పెద్దగా కనిపించదు.

ప్రస్తుతం సిరాజ్ పట్టిన క్యాచ్ నెట్టింట వైరల్ అవుతోంది. అంతా సిరాజ్ ఫీల్డింగ్ ని మెచ్చుకుంటున్నారు. ఇంక మ్యాచ్ విషయానికి వస్తే.. వెస్టిండీస్ టాపార్డర్ పెద్దగా ఆకట్టుకోలేదు. బ్రాత్ వైట్(20), చంద్రపాల్(12), రేమన్ రేయిఫెయిర్(2), బ్లాక్ ఉడ్(14) పరుగులు మాత్రమే చేశారు. టీమిండియా ఫీల్డింగ్, బౌలింగ్ లో సమిష్టిగా రాణిస్తోంది. అశ్విన్ కి రెండు, శార్దూల్ ఠాకూర్, జడేజాకి చెరో వికెట్ దక్కింది. బౌలర్లు ఇదే జోరు కొనసాగిస్తే.. విండీస్ బ్యాటర్లను టీమిండియా చాలా తక్కువ స్కోర్ కే కట్టడి చేయగలుగుతుంది.