Nidhan
WI vs ENG: ఇంగ్లండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ స్టన్నింగ్ డెలివరీతో అందర్నీ అలరించాడు. అతడి దెబ్బకు స్టంప్స్ చెల్లాచెదురయ్యాయి.
WI vs ENG: ఇంగ్లండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ స్టన్నింగ్ డెలివరీతో అందర్నీ అలరించాడు. అతడి దెబ్బకు స్టంప్స్ చెల్లాచెదురయ్యాయి.
Nidhan
ఇంగ్లండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ గురించి తెలిసిందే. భీకర పేస్‌తో ప్రత్యర్థి జట్లను వణికిస్తుంటాడతను. బౌన్సర్లతో బ్యాటర్లను బెంబేలెత్తిస్తుంటాడు. క్రీజులోకి కొత్త బ్యాటర్ వస్తే వాళ్లతో ఆడుకుంటాడు. కన్సిస్టెంట్గా 90 మైళ్లకు తగ్గని పేస్‌తో బౌలింగ్ చేసే వుడ్‌ను ఫేస్ చేయాలంటే స్టార్ బ్యాటర్లు కూడా జడుసుకుంటారు. సరైన లైన్ అండ్ లెంగ్త్, లీథల్ పేస్‌తో నిప్పులు చెరిగే వుడ్ మరోమారు సత్తా చాటాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో అతడు ఓ స్టన్నింగ్ బాల్‌తో అలరించాడు. విండీస్ బ్యాటర్ కిర్క్ మెకంజీని క్లీన్‌బౌల్డ్ చేశాడు వుడ్. అతడి దెబ్బకు స్టంప్స్ చెల్లాచెదురయ్యాయి.
విండీస్ ఇన్నింగ్స్ 25వ ఓవర్ వేసిన వుడ్.. మూడో బంతిని ఏకంగా 146 కిలోమీటర్ల వేగంతో విసిరాడు. ఫుల్ లెంగ్త్‌లో పడిన బంతి బుల్లెట్లా దూసుకొచ్చింది. దాన్ని డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించి మెకంజీ ఫెయిలయ్యాడు. అతడి బ్యాట్ అంచును తాకిన బంతి కాస్తా వెళ్లి మిడిల్ స్టంప్‌ను గిరాటేసింది. దెబ్బకు మిడిల్ వికెట్ రెండు ముక్కలైంది. స్టంప్ మైక్‌తో ఉన్న వికెట్ కింది భాగం ఒకవైపు, మిగిలిన భాగం ఇంకో వైపు వెళ్లి పడింది. బెయిల్స్ ఎగిరి దూరంగా పడ్డాయి. మెకంజీకి అసలు ఏం జరిగిందో అర్థం కాక ఆ కన్ఫ్యూజన్లోనే క్రీజును వీడాడు. ఇక, ఇన్నింగ్స్ 26 ఓవర్లు ముగిసేసరికి విండీస్ 3 వికెట్లకు 97 పరుగులు చేసింది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (56 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. ఈ సిరీస్‌లో 2-0తో ఇంగ్లండ్ ఆధిక్యంలో ఉంది. మరి.. వుడ్ స్టన్నింగ్ డెలివరీ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
WHAT A BALL, MARK WOOD. 🥶👌 pic.twitter.com/waiuF79PIN
— Johns. (@CricCrazyJohns) July 26, 2024