iDreamPost
android-app
ios-app

Chris Gayle: వీడియో: గేల్ సిక్సర్ల సునామీ.. 44 ఏళ్ల వయసులోనూ అదే ఊచకోత!

  • Published Jul 08, 2024 | 2:53 PM Updated Updated Jul 08, 2024 | 2:53 PM

WCL 2024: విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ ఏం మారలేదు. 44 ఏళ్ల వయసులోనూ అపోజిషన్ టీమ్స్​ మీద విరుచుకుపడుతున్నాడు. వింటేజ్ గేల్​ను తలపిస్తూ సాగిన అతడి ఇన్నింగ్స్ ఐఫీస్ట్ అనే చెప్పాలి.

WCL 2024: విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ ఏం మారలేదు. 44 ఏళ్ల వయసులోనూ అపోజిషన్ టీమ్స్​ మీద విరుచుకుపడుతున్నాడు. వింటేజ్ గేల్​ను తలపిస్తూ సాగిన అతడి ఇన్నింగ్స్ ఐఫీస్ట్ అనే చెప్పాలి.

  • Published Jul 08, 2024 | 2:53 PMUpdated Jul 08, 2024 | 2:53 PM
Chris Gayle: వీడియో: గేల్ సిక్సర్ల సునామీ.. 44 ఏళ్ల వయసులోనూ అదే ఊచకోత!

క్రికెట్​లో ఇప్పుడు విధ్వంసకారులు ఎక్కువైపోయారు. ఏ టీమ్​లో చూసినా కనీసం ఇద్దరు, ముగ్గురు పించ్ హిట్టర్లు కనిపిస్తున్నారు. బాల్ పడిందే మొదలు బాదడమే వీళ్ల పని. అయితే పదిహేనేళ్ల కింద పరిస్థితి ఇలా ఉండేది కాదు. అప్పుడు బాల్​ను బలంగా బాదడం కంటే టెక్నిక్​తో షాట్లుగా మలచడం మీదే బ్యాటర్లు ఫోకస్ చేసేవారు. ఇప్పటిలా ఫ్లాట్​గా కాకుండా స్వింగ్, స్పిన్​కు అనుకూలించే పిచ్​లు ఉండేవి. తోపు బౌలర్లు ఉండటంతో బ్యాటర్లకు పరుగులు తీయాలంటే చెమటలు పట్టేవి. బౌండరీలు కొట్టినా సిక్సర్లు బాదడం అంటే పెద్ద రిస్క్​గా భావించేవారు. అలాంటి పరిస్థితుల్లోనూ కొందరు బ్యాటర్లు పిచ్​, బౌలర్‌‌, మ్యాచ్ కండీషన్​ను పట్టించుకోకుండా ఆకాశమే హద్దుగా చెలరేగేవారు. వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీకి తరలించేవారు. అలాంటి వారిలో క్రిస్ గేల్ ఒకడు.

పేస్, స్పిన్ అనే తేడాల్లేకుండా అందర్నీ బాదిపారేయడం గేల్ స్పెషాలిటీ. నీళ్లు తాగినంత ఈజీగా సిక్సులు కొట్టేవాడు. అతడు కొడితే ఏకంగా 100 మీటర్లకు పైనే వెళ్లేవి సిక్సులు. ఇదే టాలెంట్​తో వెస్టిండీస్​కు సింగిల్ హ్యాండ్​తో ఎన్నో ట్రోఫీలు అందించాడు గేల్. అలాంటోడు రిటైర్మెంట్ తర్వాత క్రికెట్​కు దూరంగా ఉంటున్నాడు. కానీ తాజాగా అతడో టోర్నమెంట్​లోకి దిగి రచ్చ రచ్చ చేశాడు. వరల్డ్ ఛాంపియన్​షిప్స్ ఆఫ్ లెజెండ్స్ పేరిట నిర్వహిస్తున్న మాజీ క్రికెటర్ల టోర్నీలో గిల్ హల్​చల్​ చేశాడు. సౌతాఫ్రికా లెజెండ్స్​తో జరిగిన మ్యాచ్​లో విధ్వంసం సృష్టించాడు. 40 బంతుల్లోనే 70 పరుగులు చేశాడు.

గేల్ ఇన్నింగ్స్​లో బౌండరీల కంటే సిక్సులే ఎక్కువ. 4 ఫోర్లు కొట్టిన ఈ లెజెండ్.. ఏకంగా 6 సిక్సులు బాదాడు. 175 స్ట్రయిక్​ రేట్​తో బ్యాటింగ్​ చేస్తూ మ్యాచ్​ను విండీస్​ వైపు తిప్పాడు. సౌతాఫ్రికా సంధించిన 174 పరుగుల టార్గెట్​ను మరో 6 వికెట్లు ఉండగానే వెస్టిండీస్ ఛేదించింది. యూనివర్స్ బాస్​తో పాటు చాద్విక్ వాల్టన్ (29 బంతుల్లో 56) కూడా అదరగొట్టడంతో విండీస్​ ఈజీగా టార్గెట్​ను ఛేజ్ చేసింది. గేల్ బ్యాటింగ్​ చూసిన నెటిజన్స్ అతడేం మారలేదని అంటున్నారు. 44 ఏళ్ల వయసులోనూ అదే జోష్​, అదే ఊచకోత అని అంటున్నారు. సౌతాఫ్రికాపై అతడి సునామీ ఇన్నింగ్స్​ చూసి షాకవుతున్నారు. ఆ పిచ్చ కొట్టుడు ఏంటి బాస్ అంటున్నారు. ఈ ఏజ్​లోనూ నిలబడ్డ చోటు నుంచే అంత భారీ సిక్సులు ఎలా కొట్టగలుగుతున్నాడు అని ఆశ్చర్యపోతున్నారు. మరి.. గేల్ ఇన్నింగ్స్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.