iDreamPost
android-app
ios-app

వరల్డ్ కప్‌లో ఇండియా చేస్తున్న అతిపెద్ద తప్పు! అతన్ని ఇంకెన్నాళ్లు వేధిస్తారు?

  • Published Jun 10, 2024 | 1:17 PM Updated Updated Jun 10, 2024 | 1:17 PM

Sanju Samson, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా ప్రయోగాలు చేస్తోంది. అందులో కొన్ని అట్టర్‌ ఫ్లాప్‌ అవుతున్నాయి. అయినా కూడా ఓ క్రికెటర్‌ను వేధిస్తున్నారు. టీమిండియా చేస్తున్న ప్రయోగాలు ఏంటి? ఎవర్ని వేధిస్తున్నారో ఇప్పుడు చూద్దాం..

Sanju Samson, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా ప్రయోగాలు చేస్తోంది. అందులో కొన్ని అట్టర్‌ ఫ్లాప్‌ అవుతున్నాయి. అయినా కూడా ఓ క్రికెటర్‌ను వేధిస్తున్నారు. టీమిండియా చేస్తున్న ప్రయోగాలు ఏంటి? ఎవర్ని వేధిస్తున్నారో ఇప్పుడు చూద్దాం..

  • Published Jun 10, 2024 | 1:17 PMUpdated Jun 10, 2024 | 1:17 PM
వరల్డ్ కప్‌లో ఇండియా చేస్తున్న అతిపెద్ద తప్పు! అతన్ని ఇంకెన్నాళ్లు వేధిస్తారు?

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో టీమిండియా రెండో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ గెలిచిన రోహిత్‌ సేన.. పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం గెలుపుకోసం పోరాటం చేయాల్సి వచ్చింది. బ్యాటర్లు దారుణంగా విఫలమైన చోటు బౌలింగ్‌ బలంతో టీమిండియా ఈ మ్యాచ్‌ గెలిచింది. అయితే.. రెండు వరుస విజయాలు సాధించినా కూడా టీమిండియా పెద్ద తప్పు చేస్తోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఓ క్రికెటర్‌ కెరీర్‌తో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కావాలనే చెలగాటం ఆడుతోందని, అతన్ని ఇంకెన్నాళ్లు వేధిస్తారంటూ క్రికెట్‌ అభిమానులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ క్రికెటర్‌ ఎవరునుకుంటున్నారా? ఇంకెవరూ సంజు శాంసన్‌.

టీమిండియాలో ఎప్పుడో 2015లోనే ఎంట్రీ ఇచ్చిన ఈ మోస్ట్‌ టాలెంటెడ్‌ క్రికెటర్‌.. ఈ పాటికి ఇండియన్‌ క్రికెట్‌లో మరో కోహ్లీలా ఉండాల్సినోడు. కానీ, మనోడికి సరైన అవకాశాలు ఇవ్వలేదు. అరాకోర అవకాశాలు ఇచ్చినా.. అందులో కొన్ని సక్సెస్‌, కొన్నింట్లో ఫెయిల్‌ అయ్యాడు సంజు. తాజాగా ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్‌ కప్‌కు మొదటి ఛాయిస్‌గా వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ స్థానానికి ఎంపికైనా.. ప్లేయింగ్‌ ఎలెవన్‌లో మాత్రం అతనికి స్థానం లేకుండా పోతుంది. అసలు టీమిండియాలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదంటూ.. క్రికెట్‌ అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

జట్టుతో చేస్తున్న ప్రయోగాల కారణంగా.. ఇప్పుడు గ్రూప్‌ స్టేజ్‌లో చిన్న టీమ్స్‌ ఉండబట్టి లాక్కొస్తున్నారని.. సూపర్‌ 8కి చేరిన తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా లాంటి పెద్ద టీమ్స్‌తో మ్యాచ్‌లు ఉంటాయి. అప్పుడు ఇవే ప్రయోగాలతో వెళ్తే ఎదురుదెబ్బలు తగలడం ఖాయం.  అయినా.. అసలు సంజు శాంసన్‌కు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు ఎందుకు ఇవ్వడం లేదు అనేది పెద్ద ప్రశ్న. కొన్నేళ్లుగా పాపం.. అతని విషయంలో ఇలా జరుగుతుంది. టీమిండియాలో ఒక బలిపశువుగా మారిపోయాడు సంజు శాంసన్‌. కెరీర్‌ స్టార్టింగ్‌లో అయితే పర్వాలేదు.. ఇప్పుడు కూడా అతని విషయంలో ఇలాంటి పక్షపాత ధోరణి అవలంభిస్తున్నారు. స్క్వౌడ్‌లోకి తీసుకున్నా.. ప్లేయింగ్‌ ఎలెవన్‌ చోటివ్వకుండా అతన్ని వేధిస్తున్నారు.

నలుగురు ఆల్‌రౌండర్లను జట్టులోకి తీసుకోవడానికి సంజు శాంసన్‌ను బెంచ్‌కే పరిమితం చేస్తున్నారు. అనవసరంగా కోహ్లీని ఓపెనర్‌గా ఆడిస్తున్నారు. కోహ్లీని ఓపెనర్‌గా ఆడించాలనే ఆలోచన ఇప్పటి వరకు మంచి ఫలితం ఇవ్వలేదు. పోనీ.. నలుగురు ఆల్‌ రౌండర్లను టీమ్‌లోకి తీసుకుంటున్నా.. అందులో శివమ్‌ దూబేకి అసలు బౌలింగే ఇవ్వడం లేదు. బౌలింగ్‌ ఇవ్వనిదానికి దూబే టీమ్‌లో ఎందుకు. కేవలం బ్యాటర్‌గా ఆడించాలంటే అతనికంటే సంజునే బెటర్‌ ఆప్షన్‌ అవుతాడు. రోహిత్‌తో కలిసి ఓపెన్‌ కూడా చేస్తాడు. అప్పుడు కోహ్లీ వన్‌డౌన్‌లోనే ఆడొచ్చు. ఇవన్నీ పట్టించుకోకుండా.. టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సంజు శాంసన్‌ కెరీర్‌ను సర్వనాశనం చేస్తున్నాడంటూ క్రికెట్‌ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.