iDreamPost
android-app
ios-app

Ayodhya: రోహిత్‌, కోహ్లీ.. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు ఎందుకు రాలేదు? కారణం ఏంటి?

  • Published Jan 22, 2024 | 7:13 PM Updated Updated Jan 22, 2024 | 7:13 PM

టీమిండియా స్టార్‌ క్రికెటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ.. అయోధ్యలో సోమవారం జరిగిన బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు హాజరుకాకపోవడంపై చర్చ జరుగుతోంది. అయితే.. వారిద్దరు ఎందుకు రాలేదో ఇప్పుడు కారణం తెలుసుకుందాం..

టీమిండియా స్టార్‌ క్రికెటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ.. అయోధ్యలో సోమవారం జరిగిన బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు హాజరుకాకపోవడంపై చర్చ జరుగుతోంది. అయితే.. వారిద్దరు ఎందుకు రాలేదో ఇప్పుడు కారణం తెలుసుకుందాం..

  • Published Jan 22, 2024 | 7:13 PMUpdated Jan 22, 2024 | 7:13 PM
Ayodhya: రోహిత్‌, కోహ్లీ.. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు ఎందుకు రాలేదు? కారణం ఏంటి?

అయోధ్యలో రామజన్మ భూమిలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కనుల పండువగా జరిగింది. చాలా మంది హిందువులు ఎన్నో ఏళ్లుగా కలగంటున్న రామ మందిర నిర్మాణం.. ఎట్టకేలకు పూర్తి అయింది. ఆ ఆలయంలోనే బాలరాముడు కొలువుదీరాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక మహోత్సవం జరిగింది. అయితే.. ఈ ప్రత్యేక కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. దేశంలోని సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకు రామమందిర ట్రస్ట్‌ ఆహ్వానాలు అందించింది.

ముఖ్యంగా పలువురు క్రికెటర్లకు ఆహ్వానాలు అందాయి. సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌, సౌరవ్‌ గంగూలీ, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, మహేంద్ర సింగ్‌ ధోని, అనిల్‌ కుంబ్లే, రవిచంద్రన్‌ అశ్విన్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌, రవీంద్ర జడేజాలకు ప్రాణప్రతిష్ఠలో పాల్గొనాలని పిలిచారు. వీరిలో సచిన్‌, కుంబ్లే, వెంకటేశ్‌ ప్రసాద్‌.. ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే.. టీమిండియా స్టార్‌ క్రికెటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ సైతం ఈ మహత్తర కార్యక్రమానికి వస్తారని అంతా భావించారు. కానీ, వాళ్లిద్దరూ ఈ కార్యక్రమానికి రాలేదు. అందుకు కారణాలు ఇప్పుడు చూద్దాం..

ఈ నెల 25 నుంచి టీమిండియా, ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. తొలి మ్యాచ్‌ హైదరాబాద్‌లోని ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే భారత్‌-ఇంగ్లండ్‌ జట్లు హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయిపోయి.. ప్రాక్టీస్‌ కూడా ముమ్మరంగా చేస్తున్నాయి. అయితే.. ఈ మ్యాచ్‌ ప్రాక్టీస్‌లో భాగంగానే రోహిత్‌ శర్మ కార్యక్రమానికి హాజరు కాలేదని తెలుస్తుంది. ఇక విరాట్‌ కోహ్లీ తన వ్యక్తిగత కారణాలతో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కాలేకపోయాడని సమాచారం. అయితే.. కోహ్లీ తన వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు కూడా దూరమైన విషయం తెలిసిందే. మరి రోహిత్‌, కోహ్లీ బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు హాజరు కాకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.