SNP
MS Dhoni, Surgery, Retirement: ఇండియన్ క్రికెట్‌లో స్వర్ణాక్షరాలతో లిఖించదగిన పేరు ధోని. అయితే.. ఇంత పేరు ప్రఖ్యాతలు వచ్చినా.. ధోని 42 ఏళ్లకే నరకం అనుభవిస్తున్నాడు. ఇంత బాధను ధోని ఎలా దాచాడు? ఎందుకు దాచాడు? పూర్తి వివరాలు మీ కోసం..
MS Dhoni, Surgery, Retirement: ఇండియన్ క్రికెట్‌లో స్వర్ణాక్షరాలతో లిఖించదగిన పేరు ధోని. అయితే.. ఇంత పేరు ప్రఖ్యాతలు వచ్చినా.. ధోని 42 ఏళ్లకే నరకం అనుభవిస్తున్నాడు. ఇంత బాధను ధోని ఎలా దాచాడు? ఎందుకు దాచాడు? పూర్తి వివరాలు మీ కోసం..
SNP
మహేంద్ర సింగ్ ధోని.. ఈ ఒక్క పేరు ఇండియన్ క్రికెట్‌ను ఊపేసింది. ప్రపంచ క్రికెట్‌లో ఇండియాను ఉన్నత శిఖరాలకు చేర్చింది. ఆటగాడిగా టీమిండియాలోకి ఒక పెను సంచలనంలా దూసుకొచ్చిన కుర్రాడు.. అతి తక్కువ కాలంలోనే టీమిండియాను నడిపించే బాధ్యతను అందుకున్నాడు.. ఆ దేవుడే ఇండియా కోసం ఒక నాయకుడిని పంపినట్లు.. అతను పట్టిందల్లా బంగారమైంది. అప్పుడెప్పుడో కపిల్ దేవ్ సారథ్యంలో 1983లో వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా.. మళ్లీ ఆ కప్పును ముద్దాడలేకపోయింది. హేమాహేమీలు సచిన్, గంగూలీ, ద్రవిడ్ లాంటి వాళ్లు కొన్నేళ్లపాటు టీమిండియాను ఏలినా.. ఆ కప్పును అందించలేకపోయారు. అలాంటిది.. 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. టీమిండియాకు 2011లో వన్డే వరల్డ్ కప్ అందించిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఆ క్షణం యావత్ భారతదేశం సంతోషంతో ఉప్పొంగింది.
అంతకంటే ముందే.. కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తొలి ఏడాదే.. 2007లో తొలి టీ20 వరల్డ్ కప్‌ను కెప్టెన్‌గా ఇండియాకు అందించాడు. ఆ తర్వాత 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియాను ఛాంపియన్‌గా నిలిపాడు. ఇలా కెప్టెన్ ఇండియన్ క్రికెట్‌లో మరే కెప్టెన్‌గా సాధ్యం కానీ, రికార్డులు, ఘనతలు సాధించాడు. కెప్టెన్‌గానే కాదు.. బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా ధోని.. పాత్ర ఇండియన్ క్రికెట్ టీమ్‌లో ఒక అద్భుతం. ముగ్గురు ఆటగాళ్ల స్థానం ఒక్క ధోనినే భర్తీ చేసేంత సామర్థ్యం, శక్తి అతని సొంతం. జట్టుకు అవసరమైన సమయంలో ఫినిషర్‌గా కూడా మారేవాడు. జట్టు కోసం ఎంత చేయాలో అంతకంటే ఎక్కువే చేశాడు. అందుకే ధోని అంటే.. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ.. క్రికెట్ అభిమానులు పడిచచ్చిపోతుంటారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ ధోని క్రేజ్ ఇంచు కూడా తగ్గలేదు.
ఐపీఎల్‌లో కేవలం అతని బ్యాటింగ్ చేసేందుకు మాత్రమే కొన్ని వేల మంది క్రికెట్ స్టేడియానికి వస్తున్నారు. ప్రేక్షకులు ఇంత ప్రేమ చూపిస్తుంటే.. మరి ధోని వాళ్ల కోసం ఏం చేశాడు? అంటే.. తన జీవితమే అంకితం ఇచ్చాడని చెప్పవచ్చు. ప్రస్తుతం ధోని వయసు 42 ఏళ్లు. ఒక క్రీడాకారుడికి 42 ఏళ్ల వయసు అంటే.. ఎంతో ఫిట్‌గా ఉంటారు. ఆట నుంచి రిటైర్ అయిపోయినా.. అప్పటి వరకు మెయిటేన్ చేసిన ఫిట్‌నెస్ వల్ల.. దృఢంగా ఉంటారు. కానీ, ధోని మాత్రం ఇప్పుడు చాలా రకాల నొప్పులతో బయటికి చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్నాడు. ఆట నుంచి రిటైర్ అయిపోయి.. కుటుంబంతో ఆనందంగా గడపాల్సిన సమయంలో సర్జరీలంటూ ఆస్పత్రుల పాలవుతున్నాడు. ఇదంతా దేని కోసం చేశాడు..? డబ్బు కోసమా అంటే అస్సలు కాదు. దేశం కోసం, తన ప్యాషన్ కోసం, తన అభిమానుల కోసం.
టీమిండియాకు కెప్టెన్ అంటే దాన్ని ఒక హోదాలా ఎప్పుడూ చూడలేదు ధోని. అదో బాధ్యతలా, టీమిండియా తలరాత మార్చే యజ్ఞంలా భావించాడు. వరల్డ్ కప్ కొట్టాలంటే గొప్ప ఆటగాళ్లు ఉంటే సరిపోదని, మంచి ఫిట్‌నెస్ కూడా ఉండాలని గుర్తించి.. దాని కోసం హేమాహేమీ ఆటగాళ్లు ఒళ్లు ఒంచేలా చేశాడు. అలా చేసినందుకు సీనియర్లను తొక్కేస్తున్నారని విమర్శలు వచ్చినా.. దేశం కోసం భరించాడు. కానీ ధోని ఫిట్‌నెస్‌పై ఫోకస్‌కు ఫలితమే 2011 వన్డే వరల్డ్ కప్. పైగా ఒక కెప్టెన్‌గా ధోని విపరీతంగా రెస్ట్ లేకుండా ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు. కంటిన్యూగా చాలా టెస్టులు ఆడిన రికార్డ్ కూడా ధోని పేరిటే ఉంది. తన కెరీర్‌లో 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. దాంతో పాటే ఐపీఎల్ కూడా.. ఐపీఎల్‌లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్ ధోనినే.. ఇలా ఆట కోసం దేశం తన శరీరాన్ని అర్పించేశాడు.
క్రికెటర్ కావాలనే కసితో.. ఇండియన్ రైల్వేస్‌లో మంచి ఉద్యోగాన్ని సైతం వదిలేసి తన ప్యాషన్ వైపు అడుగులేశాడు. టీమిండియాలోకి అడుగుపెట్టింది మొదలు.. రిటైర్ అయ్యేంత వరకు రెస్ట్ లెస్ క్రికెట్ ఆడిన ధోని. ఇప్పుడు దాని ఫలితం అనుభవిస్తున్నాడు. 42 ఏళ్ల వయసులో వెన్ను నొప్పి, మొకాలి నొప్పి, కండాల నొప్పి.. ఇలా శరీరమంతా నొప్పుల కుప్పగా మారిపోయింది. ఇంత నరకం అనుభవించడానికి కారణం.. దేశం కోసం, తన అభిమానుల కోసం ధోని రెస్ట్ లెస్ క్రికెట్ ఆడటమే. ఈ సీజన్‌లో ధోని పరిగెత్తలేకపోతున్నాడు, బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు రావడం లేదు అని విమర్శించే వారు ఒక్క విషయం గుర్తు చేసుకోవాలి.. అసలు వికెట్ల మధ్య వేగంగా రన్స్ తీయడం నేర్పిందే ధోని. ఈ సీజన్ కేవలం తన అభిమానుల కోసం ఆడిన ధోని.. తన హండ్రెడ్ పర్సంట్ ఎఫర్ట్స్ ఇచ్చాడు. కండరాల నొప్పి, వెన్నునొప్పితో బాధపడుతూ కూడా ఆడాడు. ఇప్పుడు ఐపీఎల్ ముగియడంతో ధోని సర్జరీ కోసం లండన్‌కు వెళ్లాడు. ఇంత కాలం.. తన శరీరం అనుభవిస్తున్న బాధను దాచి.. అభిమానులు కోసం ఇంత నరకం చూస్తున్న ధోని నిజంగా ఒక గ్రేట్ స్పోర్ట్స్ మెన్. సెల్యూట్ ధోని. మరి ధోని తన గాయాలను దాచి.. క్రికెట్ ప్రేమికుల కోసం ఆడుతూ.. 42 ఏళ్ల వయసులోనే ఇంత నరకం అనుభవిస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
MS Dhoni’s dedication to the game is second to none
Be it playing with an ice pack or knee injury in a WC Final to take Indian cricket to greater heights. Or playing 2 IPL seasons at age 40+ with severe knee issue for franchise & fans. And he’s done it all with good intention ❤️ pic.twitter.com/FLaUX8GQan
— 𝐒𝐈𝐕𝐘 🇺🇸🇮🇳 (@Sivy_KW578) May 7, 2024