iDreamPost
android-app
ios-app

చెన్నైలో మ్యాచ్‌ పెట్టుకొని.. కుల్దీప్‌ను ఎందుకు పక్కనబెట్టారు? కారణం ఇదే!

  • Published Sep 19, 2024 | 5:02 PM Updated Updated Sep 19, 2024 | 5:02 PM

IND vs BAN, Kuldeep Yadav: బంగ్లాదేశ్​తో తొలి టెస్ట్​లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్​ చూసి చాలా మంది అభిమానులు షాక్ అయ్యారు. చెన్నైలో మ్యాచ్ పెట్టుకొని ఎక్స్​ట్రా స్పిన్నర్​ను తీసుకోకపోవడం ఏంటని ఆశ్చర్యపోయారు. చైనామన్ కుల్దీప్ యాదవ్​ను పక్కనబెట్టడంతో విస్తుపోయారు.

IND vs BAN, Kuldeep Yadav: బంగ్లాదేశ్​తో తొలి టెస్ట్​లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్​ చూసి చాలా మంది అభిమానులు షాక్ అయ్యారు. చెన్నైలో మ్యాచ్ పెట్టుకొని ఎక్స్​ట్రా స్పిన్నర్​ను తీసుకోకపోవడం ఏంటని ఆశ్చర్యపోయారు. చైనామన్ కుల్దీప్ యాదవ్​ను పక్కనబెట్టడంతో విస్తుపోయారు.

  • Published Sep 19, 2024 | 5:02 PMUpdated Sep 19, 2024 | 5:02 PM
చెన్నైలో మ్యాచ్‌ పెట్టుకొని.. కుల్దీప్‌ను ఎందుకు పక్కనబెట్టారు? కారణం ఇదే!

భారత్-బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయింది. రెండు టెస్టుల ఈ సిరీస్​లోని తొలి మ్యాచ్​ చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఇవాళ మొదలైంది. టాస్ గెలిచిన పర్యాటక జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. అయితే ఈ మ్యాచ్​లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్​ చూసి చాలా మంది అభిమానులు షాక్ అయ్యారు. చెన్నైలో మ్యాచ్ పెట్టుకొని ఎక్స్​ట్రా స్పిన్నర్​ను తీసుకోకపోవడం ఏంటని ఆశ్చర్యపోయారు. చైనామన్ కుల్దీప్ యాదవ్​ను పక్కనబెట్టడం ఏంటని విస్తుపోయారు. ఈ మ్యాచ్​లో భారత్ ముగ్గురు పేస్ బౌలర్లను ఆడించాలని డిసైడ్ అయింది. పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, ఆకాశ్​దీప్​ను తుదిజట్టులోకి తీసుకుంది. స్పిన్ విభాగం బాధ్యతల్ని రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మోస్తున్నారు. ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, ఇద్దరు స్పిన్ ఆల్​రౌండర్లు, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగింది మెన్ ఇన్ బ్లూ. అంతా బాగానే ఉన్నా కుల్దీప్​ను ఎందుకు తీసుకోలేదనే చర్చ మొదలైంది. దీనికి ఓ రీజన్ ఉంది.

సాధారణంగా చెన్నైలో టెస్ట్ మ్యాచ్ అంటే పిచ్ పూర్తిగా స్పిన్నర్లకు సహకరిస్తుంది. మన దేశంలో ఉన్న కంప్లీట్ స్పిన్ ఫ్రెండ్లీ వికెట్లలో ఒకటిగా చెపాక్​ను చెబుతుంటారు. ముగ్గురు స్పిన్నర్లతో ఇక్కడ బరిలోకి దిగడం భారత్​కు రివాజుగా మారింది. ఈ గ్రౌండ్​లో స్పిన్ అస్త్రంతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కరి చేసి భారీ విజయాలు సాధిస్తూ వచ్చింది. కానీ ఈసారి రోహిత్ శర్మ ప్లాన్ మార్చాడు. రీసెంట్​గా పాకిస్థాన్​ను వాళ్ల సొంతగడ్డపై బంగ్లాదేశ్ వైట్​వాష్ చేసింది. అందులో షకీబ్ అల్ హసన్​తో పాటు మెహ్దీ హసన్ మిరాజ్ లాంటి స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు. ఇదే స్పిన్ అటాక్​తో టర్నింగ్​కు అనుకూలించే భారత పిచ్​లపై రోహిత్ సేనను కూడా ఓడిస్తామంటూ బంగ్లాదేశ్ కెప్టెన్ షంటో కొన్నాళ్ల కింద భారత్​కు వార్నింగ్ ఇచ్చాడు. కొన్నాళ్లుగా టీమిండియా బ్యాటర్లు స్పిన్ ఆడటంలో ఫెయిల్ అవడం, రోహిత్ మినహాయించి మిగతా బ్యాటర్లకు స్పిన్ వీక్​నెస్​గా మారడంతో చెన్నై పిచ్​ను పేస్ ట్రాక్​గా ఛేంజ్ చేయించారు.

బుమ్రా, సిరాజ్​తో కూడిన బలమైన పేస్ అటాక్​తో బంగ్లాకు షాక్ ఇవ్వాలని డిసైడ్ అయిన రోహిత్-కోచ్ గంభీర్.. అందులో భాగంగానే నల్ల మట్టికి బదులు చెపాక్​లో ఎర్ర మట్టి వికెట్​ను తయారు చేయించారు. ముగ్గురు స్పిన్నర్లకు బదులు ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్ల అటాక్​తో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. దీంట్లో భాగంగానే కుల్దీప్​కు బదులు సీమర్ ఆకాశ్​దీప్​ను ప్లేయింగ్ ఎలెవన్​లోకి తీసుకున్నారు. సహజంగా స్పిన్​కు అనుకూలించే చెపాక్​లో ఎప్పటిలాగే నల్ల మట్టి పిచ్ రూపొందిస్తే కుల్దీప్ టీమ్​లో ఉండేవాడు. కానీ ప్రత్యర్థికి ముక్కుతాడు వేయడానికి కాస్త డిఫరెంట్ స్ట్రాటజీతో వెళ్లిన రోహిత్ అండ్ కో చైనామన్ బౌలర్​కు బదులు ఆకాశ్​దీప్​ను తుదిజట్టులోకి తీసుకున్నారు. ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందనేది మ్యాచ్ ముందుకు వెళ్లే కొద్దీ తెలిసిపోతుంది. పిచ్ మార్పు, కుల్దీప్​ను పక్కనబెట్టడం భారత్​కు కలిసొస్తుందో లేదో ఇంకొన్ని సెషన్స్​తో తేలిపోతుంది. మరి.. కుల్దీప్​ను పక్కనబెట్టడం కరెక్టా? కాదా? మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.