ఈ IPLలో ఫస్ట్‌ మ్యాచ్‌లో ధోని వర్సెస్‌ కోహ్లీనే ఎందుకు! కారణం ఏంటంటే?

IPL 2024, CSK vs RCB: ఐపీఎల్‌ 2024 సీజన్‌ కోసం సర్వం సిద్ధమైంది. శుక్రవారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఈ సీజన్‌ ఆరంభం కానుంది. అయితే.. ఈ రెండు టీమ్స్‌ మధ్యే తొలి మ్యాచ్‌ ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..

IPL 2024, CSK vs RCB: ఐపీఎల్‌ 2024 సీజన్‌ కోసం సర్వం సిద్ధమైంది. శుక్రవారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఈ సీజన్‌ ఆరంభం కానుంది. అయితే.. ఈ రెండు టీమ్స్‌ మధ్యే తొలి మ్యాచ్‌ ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..

క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ కొత్త సీజన్‌ శుక్రవారం నుంచి గ్రాండ్‌గా స్టార్ట్‌ కానుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం క్రికెట్‌ స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ధోని కెప్టెన్సీలోని సీఎస్‌కే, ఫాఫ్‌ డుప్లెసిస్‌ సారథ్యంలోని ఆర్సీబీ జట్లు.. తొలి పోరు సంసిద్ధంగా ఉన్నాయి. తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించి.. టోర్నీని సక్సెస్‌తో ప్రారంభించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. అయితే.. తొలి మ్యాచ్‌ను ఈ రెండు జట్ల మధ్యే ఎందుకు నిర్వహిస్తున్నారనే? డౌట్‌ అందరిలో ఉంది.

ఎందుకంటే.. ఇప్పటి వరకు జరిగిన చాలా ఐపీఎల్‌ సీజన్స్‌లో గత సీజన్‌లో ఫైనల్‌ ఆడిన జట్లే.. తర్వాత సీజన్‌ తొలి మ్యాచ్‌ ఆడే సాంప్రదాయం ఉంది. కానీ, ఈ సారి ఆ పరంపరను బ్రేక్‌ చేస్తూ.. ఐపీఎల్‌ 2023 సీజన్‌లో 6వ స్థానంలో నిలిచిన ఆర్సీబీ జట్టుతో ఓపెనింగ్‌ మ్యాచ్‌ ఆడిస్తున్నారు. అసలు లెక్క ప్రకారం.. ఐపీఎల్‌ 2023 సీజన్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ ఆడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య ఈ ఏడాది తొలి మ్యాచ్‌ జరగాలి. కానీ, గుజరాత్‌ టైటాన్స్‌ స్థానంలో ఆర్సీబీని తీసుకొచ్చింది బీసీసీఐ. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రూపంలో సీఎస్‌కే తొలి మ్యాచ్‌ ఆడటంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, ఆర్సీబీ ఎందుకు ఫస్ట్‌ మ్యాచ్‌ ఆడుతుంది. దాని వెనుక కారణం ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు.

అయితే.. తొలి మ్యాచ్‌లో గత సీజన్‌లో ఫైనల్‌ ఆడిన జట్లే ఆడాలనే కచ్చితమైన రూల్‌ ఏమీ లేదు. కాకపోతే అదో సాంప్రదాయంగా ఐపీఎల్‌ గవర్నింగ్‌ కమిటీ పాటిస్తూ వస్తుంది. అయితే.. ఐపీఎల్‌ షెడ్యూల్‌పై పూర్తి అధికారం బీసీసీఐకే ఉంటుంది. టీమ్స్‌ ఆడే మ్యాచ్‌ల సంఖ్య, వాటి మధ్య గ్యాప్‌, గ్రౌండ్‌ అందుబాటులో ఉందా లేదా? మ్యాచ్‌ ఎక్కడ నిర్వహించాలి, లాజిస్టిక్స్‌ ఇలాంటివి అన్ని చూసుకుని.. బీసీసీఐ ఐపీఎల్‌ షెడ్యూల్‌ను రూపొందిస్తుంది. పైగా గత సీజన్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో టీఆర్‌పీ రేటింగ్‌, ఎక్కువ మంది చూసిన మ్యాచ్‌ ఇలాంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని, కొత్త సీజన్‌ ఆరంభం అదిరిపోవాలని కూడా బీసీసీఐ ఈ మ్యాచ్‌ను ఫస్ట్‌ మ్యాచ్‌గా నిర్వహిస్తూ ఉండొచ్చు. ఏది ఏమైనా.. ధోని వర్సెస్‌ కోహ్లీ ఫైట్‌ మాత్రం క్రికెట్‌ అభిమానులకు పండగ అనే చెప్పాలి. మరి ఐపీఎల్‌ 2024 ఫస్ట్‌ మ్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments