iDreamPost
android-app
ios-app

IND vs SL: మ్యాచ్‌ టై అయినా.. సూపర్‌ ఓవర్‌ ఎందుకు పెట్టలేదు? కారణం ఇదే!

  • Published Aug 03, 2024 | 7:43 AM Updated Updated Aug 03, 2024 | 7:43 AM

IND vs SL, Super Over: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేను భారత్‌ టైగా ముగించింది. సింపుల్‌గా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చకుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు సూపర్ ఓవర్‌ ఎందుకు పెట్టలేదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

IND vs SL, Super Over: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేను భారత్‌ టైగా ముగించింది. సింపుల్‌గా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చకుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు సూపర్ ఓవర్‌ ఎందుకు పెట్టలేదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Aug 03, 2024 | 7:43 AMUpdated Aug 03, 2024 | 7:43 AM
IND vs SL: మ్యాచ్‌ టై అయినా.. సూపర్‌ ఓవర్‌ ఎందుకు పెట్టలేదు? కారణం ఇదే!

భారత్‌-శ్రీలంక మధ్య కొలంబో వేదికగా శుక్రవారం జరిగిన తొలి వన్డే టైగా ముగిసిన విషయం తెలిసిందే. ఇరు జట్లు హోరాహోరీగా తలపడిన మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది.. ఇక ఛేజింగ్‌కు దిగిన టీమిండియా కూడా సరిగ్గా 230 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. రెండు జట్లు సమాన స్కోర్లు చేయడంతో మ్యాచ్‌ను టైగా ముగించాయి. అయితే.. ఈ రెండు జట్ల మధ్య జులై 30న జరిగిన చివరి టీ20 మ్యాచ్‌ కూడా టైగా అప్పుడు సూపర్‌ ఓవర్ నిర్వహించారు.

కానీ, శుక్రవారం జరిగిన తొలి వన్డేలో మాత్రం.. మ్యాచ్‌ టై అయినా కూడా.. మ్యాచ్‌ ఫలితం తేల్చేందుకు సూపర్‌ ఓవర్‌ పెట్టలేదు. దీంతో.. క్రికెట్‌ అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. అసలు సూపర్‌ ఎందుకు నిర్వహించలేదనే ప్రశ్న క్రికెట్‌ ఫ్యాన్స్‌ నుంచి ఉత్పన్నం అవుతోంది. టీ20ల్లో నిర్వహించే సూపర్‌ ఓవర్‌ వన్డేలకు ఎందుకు లేదని అంటున్నారు. అందుకు కారణం ఏంటంటే.. ఐసీసీ రూల్స్‌. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ నిబంధనల ప్రకారం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో మ్యాచ్‌ టై అయితే.. దాన్ని టైగానే భావిస్తారు. సూపర్‌ నిర్వహించరు. కానీ, టీ20 మ్యాచ్‌ టై అయితే సూపర్‌ నిర్వహిస్తారు. అలాగే.. ఐసీసీ టోర్నమెంట్స్‌, ఆసియా కప్, ముక్కోణపు సిరీస్ వన్డే ఫార్మాట్‌లో జరిగినా.. వాటిలో టై అయిన మ్యాచ్‌లకు సూపర్ ఓవర్లను నిర్వహిస్తారు. నిన్న జరిగిన మ్యాచ్‌.. కేవలం భారత్‌-శ్రీలంక మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లో భాగమే కనుక సూపర్‌ ఓవర్‌ ఆడించలేదు. ఇక మిగిలిన రెండు వన్డేలు గెలిచిన వారే సిరీస్‌ విజేతగా నిలుస్తారు. చెరొకటి గెలిస్తే.. సిరీస్‌ సమం అవుతుంది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. 101కే 5 వికెట్లు కోల్పోయినా.. చివర్లో దునిత్‌ వెల్లలాగే 67 పరుగులతో లంకను ఆదుకున్నాడు. ఓపెనర్‌ పథుమ్‌ నిస్సంకా 56 పరుగులు చేసి రాణించాడు. భారత బౌలర్లలో అర్షదీప్‌ 2, అక్షర్‌ పటేల్‌ 2, సిరాజ్‌, శివమ్‌ దూబే, కుల్దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ తలో వికెట్‌ తీసుకున్నారు. ఇక 231 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియాకు.. కెప్టెన్‌ కమ్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అద్భుతమైన స్టార్ట్‌ అందించాడు. 47 బంతుల్లో 58 పరుగులు చేసి రాణించాడు. కేఎల్‌ రాహుల్‌ 31, అక్షర్‌ పటేల్‌ 33 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. ఇక చిరవ్లో దూబే 25 పరుగులతో మ్యాట్‌ టై చేశాడు కానీ, గెలిపించలేకపోయాడు. మొత్తంగా 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఇండియా ఆలౌట్‌ కావడంతో మ్యాచ్‌ టైగా ముగిసింది. మరి ఈ మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌ నిర్వహించి ఉంటే.. ఎవరు గెలిచే వాళ్లో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.