iDreamPost
android-app
ios-app

KKR vs SRH: క్వాలిఫైయర్స్‌-1లో ఫిలిప్స్‌ని ఎందుకు పక్కనపెట్టారు?

  • Published May 22, 2024 | 12:31 PM Updated Updated May 22, 2024 | 12:38 PM

Glenn Phillips, KKR vs SRH, IPL 2024: క్వాలిఫైయర్‌-1లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌ తర్వాత అసలు ఎస్‌ఆర్‌హెచ్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ను ఎందుకు ఆడించడం లేదంటూ సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం..

Glenn Phillips, KKR vs SRH, IPL 2024: క్వాలిఫైయర్‌-1లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌ తర్వాత అసలు ఎస్‌ఆర్‌హెచ్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ను ఎందుకు ఆడించడం లేదంటూ సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published May 22, 2024 | 12:31 PMUpdated May 22, 2024 | 12:38 PM
KKR vs SRH: క్వాలిఫైయర్స్‌-1లో ఫిలిప్స్‌ని ఎందుకు పక్కనపెట్టారు?

కేకేఆర్‌తో జరిగిన క్వాలిఫైయర్‌-1లో గెలిచి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫైనల్‌ చేరుతుంది చాలా మంది తెలుగు క్రికెట్‌ అభిమానులు ఆశలు పెట్టుకున్నాడు. ఎందుకంటే.. మ్యాచ్‌ జరిగేది అహ్మాదాబాద్‌లో కావడం, అది బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌ కావడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ బంపర్‌ విక్టరీ కొట్టడం ఖాయమనుకున్నారు. అంతా కోరుకున్నట్లే.. ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్నాడు. కానీ, ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఎవరికీ ఊహించని షాక్‌ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఆడతాడు అనుకున్న గ్లెన్‌ ఫిలిప్స్‌ను ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి తీసుకోకుండా బెంచ్‌కే పరిమితం చేశాడు కెప్టెన్‌ కమిన్స్‌. అతను తీసుకున్న ఈ నిర్ణయంతో అంతా షాక్‌ తిన్నారు. అలాగే ఎస్‌ఆర్‌హెచ్‌ చిత్తుచిత్తుగా ఓడిపోవడంతో.. అసలు ఫిలిప్స్‌ను ఎందుకు ఆడించలేదనే ప్రశ్న తీవ్రంగా వినిపిస్తోంది.

గ్లెన్‌ ఫిలిఫ్స్‌ లాంటి ఆల్‌రౌండర్‌ను ఆడించకపోవడంతో కెప్టెన్‌ కమిన్స్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమికి కమిన్స్‌ తీసుకున్న ఈ నిర్ణయమే కారణం అంటూ చాలా మంది ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులే కమిన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో టీమ్‌కు ఎంతో సపోర్టివ్‌గా ఉంటే.. ఫిలిప్స్‌ను ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి తీసుకోకుండా కమిన్స్‌ తప్పు చేశాడని.. స్క్వౌడ్‌లో ఫిలిప్స్‌ లాంటి ఆటగాడిని పెట్టుకుని.. అతన్ని ఆడించకపోవడంపై మండిపడుతున్నారు.

విజయకాంత్ వియస్కాంత్ స్థానంలో ఫిలిప్స్‌ను ఆడించి ఉంటే బాగుండేదని ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. కనీసం ఇంప్యాక్ట్‌ ప్లేయర్‌గానైనా ఫిలిప్స్‌ను ఆడించి ఉండాల్సిందని పేర్కొంటున్నారు. అయితే.. ఫిలిప్స్‌ను ఎందుకు ఆడించలేన్న విషయం ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే.. అతను పూర్తిగా ఫిట్‌గా లేడా, లేక సరైన ఫామ్‌లో లేడా అనేది తెలియాల్సి ఉంది. మరి ఫిలిప్స్‌ను ఆడించకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.