అన్ని ఘనతలు సాధించిన రోహిత్-కోహ్లీకి రాలేదు.. ధావన్‌కే ఎందుకా బిరుదు?

Shikhar Dhawan, Rohit Sharma, Virat Kohli: టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఇంటర్నేషన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. దీంతో అతడు సాధించిన ఘనతలను అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. అతడి సెంచరీలు, విన్నింగ్ నాక్స్ ను తలచుకుంటున్నారు.

Shikhar Dhawan, Rohit Sharma, Virat Kohli: టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఇంటర్నేషన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. దీంతో అతడు సాధించిన ఘనతలను అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. అతడి సెంచరీలు, విన్నింగ్ నాక్స్ ను తలచుకుంటున్నారు.

టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ సెన్సేషనల్ అనౌన్స్ మెంట్ చేశాడు. జెంటిల్మన్ గేమ్ కు వీడ్కోలు చెబుతున్నట్లు తెలిపాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ తో పాటు డొమెస్టిక్ క్రికెట్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు శనివారం ఉదయం సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ వీడియో పోస్ట్ చేశాడు. దేశం కోసం ఆడాలనే తన డ్రీమ్ నెరవేరిందని.. ఇన్నాళ్లూ భారత్ కు ఆడటం గర్వకారణమన్నాడు. తన జర్నీలో అండగా నిలిచిన వారందరికీ థ్యాంక్స్ చెప్పాడు గబ్బర్. తనను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ వచ్చిన ఫ్యాన్స్ కు కూడా అతడు కృతజ్ఞతలు తెలిపాడు. స్టన్నింగ్ బ్యాటింగ్, సూపర్బ్ ఫీల్డింగ్ తో దశాబ్ద కాలానికి పైగా ఎంటర్ టైన్ చేసిన ధావన్ రిటైర్మెంట్ తో అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. అతడు సాధించిన ఘనతలను గుర్తుచేసుకుంటున్నారు. ఈ తరుణంలోనే మిస్టర్ ఐసీసీ అనే ట్యాగ్ గబ్బర్ కు ఎలా వచ్చిందనేది కూడా డిస్కస్ చేసుకుంటున్నారు.

టీమిండియా మూలస్తంభాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు లేని బిరుదు ధావన్ కు ఉంది. అదే మిస్టర్ ఐసీసీ. రోకో జోడీ ద్వైపాక్షిక సిరీస్ లతో పాటు ఐసీసీ టోర్నీల్లోనూ అదరగొట్టారు. వరల్డ్ కప్స్ లో సెంచరీల మీద సెంచరీలు బాదారు. ఇటీవల పొట్టి ప్రపంచ కప్ నూ టీమిండియా ఒడికి చేర్చారు. ఇన్ని ఘనతలు సాధించినా వీళ్లకు లేని మిస్టర్ ఐసీసీ అనే బిరుదు ధావన్ కు ఉంది. అతడ్ని అలా ఎందుకు పిలుస్తారనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఏ ప్లేయర్ అయినా ఐసీసీ టోర్నీ అంటే భయపడతాడు. అక్కడ ఉండే కాంపిటీషన్, ప్రెజర్ ను తట్టుకోలేక కుదేలైపోతాడు. కానీ ధావన్ అలా కాదు. ఐసీసీ టోర్నీల్లో తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ బయటకు తీస్తాడు. బ్యాట్ తో శివతాండవం చేస్తాడు. ప్రత్యర్థి బౌలర్లను పిచ్చకొట్టుడు కొడతాడు. అవతల ఉన్నది ఏ టీమ్, ఎవరు బౌలింగ్ వేస్తున్నారనేది పట్టించుకోకుండా చావగొడతాడు.

కెరీర్ మొదట్లోనే ఐసీసీ స్పెషలిస్ట్ గా ధావన్ మీద ముద్రపడింది. ఛాంపియన్స్ ట్రోఫీ-2013లో అతడు 5 వన్డేలు ఆడి ఏకంగా 363 పరుగులు చేశాడు. ఆ టోర్నమెంట్ లో భారత్ విజేతగా నిలవడంలో అతడికి కీలకపాత్ర. ఐసీసీ ఈవెంట్స్ లో 50 ఓవర్ల ఫార్మాట్ లో 65 ప్లస్ యావరేజ్ కలిగిన ఏకైక బ్యాటర్ ధావనే కావడం విశేషం. కనీసం 1,000 పరుగులు చేసిన బ్యాటర్ల తో ఈ లిస్ట్ ను రూపొందించగా గబ్బర్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2013తో పాటు వన్డే వరల్డ్ కప్-2015, ఛాంపియన్స్ ట్రోఫీ-2017లో భారత్ తరఫున హయ్యెస్ట్ స్కోరర్ గా నిలిచాడు ధావన్. ఐసీసీ ఈవెంట్స్ లో పూనకం వచ్చినట్లు అతడు చెలరేగి ఆడేవాడు. అందుకే అభిమానులు ముద్దుగా మిస్టర్ ఐసీసీ అని పిలిచేవారు. వన్డే క్రికెట్ లో సేనా (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలపై సెంచరీ చేసిన ఏకైక టీమిండియా ఓపెనర్ గా కూడా ధావన్ ఘనతకెక్కాడు. అలాంటోడి రిటైర్మెంట్ తో భారత క్రికెట్ లో ఒక శకం ముగిసిందనే చెప్పాలి.

Show comments