Virat Kohli: బంగ్లాతో తొలి టెస్ట్.. గంభీర్ కు భయపడే విరాట్ కోహ్లీ రివ్యూ తీసుకోలేదా?

Why didn't Virat Kohli take a review, Gautam Gambhir: బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో విరాట్ కోహ్లీ రివ్యూ తీసుకోకపోవడం ప్రస్తుతం అందరిని షాక్ కు గురిచేస్తోంది. అయితే కొందరు మాత్రం కోచ్ గౌతమ్ గంభీర్ కు భయపడే డీఆర్ఎస్ తీసుకోలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

Why didn't Virat Kohli take a review, Gautam Gambhir: బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో విరాట్ కోహ్లీ రివ్యూ తీసుకోకపోవడం ప్రస్తుతం అందరిని షాక్ కు గురిచేస్తోంది. అయితే కొందరు మాత్రం కోచ్ గౌతమ్ గంభీర్ కు భయపడే డీఆర్ఎస్ తీసుకోలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో దారుణంగా విఫలం అయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో కేవలం 6 రన్స్ మాత్రమే చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్ లో 17 పరుగులు మాత్రమే చేసి మెహిదీ హసన్ బౌలింగ్ లో అవుటై నిరాశపరిచాడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో తన అవుట్ విషయంలో కోహ్లీ రివ్యూ తీసుకోకుండా తప్పు చేశాడు. ఎక్కువ శాతం రివ్యూలు తీసుకునే విరాట్.. ఈ మ్యాచ్ లో మాత్రం శుబ్ మన్ గిల్ చెబుతున్నా వినకుండా డీఆర్ఎస్ తీసుకోకుండా పెవిలియన్ చేరాడు. అయితే కోహ్లీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు భయపడే రివ్యూ తీసుకోలేదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ రివ్యూ తీసుకోకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మెహదీ హసన్ మిరాజ్ వేసిన 20వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని మిరాజ్ స్టంప్ టూ స్టంప్ వేయగా.. కోహ్లీ ఆక్రాస్ ది వికెట్ ఆడబోయాడు. కానీ బంతి మిస్ అయ్యి ప్యాడ్స్ కు తాకింది. దాంతో అప్పీల్ చేయడంతో అంపైర్ విరాట్ కోహ్లీని ఎల్బీగా అవుట్ ఇచ్చాడు. అయితే.. అది నాటౌట్ శుబ్ మన్  గిల్ రివ్యూ తీసుకోవాలని ఎంత చెబుతున్నా వినకుండా కోహ్లీ పెవిలియన్ వైపు వెళ్లిపోయాడు. ఆ తర్వాత రిప్లేలో చూడగా.. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకున్నట్లు స్పష్టమైంది. దాంతో కోహ్లీ రివ్యూ ఎందుకు తీసుకోలేదు అంటూ చర్చ మెుదలైంది.

విరాట్ కోహ్లీ రివ్యూ ఎందుకు తీసుకోలేదు? ప్రస్తుతం అందరి నోట ఇదే ప్రశ్న. గతంలో చాలా సందర్భాల్లో ఎల్బీడబ్ల్యూల విషయంలో డీఆర్ఎస్ తీసుకునే వాడు కోహ్లీ. కొన్ని సార్లు అది ఔట్ అని తెలిసినా రివ్యూ తీసుకునేవాడు. కానీ.. ఇప్పుడు మూడు రివ్యూలు అందుబాటులో ఉన్నా.. గిల్ చెబుతున్నా వినకుండా పెవిలియన్ కు వెళ్లిపోయాడు. రివ్యూ తీసుకునేందుకు రిస్క్ తీసుకోలేదు. ఎందుకు? అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రం కొత్త హెడ్ కోచ్ గంభీర్ కు భయపడే డీఆర్ఎస్ తీసుకోలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ రివ్యూ తీసుకుని అది ఫెయిల్ అయితే.. గంభీర్ ఏమంటాడో అని కోహ్లీ అనుకున్నాడు కాబోలు.. అందుకే తీసుకోలేదు అంటూ వారు చెప్పుకొస్తున్నారు. కానీ.. కోహ్లీ ఫ్యాన్స్ తో పాటుగా మరికొందరు క్రికెట్ లవర్స్ దీన్ని ఖండిస్తున్నారు. బాల్ బ్యాట్ కు తాకిందా? లేక ప్యాడ్ కు తాకిందా? అన్న విషయాన్ని విరాట్ గ్రహించలేకపోయాడని అందుకే రివ్యూ తీసుకోలేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అంతే తప్ప గంభీర్ కు భయపడో.. మరొకరికి భయపడో కోహ్లీ ఇలా చేయలేదని వారు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments