iDreamPost
android-app
ios-app

Mallika Sagar: IPL 2024 వేలంలో స్పెషల్ అట్రాక్షన్ గా మల్లికా సాగర్! ఎవరీ అందాల బొమ్మ?

ఐపీఎల్ 2024 వేలంలో అందరి కళ్లు ఆటగాళ్లపై కాకుండా.. ఓ అందాల బొమ్మపై పడ్డాయి. ఆ సుందరి పేరే మల్లికా సాగర్. ఈ వేలం ఆక్షనీర్. ఐపీఎల్ వేలాన్ని అద్బుతంగా నిర్వహిస్తోంది. దీంతో ఈ మల్లికా సాగర్ ఎవరు? అని నెటిజన్లు తెగ వెతుకుతున్నారు.

ఐపీఎల్ 2024 వేలంలో అందరి కళ్లు ఆటగాళ్లపై కాకుండా.. ఓ అందాల బొమ్మపై పడ్డాయి. ఆ సుందరి పేరే మల్లికా సాగర్. ఈ వేలం ఆక్షనీర్. ఐపీఎల్ వేలాన్ని అద్బుతంగా నిర్వహిస్తోంది. దీంతో ఈ మల్లికా సాగర్ ఎవరు? అని నెటిజన్లు తెగ వెతుకుతున్నారు.

Mallika Sagar: IPL 2024 వేలంలో స్పెషల్ అట్రాక్షన్ గా మల్లికా సాగర్! ఎవరీ అందాల బొమ్మ?

ఐపీఎల్ 2024 వచ్చే ఏడాది షురూ కాబోతుంది. ఈ క్రికెట్ జాతరలో మొత్తం 10 టీమ్స్ పోటీ పడుతున్న సంగతి విదితమే. అయితే ఇప్పుడు అందరి చూపు డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరిగే ఐపీఎల్ వేలంపైనే ఉంది. ఆ రోజురానే వచ్చింది. ఈ వేలంలో 1166 మంది దేశీ, విదేశీ ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మేటి ఆటగాళ్లను ఫ్రాంచైజీలు ఆక్షన్‌లో కొనుగోలు చేస్తుంటాయి. ఈ వేలంలో ఏ క్రీడాకారుడు ఎంత ధరకు పలుకుతారు, ఎవరూ అత్యధిక, రికార్డు ధరకు పలుకుతారు అన్న దానిపై ఆసక్తి నెలకొంది. అలాగే ఈ సారి వేలంలో కొనుగోలు అయ్యే క్రీడాకారులే కాదు.. ఆ ఆక్షనర్ కూడా సెంట్రాఫ్ ఎట్రాక్షన్ కాబోతున్నారు. కారణం.. పాత ఆక్షనర్ ప్లేసులో కొత్త సభ్యురాలు రావడమే. ఆ అందాల బొమ్మ పేరు మల్లికా సాగర్.

మిగిలిన ఐపీఎల్ వేలంతో పోలిస్తే.. ఈ ఆక్షన్ మాత్రం చాలా స్పెషల్. ఐపీఎల్ -17వ ఎడిషన్ వచ్చే ఏడాది జరగబోతుంది. ఈ క్రమంలో దుబాయ్ వేదికగా డిసెంబర్ 19(మంగళవారం) మినీ వేలం ప్రారంభమైంది. రికార్డు స్థాయిలో ఆటగాళ్లు అమ్ముడుపోతున్నారు. ఒకరిని మించి ఒకరు అన్నట్లుగా వేలం సాగుతోంది. ఇదిలా ఉండగా.. గతంలో ఉండే ఆక్షనర్, నిర్వాహకుడు హ్యూ ఎడ్మీడ్ ఈ వేలంలో కనిపించడు. ఎందుకంటే ఎడ్మీడ్ కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. 2022లో వేలం జరుగుతున్న సమయంలో ఆయన కుప్పకూలిన సంగతి విదితమే. దీంతో ఎడ్మీడ్ అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆయన సేవలకు స్వస్తి చెప్పింది. ఆయన స్థానంలో మల్లికా సాగర్ ను వేలం నిర్వాహకురాలిగా నియమించింది. ప్రస్తుతం ఈ అందాల బొమ్మ ఐపీఎల్ వేలాన్ని అద్బుతంగా నిర్వహిస్తోంది. దీంతో ఈ మల్లికా సాగర్ ఎవరు? అని నెటిజన్లు తెగ వెతుకుతున్నారు.

ఇక మల్లికా సాగర్ కు వేలం నిర్వాహకురాలిగా అనుభవం ఉంది. 2023 ఫిబ్రవరిలో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన తొలి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపిఎల్) ప్లేయర్ వేలం సమయంలో ఆక్షనర్‌గా వ్యవహరించారు. 2021 ప్రో కబడ్డీ లీగ్ వేలం నిర్వాహకురాలిగా కూడా వ్యవహరించి.. తొలి భారతీయ సంతతి మహిళా ఆక్షనర్‌గా చరిత్ర సృష్టించింది ఈ అందాల భామ. ముంబైలో నివసిస్తున్న మల్లికా.. ఫిలడెల్పియాలోని బ్రైన్ మావర్ కాలేజ్ నుండి ఆర్ట్ డిగ్రీని పొందారు. 2001లోక్రిస్టీ అనే ఫేమస్ ఆక్షన్ కంపెనీలో తన కెరీర్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు వరుసగా మహిళా ఐపీఎల్ తో పాటు మెన్ ఐపీఎల్ ఆక్షన్లలో ఆమె కీ రోల్ పోషిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే.. ఆమెకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నా.. ఒక పెద్ద ఆక్షన్‌కు నిర్వాహకురాలిగా వ్యవహరించడం ఇదే తొలిసారి. దీంతో మల్లికా ఐపీఎల్ 2024 వేలాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుందా? అని ఎదురుచూశారు. వారందరికి తాజాగా నిర్వహించిన వేలంతో తన సత్తా ఏంటో చూపించింది.

 

View this post on Instagram

 

A post shared by Women’s Premier League (WPL) (@wplt20)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి