iDreamPost
android-app
ios-app

AUS vs WI: ఆసీస్ ను చిత్తు చేసిన విండీస్.. 27 ఏళ్ల తర్వాత చారిత్రక విజయం!

ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య ఉత్కంఠగా సాగిన రెండో టెస్ట్ లో 8 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది కరేబియన్ టీమ్. దీంతో ఆస్ట్రేలియా గడ్డపై చరిత్రాత్మక విజయం సాధించి రికార్డు నెలకొల్పింది.

ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య ఉత్కంఠగా సాగిన రెండో టెస్ట్ లో 8 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది కరేబియన్ టీమ్. దీంతో ఆస్ట్రేలియా గడ్డపై చరిత్రాత్మక విజయం సాధించి రికార్డు నెలకొల్పింది.

AUS vs WI: ఆసీస్ ను చిత్తు చేసిన విండీస్.. 27 ఏళ్ల తర్వాత చారిత్రక విజయం!

వెస్టిండీస్ చరిత్రాత్మక విజయం సాధించింది. రెండు టెస్ట్ లు, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది వెస్టిండీస్. అందులో భాగంగా ఆడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో 10 వికెట్ల తేడాతో విండీస్ పై ఘన వి జయం సాధించింది ఆతిథ్య ఆసీస్. ఇక ఇదే జోరును రెండో టెస్ట్ మ్యాచ్ లో కూడా చూపించాలని భావించిన కంగారూ టీమ్ కు భారీ షాకిచ్చింది వెస్టిండీస్. రెండో టెస్ట్ లో అద్భుతంగా రాణించిన కరేబియన్ టీమ్ 8 పరుగుల తేడాతో విజయం సాధించి.. సిరీస్ ను 1-1తో డ్రా చేసుకుంది. దీంతో 27 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై చరిత్రాత్మక విజయం సాధించి రికార్డు నెలకొల్పింది.

ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య ఉత్కంఠగా సాగిన రెండో టెస్ట్ లో 8 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది కరేబియన్ టీమ్. ఓవర్ ఓవర్ కు నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తించిన ఈ మ్యాచ్ లో అద్భుత పోరాటంతో.. విండీస్ విజయకేతనం ఎగురవేసింది. ఈ సిరీస్ తోనే టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన విండీస్ యువ బౌలర్ షామర్ జోసెఫ్ ఆసీస్ ను వణికించాడు. రెండో ఇన్నింగ్స్ లో ఏకంగా 7 వికెట్లు పడగొట్టి కంగారూల పతనాన్ని శాసించాడు.

westindies historical win

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. విండీస్ తొలి ఇన్నింగ్స్ లో 311 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 193 రన్స్ చేసింది. అనంతరం ఆస్ట్రేలియా 289/9 డిక్లేర్, రెండో ఇన్నింగ్స్ లో 207 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. 215 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ కు వెస్టిండీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. కంటిన్యూస్ గా వికెట్లు తీస్తూ.. ప్రత్యర్థి టీమ్ పై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే తొలిసారి ఓపెనర్ గా బరిలోకి దిగిన స్టీవ్ స్మిత్(91*) పరుగులు చేసి.. అజేయంగా నిలిచినా.. జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు.

ఇక మిగతా బ్యాటర్లలో కామెరూన్ గ్రీన్(42) పరుగులు మాత్రమే చేశాడు. సహచర ఆటగాళ్ల నుంచి ఏ మాత్రం సహకారం లభించకపోవడంతో.. స్మిత్ అసాధారణ పోరాటం వృథా అయ్యింది. విండీస్ బౌలర్ షామర్ జోసెఫ్ దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు క్రీజ్ లో ఎక్కువసేపు నిలబడలేకపోయారు. అతడు 7 వికెట్లు తీసి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఇక ఈ విజయంతో 27 సంవత్సరాల చరిత్రను తిరిగి లిఖించింది కరేబియన్ టీమ్. ఆసీస్ గడ్డపై 1997 నుంచి ఇప్పటి వరకు ఒక్క టెస్ట్ విజయం కూడా సాధించలేదు విండీస్ టీమ్. తాజా గెలుపుతో చరిత్రాత్మక విజయం తమ ఖాతాలో వేసుకుంది. మరి వెస్టిండీస్ సాధించిన ఈ చిరస్మరణీయ విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి