iDreamPost
android-app
ios-app

T20 World Cup: కరేబియన్లకు కంగారు పుట్టించిన PNG.. చిన్న టీమే కానీ చాలా డేంజర్‌!

  • Published Jun 03, 2024 | 8:34 AMUpdated Jun 03, 2024 | 8:34 AM

West Indies, Papua New Guinea, WI vs PNG: టీ20 వరల్డ్‌ కప్‌ 2024 టోర్నీ రెండో మ్యాచ్‌లో క్రికెట్‌ లోకం ఉలిక్కిపడే సంచలనం చోటు చేసుకునేది. కానీ, కొద్దిలో మిస్‌ అయింది. అయినా కూడా పీఎన్‌జీ పోరాటానికి అంతా ఫిదా అయిపోయారు. వెస్టిండీస్‌ను పీఎన్‌జీ ఎలా వణికించిందో ఇప్పుడు తెలుసుకుందాం..

West Indies, Papua New Guinea, WI vs PNG: టీ20 వరల్డ్‌ కప్‌ 2024 టోర్నీ రెండో మ్యాచ్‌లో క్రికెట్‌ లోకం ఉలిక్కిపడే సంచలనం చోటు చేసుకునేది. కానీ, కొద్దిలో మిస్‌ అయింది. అయినా కూడా పీఎన్‌జీ పోరాటానికి అంతా ఫిదా అయిపోయారు. వెస్టిండీస్‌ను పీఎన్‌జీ ఎలా వణికించిందో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jun 03, 2024 | 8:34 AMUpdated Jun 03, 2024 | 8:34 AM
T20 World Cup: కరేబియన్లకు కంగారు పుట్టించిన PNG.. చిన్న టీమే కానీ చాలా డేంజర్‌!

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. తొలి మ్యాచ్‌ కెనడా, అమెరికా మధ్య జరిగింది ఈ మ్యాచ్‌లో అమెరికా అద్భుత విజయం సాధించి.. ఈ మెగా టోర్నీని విజయవంతంగా మొదలుపెట్టింది. ఒక రెండో మ్యాచ్‌లో సంచలనం కొద్దిలో మిస్‌ అయ్యింది. టీ20 క్రికెట్‌కే బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఉన్న వెస్టిండీస్‌ క్రికెటర్లనే వణికించింది పీఎన్‌జీ(పాపువా న్యూ గినియా). కొద్దిలో మిస్‌ అయ్యారు కానీ, లేదంటే రెండు సార్లు టీ20 ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్‌ లాంటి భయంకరమైన జట్టును టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ఓడించి కొత్త చరిత్ర సృష్టించేవాళ్లు. మ్యాచ్‌ గెలవకపోయినా.. పీఎన్‌జీ ఆటగాళ్లు అందరి హృదయాలను గెలుచుకున్నారు. అయితే.. పీఎన్‌జీ చిన్న టీమ్‌ అని లైట్‌ తీసుకుంటే.. చాలా డేంజర్‌ అనే సంకేతాలు ఇచ్చింది ఈ మ్యాచ్‌తో.

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో వెస్టిండీస్‌ అంటేనే టీ20 క్రికెట్‌కు మారుపేరులా మారిపోయింది. ఎందుకంటే.. ప్రపంచంలో ఏ మూలన టీ20 లీగ్‌ జరిగినా.. కరేబియన్‌ క్రికెటర్లతే హవా. అలాంటిది.. పీఎన్‌జీ లాంటి పసికూన జట్టుపై 137 పరుగుల టార్గెట్‌ ఛేజ్‌ చేసేందుకు ఆపసోపాలు పడింది. బ్రాండన్‌ కింగ్‌, ఛార్లెస్‌, నికోలస్‌ పూరన్‌, రొవ్‌మన్‌ పొవెల్‌, రుథర్‌ఫర్డ్‌, ఆండ్రీ రస్సెల్‌ లాంటి టీ20 వీరులు ఉన్న టీమ్‌.. పీఎన్‌జీ దెబ్బకు వణికిపోయింది. ఒకానొక దశలో ఓటమి దిశగా సాగింది. కానీ, ఎట్టకేలకు లక్ష్యాన్ని కాపాడుకుని పరువు నిలుపుకుంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ గెలిచినా.. అద్భుతమైన పోరాటంతో అందరి మనసులు గెలిచింది మాత్రం పీఎన్‌జీనే. చివరి వెస్టిండీస్‌ క్రికెటర్లు సైతం మ్యాచ్‌ తర్వాత పీఎన్‌జీ ఆటగాళ్లను అభినందించారు. వారి పోరాట స్ఫూర్తికి ఫిదా అయిపోయారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పీఎన్‌జీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. సెసే బావు 43 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్‌తో 50 పరుగులు చేసి మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. వికెట్‌ కీపర్‌ కిప్లిన్ దొరిగా(27, కెప్టెన్‌ అసద్ వాలా(21) పర్వాలేనిపించారు. విండీస్‌ బౌలర్లలో రస్సెల్‌ 2, అల్జారీ జోసెఫ్‌ 2 వికెట్లతో రాణించారు. ఇక 137 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ కాస్త తడబడుతూనే లక్ష్యాన్ని చేరుకుంది. 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 137 రన్స్‌ చేసి గెలిచింది. బ్రాండన్‌ కింగ్‌34, పూరన్‌ 27, రోస్టన్‌ ఛెస్‌ 42 పరుగులతో రాణించారు. పీఎన్‌జీ బౌలర్లలో కెప్టెన్‌ అసద్‌ వాలా రెండు వికెట్లతో రాణించారు. మరి ఈ మ్యాచ్‌లో విండీస్‌ గెలిచినా.. పీఎన్‌జీ చేసిన పోరాటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి