iDreamPost
android-app
ios-app

వుమెన్స్ టీ20 చరిత్రలో రికార్డ్ రన్ ఛేజింగ్.. భారీ లక్ష్యాన్ని దంచికొట్టిన విండీస్

  • Author Soma Sekhar Published - 07:52 AM, Tue - 3 October 23
  • Author Soma Sekhar Published - 07:52 AM, Tue - 3 October 23
వుమెన్స్ టీ20 చరిత్రలో రికార్డ్ రన్ ఛేజింగ్.. భారీ లక్ష్యాన్ని దంచికొట్టిన విండీస్

అంతర్జాతీయ క్రికెట్ లో ప్రతీరోజు ఏదో ఒక రికార్డ్ బద్దలవుతూనే ఉంటుంది. కొన్ని రికార్డులు బ్యాటర్లు సాధిస్తే.. మరికొన్ని రికార్డులు బౌలర్లు బ్రేక్ చేస్తారు. ఈ రెండూ కాక జట్లు కూడా సమష్టిగా రాణించి కొత్త చరిత్రలకు శ్రీకారం చుడుతున్నాయి. తాజాగా జరిగిన మహిళా టీ20 మ్యాచ్ లో రికార్డ్ రన్ ఛేజ్ నమోదు అయ్యింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో విండీస్ మహిళల టీమ్ దుమ్మురేపింది. విండీస్ మహిళా బ్యాటర్ విధ్వంసకర శతకంతో చెలరేగడంతో.. మహిళా టీ20 క్రికెట్ చరిత్రలో రికార్డ్ రన్ ఛేజ్ నమోదు అయ్యింది.

ఇంటర్నేషనల్ మహిళా టీ20 క్రికెట్ లో అత్యుత్తమ రన్ ఛేజింగ్ నమోదైంది. సోమవారం ఆస్ట్రేలియా-విండీస్ వుమెన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆసీస్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని దంచికొట్టారు విండీస్ వుమెన్స్. దీంతో ఇంగ్లాండ్ పేరిట ఉన్న 199 రన్ ఛేజ్ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. తాజాగా ఆస్ట్రేలియా-విండీస్ వుమెన్స్ మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో ఫోబ్ లిచ్ ఫీల్డ్ రికార్డ్ అర్దశతకాన్ని నమోదు చేసింది. మహిళా క్రికెట్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును సమం చేసింది. కేలవం 18 బంతుల్లోనే లిచ్ ఫీల్డ్ హాఫ్ సెంచరీని నమోదు చేసి.. కివీస్ ప్లేయర్ సోఫీ డివైన్ రికార్డ్ ను సమం చేసింది. మిగతా బ్యాటర్లలో ఎల్లిస్ పెర్రీ(70), వేర్హమ్(32), బెత్ మూనీ(29) పరుగులతో రాణించారు. విండీస్ బౌలర్లలో బ్యాట్ తో మెరుపు శతకం చేసిన హేలీ మాథ్యూస్ 3 వికెట్లతో రాణించింది.

అనంతరం రికార్డ్ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ వుమెన్స్ టీమ్.. ఎలాంటి తడబాటు లేకుండా లక్ష్యం వైపు సాగింది. హేలీ మాథ్యూస్ బ్యాటింగ్ ముందు ఆసీస్ బౌలర్లు చేతులెత్తేశారు. ఆకాశమే హద్దుగా చెలరేగిన హేలీ కేవలం 53 బంతుల్లోనే శతకం బాది ఔరా అనిపించింది. ఈ మ్యాచ్ లో మెుత్తం 64 బంతులు ఎదుర్కొన్న హేలీ 20 ఫోర్లు, 5 సిక్సర్లతో 132 పరుగులు చేసి ఒంటి చేత్తో జట్టును గెలిపించింది. హేలీకి తోడు స్టెఫానీ టేలర్ 59 పరుగులతో రాణించింది. దీంతో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది విండీస్ టీమ్. తొలి మ్యాచ్ లో కూడా హేలీ 99 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి ఒక్క రన్ తేడాతో సెంచరీ చేజారింది. మరి రికార్డ్ సెంచరీతో రికార్డు ఛేజ్ చేసిన విండీస్ వుమెన్స్ టీమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.